
అల్పహారం వికటించి విద్యార్థినులకు అస్వస్థత
కృష్ణాజిల్లా: విజయవాడ గుణదలలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆహారం వికటించి ఇంటర్ విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. సోమవారం ఉదయం వడ్డించిన అల్పాహారం తిన్న విద్యార్థినుల్లో 11 మందికి వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులకు ఎటువంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు.