
సాక్షి, విశాఖపట్నం: గాజువాక శ్రీచైతన్య కళాశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభించింది. విశాఖలో కనిపించకుండా పోయిన ముగ్గురు విద్యార్థులు పవన్, దిలిప్, బాలీలను పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గుర్తించారు.
వీరు ముగ్గురు చదవుకోవడం ఇష్టం లేక హైదరాబాద్‌ల్ పానీపూరి అమ్ముకొని జీవించేందుకు నగరానికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా గాజువాక శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సవం చదువుతున్న పవన్, దిలీప్, బాబీ ముగ్గురు విద్యార్థులు ఈనెల 24న అదృశ్యమయ్యారు.
కాలేజ్‌కు అనిచెప్పి బయల్దేరి అని చెప్పి బయల్దేరి మళ్లీ ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి బుధవారం ముగ్గురిని సికింద్రాబాద్ స్టేషన్‌లో క్షేమంగా గుర్తించారు. విద్యార్థులను తమ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని పోలీసులు పేర్కొన్నారు.
చదవండి: ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment