సాక్షి,విజయవాడ : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీలో భారీగా వెలుగు చూసిన కరోనా కేసులపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. తిరుమల జూనియర్ కాలేజీలోని 163 మంది ఇంటర్ విద్యార్థులకు ఇటీవలె కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. వీరిని రాజమండ్రి తిరుమల జూనియర్ కాలేజీ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రూమ్స్‌లో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి తెలిపారు.
కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ గౌరిశ్వరావుతో మంత్రి ఆళ్లనాని ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే కరోనా నివారణకు ముందోస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుమల జూనియర్ కాలేజీలో పూర్తి స్థాయిలో సూపర్ శానిటేషన్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్లనాని ఆదేశించారు. కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసిస్తున్న ఇతర విద్యార్థులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హాస్టల్ కి తరలించి RTPCR పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
'కాకినాడ, ముమ్ముడివరం, రామచంద్రపురం, రాజమండ్రి, ప్రాంతాల్లో 41పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 50మీటర్లు దూరంలో కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. కరోనా సోకిన బాధితులకు 24గంటల పాటు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 35కంటోన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం. తిరుమల జూనియర్ కాలేజీ లో 400మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం వైద్య ఆరోగ్య శాఖ అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కరోనా ప్రభావం లేకుండా అన్ని ముందోస్తు చర్యలు తీసుకుంటున్నాం. అన్ని విద్యా సంస్థల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టాం. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు స్వచ్చందంగా ముందుకు రావాలి' అని ఆళ్లనాని తెలిపారు.
చదవండి : పెరుగుతున్న కరోనా కేసులు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి
Comments
Please login to add a commentAdd a comment