
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ‘జయహో బీసీ మహాసభ’లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారి కోసం నిర్వాహకులు పసందైన వంటకాలతో ఏర్పాటు చేసిన కమ్మని భోజనాలు అదరగొట్టాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కోడిగుడ్లతో పాటు వివిధ రకాల శాఖాహార వంటకాలు, స్వీట్లతో ఆహూతులు సంతృప్తిగా పసందైన భోజనం చేశారు. స్టేడియంలో ఇరువైపులా మూడు భారీ భోజనశాలలతో పాటు కూతవేటు దూరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలోనూ భారీ భోజనశాలను ఏర్పాటు చేయడం, పదుల సంఖ్యలో కౌంటర్లు పెట్టడంతో సభకు వచ్చిన వారంతా ప్రశాంతంగా భోజనాలు ఆరగించారు.
వడ్డించిన వంటకాలు: ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, రవ్వ కేసరి, కాఫీ, టీ భోజనం– నాన్‌వెజ్: మటన్ బిర్యానీ, చికెన్ ప్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు–ఎగ్ కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగలితో పాటు వెజ్ బిర్యానీ, పనసకాయ ధమ్, పన్నీర్ గ్రీన్‌పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమోటా పప్పు, గోంగూర పచ్చడి, వైట్‌రైస్, సాంబారు, పెరుగుతో పాటు అందరికీ తాపేశ్వరం కాజా, మంచినీటి బాటిళ్లను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment