ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం | EMCET students free bus facility | Sakshi
Sakshi News home page

ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం

Published Wed, May 21 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:37 AM

EMCET students free bus facility

 ఖమ్మం కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఈ నెల 22న నగరంలోని స్వర్ణభారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఆ కళాశాల కరస్పాండెంట్ చావా ప్రతాప్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఎనిమిది గంటలకు నగరంలోని మయూరి సెంటర్, గాంధీచౌక్, రైల్వే స్టేషన్ , జడ్‌పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్, రోటరీ నగర్‌లో బస్సులు సిద్ధంగా ఉంటాయని వివరించారు. దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు.
 
 విజయ కళాశాల ఆధ్వర్యంలో..
 కొణిజర్ల: ఈ నెల 22 న జరిగే ఎంసెట్ (ఇంజనీరింగ్, మెడికల్) ప్రవేశ పరీక్షలకు తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాయబోవు విద్యార్థుల సౌకర్యార్థం బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు విజయ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంసెట్ పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థుల కోసం పాలేరు, కల్లూరు, వైరా, వల్లభి, బోనకల్, తిరుమలాయపాలెం నుంచి ఉదయం 7:15 గంటలకు బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. ఖమ్మం నగరం నుంచి పరీక్షకు హాజయరయ్యే విద్యార్థుల కోసం పెవెలియన్ గ్రౌండ్, రైల్వేస్టేషన్, ఇల్లెందు క్రాస్ రోడ్‌ల నుంచి ఉదయం 7:45 నిమిషాలకు బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. విద్యార్థులను, వారి వెంట వచ్చే తల్లిదండ్రులు, సంరక్షకుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 
 లక్ష్య కళాశాల ఆధ్వర్యంలో ..

 కొణిజర్ల..: తనికెళ్లలో గల లక్ష్య ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్ష రాసే విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కళాశాల చైర్మన్ గుర్రం తిరుమలరావు, సెక్రటరీ, కరస్పాడెంట్ కొప్పురావూరి శ్రీనివాస్,ట్రెజరర్ బూరుగడ్డ కృష్ణమోహన్, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రఘురామ్‌లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం బస్టాండ్, రైల్వేస్టేషన్, గాంధీఛౌక్, ముస్తఫానగర్, బైపాస్‌రోడ్, ఖానాపురం , శ్రీనివాసనగర్, వైరాల నుంచి  ప్రత్యేక బస్సులు ఉదయం 8:20 నిమిషాలకు బయలుదేరుతాయని తెలిపారు.
 
 ఆడమ్స్ కళాశాల ఆధ్వర్యంలో..
 పాల్వంచ: ఖమ్మంలో ఈ నెల 22వ తేదీన జరిగే ఎంసెట్ 2014 పరీక్షకు హాజరయ్యే దూర ప్రాంత విద్యార్థిని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు స్థానిక ఆడమ్స్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ పరిటాల చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మణుగూరు, భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం ప్రాంతాల నుంచి ఖమ్మంకు తరలివెళ్లే వారు ఉదయం 5 గంటలకు ఆయా ప్రాంతాల్లో బస్సులు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు సెల్ నంబర్ 94400 05304,99661 96435లో సంప్రదించాలని కోరారు.
 
 అబ్దుల్ కలామ్ కళాశాల ఆధ్వర్యంలో..
 కొత్తగూడెం రూరల్: ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కొత్తగూడెం మండల సుజాతనగర్ పంచాయతీ వేపలగడ్డ గ్రామంలోని అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ కార్తిక్, ప్రిన్సిపాల్ జనార్థన్ ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, పాల్వంచ, టేకులపల్లి, కొత్తగూడెం, గౌతంపూర్ ఏరియా నుంచి బయలు దేరే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement