ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య | Inter students commit suicide | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్య

Published Sat, Apr 29 2023 9:50 AM | Last Updated on Sat, Apr 29 2023 10:17 AM

 కావ్య (18)   మౌనిక (15) - Sakshi

కళ్యాణదుర్గం: మున్సిపాలిటీ పరిధికి చెందిన మౌనిక (15) అనే ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాలమేరకు... ఒంటిమిద్ది గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మౌనిక ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్‌ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్ర పోయాక పురుగుల మందు తాగింది.

శుక్రవారం తెల్లవారు జామున అపస్మారక స్థితిలో ఉన్న మౌనికను హుటా హుటిన కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మౌనిక చనిపోయిందని నిర్ధారించారు. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన కుమార్తె విగాత జీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

తాడిపత్రిలో...
తాడిపత్రి: రూరల్‌ పరిధిలోని బిందెల కాలనీలో నాగేంద్ర, లక్ష్మినరసమ్మ దంపతుల రెండో కుమార్తె కావ్య (18) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో కావ్య ఫెయిల్‌ అయింది. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుంది. అయితే ఇంటి తలుపులు మూసివేయకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement