గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ  | Telangana Government should ban the Globarina Company | Sakshi
Sakshi News home page

గ్లోబరీనా సంస్థను నిషేధించాలి: నారాయణ 

Published Sat, May 11 2019 5:21 AM | Last Updated on Sat, May 11 2019 5:21 AM

Telangana Government should ban the Globarina Company - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇంటర్‌ పరీక్షల నిర్వహణలో విఫలమైన గ్లోబరీనా సంస్థను తెలంగాణ ప్రభుత్వం నిషేధించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ డిమాండ్‌ చేశారు. పరీక్షల్లో జరిగిన అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బాధ్యత వహించాలన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఇంటర్‌ బోర్డు మొత్తం కార్పొరేట్ల మయమైందని, ప్రభుత్వ అసమర్థత వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement