హాల్‌టికెట్లపై ఇంటర్ విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం సూచన
సాక్షి,హైదరాబాద్: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే వెబ్‌సైట్ ద్వారా వాటిని డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటర్ విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ .కృష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.bie.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరు కావాలని శనివారం చెప్పారు. సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫీజులు చెల్లించకపోతే హాల్‌టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్న విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యర్‌కుఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.