సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు ఐదు రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి మైసూరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
సోమందేపల్లి (పెనుకొండ) : సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులు ఐదు రోజుల కిందట ఇంటి నుంచి పారిపోయి మైసూరులో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సోమవారం స్వస్థలానికి తిరిగి వచ్చి పోలీసులను ఆశ్రయించారు. వీరిద్దరూ మైనర్లు కావడంతో తల్లిదండ్రులకు పోలీసులు కబురు పంపారు.
అయితే వీరిని ఇళ్లకు తీసుకెళ్లడానికి వారు నిరాకరించారు. దీంతో పోలీసులు అబ్బాయిపై ఐపీసీ 366ఏ సెక‌్షన్ కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ రిమాండ్‌కు ఆదేశించారు. బాలికను అనంతపురంలోని బాలికల సంరక్షణ కేంద్రానికి పంపించారు.