Jayaho BC Sabha
-
జయహా బీసీ సభ అట్టర్ ప్లాప్...షాక్ లో బాబు, పవన్
-
లోకేశ్ నిల్.. యాంకర్ ఫుల్
ఒంగోలు సబర్బన్: జయహో బీసీ సదస్సులో యాంకర్దే ప్రధాన పాత్రగా మారింది. గురువారం ఒంగోలు నగరంలో పాత గుంటూరు రోడ్డులోని ఏ1 ఫంక్షన్ హాల్లో ‘జయహో బీసీ’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీకి చెందిన బీసీ నాయకులు, బాధితులుగా చెప్పుకుంటున్న వారి కుటుంబ సభ్యులను పిలిపించారు. ఈ కార్యక్రమం మొత్తం యాంకర్ ఉదయభాను పాత్రే ఎక్కువైంది. దీంతో పరిస్థితి లోకేశ్ నిల్.. యాంకర్ ఫుల్ అన్న చందంగా తయారైంది. లోకేశ్ మాట్లాడుతూ ‘9 నెలలు ఆగండి.. వైఎస్సార్సీపీ నేతలను బజారులో తరిమితరిమి కొడదాం. టీడీపీ నాయకులను వేధించిన వైఎస్సార్సీపీ నాయకులను లోపలేసి శిక్ష పడేంత వరకూ పడుకోను..’ అంటూ శపథం చేశారు. గనుల శాఖను ఘన్నుల శాఖగా ఉచ్ఛరించిన లోకేశ్.. జీవోను జియో... అని అనడంతో సదస్సులో అందరూ ఒక్కరాసిగా నవ్వారు. జయహో బీసీ సదస్సులా కాకుండా ఇది టీడీపీ సర్వసభ్య సమావేశంలా సాగింది. -
‘జయహో బీసీ’ తరహాలో మిగతా విభాగాల సదస్సులు
సాక్షి, అమరావతి: విజయవంతమైన ‘జయహో బీసీ’ తరహాలోనే మిగతా విభాగాల సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాల్లో వారికి దిశా నిర్దేశం చేశారు. జయహో బీసీ తరహాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సదస్సుల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. గతంలో నిర్దేశించుకున్న మేరకు సాధ్యమైనంత త్వరగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియలో వెనకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నియామకాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న చిన్నచిన్న అంతర్గత లోపాలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని చెప్పారు. అప్పటికీ సమస్యలు అపరిష్కృతంగా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మరింత సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రచార కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో పార్టీ నాయకులు, యంత్రాంగం చురుగ్గా పని చేసేలా చూడాలని సూచించారు. -
‘సామాజిక’ సంచలనం
సాక్షి, అమరావతి: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం.. అమ్మ ఒడి, విద్యాదీవెన లాంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం.. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల దాకా సింహభాగం పదవులిచ్చి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించడం ద్వారా సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవాన్ని ఆవిష్కరించారు. దేశంలో సామాజిక న్యాయం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆయా వర్గాలకు చెందిన ముఖ్యమంత్రులకు సాధ్యం కాని రీతిలో సీఎం జగన్ సాధికారత దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నారని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. సామాజిక న్యాయంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రశంసిస్తున్నారు. చేతల్లో సామాజిక న్యాయం.. ► ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ 8న తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో కూడిన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించి రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే అందులో నలుగురు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారే ఉన్నారు. ► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్, శాసనమండలి ఛైర్మన్‌గా తొలిసారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశం కల్పించారు. ► 2022 ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయంపై సీఎం జగన్ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ► టీడీపీ అధికారం ఉన్న ఐదేళ్లలో బీసీ వర్గానికి చెందిన ఒక్కరికి కూడా రాజ్యసభకు వెళ్లే అవకాశం కల్పించలేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను (50%) రాజ్యసభకు పంపి సీఎం జగన్ చిత్తశుద్ధి చాటుకున్నారు. ► శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది ఎమ్మెల్సీలు ఉండగా ఇందులో 18 మంది (57 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే కావడం గమనార్హం. స్థానిక సంస్థలలోనూ.. ► స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేస్తే అందుకు వ్యతిరేకంగా చంద్రబాబు హైకోర్టులో టీడీపీ నేతలతో కేసులు దాఖలు చేయించారు. దీంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసి రిజర్వేషన్లకు అడ్డుపడ్డా పార్టీపరంగా బీసీలకు 34 శాతం కంటే ఎక్కువగా ఇస్తానని సీఎం జగన్ ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చారు. ► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్ అధ్యక్ష పదవులను బీసీలకు (38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 (46%) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గా లకు 9 జడ్పీ ఛైర్మన్ పదవులు (69%) ఇచ్చారు. ► రాష్ట్రంలోని 14 కార్పొరేషన్లలో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించింది. 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) సీఎం జగన్ ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలిపితే 14 కార్పొరేషన్ మేయర్ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే కేటాయించారు. ► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే 84 చోట్ల వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగించింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్ పదవులను బీసీలకు (53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలకు కలిపి 58 మున్సిపల్ ఛైర్మన్ పదవులు (69 శాతం) ఇచ్చారు. చట్టం చేసి నామినేటెడ్ పదవులు ► నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కేటాయిస్తూ సీఎం జగన్ చట్టం చేసి మరీ ఆయా వర్గాలకు అవకాశం కల్పించారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఆయా వర్గాలకు రిజర్వు చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే మొదటిసారి. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 76 పదవులు(39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి 117 పదవులు (60 శాతం) ఇచ్చారు. ► ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు(39శాతం) బీసీలకే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. 137 ప్రభుత్వ కార్పొరేషన్ పదవులకు సంబంధించి 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (41 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలిపితే 484 పదవుల్లో 280 (58 శాతం) ఆయా వర్గాలకే ఇచ్చారు. ► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆయా వర్గాలకు చెందిన వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ పదవులు ఉండగా అవన్నీ ఆ వర్గాలకే ఇచ్చారు. సంక్షేమంలో సింహభాగం.. ► మూడున్నరేళ్లలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా రూ.1.77 లక్షల కోట్లను ప్రభుత్వం అందించగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు రూ.1.31 లక్షల కోట్ల మేర (74 శాతం) లబ్ధి చేకూరింది. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి అన్ని వర్గాలకు మొత్తం రూ.3.19 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే రూ.2.50 లక్షల కోట్ల (79 శాతం) మేర మేలు జరిగింది. -
అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ఎడవల్లి సుబ్బారావు (62) మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ నెల 7న విజయవాడలో జరిగిన జయహో బీసీ సదస్సుకు హాజరైన సుబ్బారావు అక్కడ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పార్టీ శ్రేణులు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి అత్యుత్తమ వైద్యం అందించారు. మరోవైపు.. సుబ్బారావు మృతి సమాచారం తెలిసిన వెంటనే ఉప ముఖ్యమంత్రి, మంత్రి కొట్టు సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఈ విషయాన్ని ఆయన సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పార్టీ తరఫున రూ.10 లక్షలు సాయం ప్రకటించారు. ఆ మొత్తాన్ని మృతుడి గ్రామానికి వెళ్లి స్వయంగా అందజేయనున్నట్లు కొట్టు సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీసీల పట్ల సీఎంకు ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని తెలిపారు. అంతకుముందు.. తొక్కిసలాట విషయం తెలిసి విజయవాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులు, ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును కలిసి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేసిన విషయాన్ని మంత్రులు ఈ సందర్భంగా గుర్తుచేశారు. చదవండి: (ప్రతిపక్షాలకు అసత్య ప్రచారమే పనిగా మారింది: వైవీ సుబ్బారెడ్డి) -
85వేల గళాల నినాదం...‘జయహో బీసీ’
సాక్షి, అమరావతి: రకరకాల పదవులు చేపట్టి రాజకీయ సాధికారతతో బీసీ ప్రతినిధులు భారీ ఎత్తున ‘జయహో బీసీ’ సభకు తరలి రావటం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. మహాసభ జరుగుతున్నంత సేపూ వారంతా ‘‘జయహో బీసీ... జయహో జగన్’’ అంటూ ఉరిమే ఉత్సాహంతో నినదించటంతో అంచనాలకు మించి మహాసభ సక్సెస్ అయినట్లు పార్టీ భావిస్తోంది. రాష్ట్ర మంత్రులు మొదలు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారితో పాటు వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండల వైస్ ప్రెసిడెంట్లు, ప్రెసిడెంట్లు, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్పర్సన్లు, వాటి డైరెక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వాటి డైరెక్టర్లు, పీఏసీఎస్ చైర్మన్లు వాటి మెంబర్లు, ఆలయ బోర్డు చైర్మన్లు... ఇలా దాదాపు 85 వేలకు పైగా బీసీ ప్రతినిధులు రాష్ట్రం నలుమూలల నుంచీ కదలిరావటమనేది గతంలో ఎన్నడూ జరగలేదని, ఒక్క వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే ఇది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశిస్తున్నట్లు 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించడానికి ఈ సభను ఓ కొత్త ఆరంభంగా చూడాలనేది వారి భావన. గత ఎన్నికలకు ముందు... అంటే 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో తాము అధికారంలోకి వస్తే.. బీసీలకు చేసే మేలుపై బీసీ డిక్లరేషన్‌ను వైఎస్ జగన్ అప్పట్లో ప్రకటించారు. ఆ డిక్లరేషన్‌ను ఇపుడు తుచ తప్పకుండా అమలు చేస్తున్నారు. తొలి మంత్రివర్గంలో ఏడుగురు బీసీలకు స్థానం కల్పించి... పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో ఏకంగా 11 మంది బీసీలకు అవకాశమిచ్చారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అన్నింటా బీసీలకే సింహభాగం పదవులిచ్చారు. టీడీపీ సర్కార్ ఐదేళ్లలో ఒక్క బీసీని రాజ్యసభకు పంపకపోతే.. మూడున్నరేళ్లుగా రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే... అందులో వాటిలో నాలుగింటిని బీసీలకే ఇచ్చి... నలుగురిని రాజ్యసభకు పంపారు సీఎం వైఎస్ జగన్. సంక్షేమ పథకాల ద్వారా రూ.1.63 లక్షల కోట్లను బీసీలకు అందిస్తే.. అందులో కేవలం డీబీటీ రూపంలోనే రూ.86 వేల కోట్లను ఆ వర్గాల ఖాతాల్లో జమ చేశారు. వీటన్నిటి ఫలితం ఈ జయహో బీసీ సభలో కనిపించిందనేది పార్టీ వర్గాల మాట. వైఎస్సార్సీపీకి వెన్నెముకలా నిలిచిన బీసీలు.. తమను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుని, అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తా, అంతుచూస్తానంటూ బెదిరించి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన హయాంనూ... రాజ్యాధికారంలో, బడ్జెట్లో తమకు సింహభాగం వాటా ఇచ్చి సమున్నత గౌరవం ఇస్తున్న సీఎం జగన్ పాలనను బీసీలు పోల్చి చూసుకుంటున్నారు. బుధవారంనాటి బీసీ నేతల ప్రసంగాలన్నిటా ఇది స్పష్టంగా కనిపించింది కూడా. దేశ చరిత్రలో బీసీ సీఎం కూడా ఇవ్వని రీతిలో.. తమకు సమున్నత గౌరవం ఇస్తూ, కాలరెగరేసుకుని సగర్వంగా తిరిగేలా పాలిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు వెన్నెముకలా నిలబడాలని వారంతా సభాముఖంగా నినదించారంటే ఈ పాలన ఫలితమేనని వేరే చెప్పాల్సినపనిలేదు కూడా. మళ్లీ వైఎస్ జగన్‌ను సీఎంగా చేసుకుంటేనే.. తాము మరింత పురోభివృద్ధి సాధించగలుగుతామని బీసీలు భావిస్తున్నారనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కదంతొక్కుతున్న శ్రేణులు అధికారంలోకి వచ్చాక తొలిసారి జులైలో నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్‌సక్సెస్ అయ్యింది. మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను వివరిస్తూ గడపగడపకూ వెళ్తోన్న వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. ఈక్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ కావడమనేది తదుపరి ఎన్నికలకు కావాల్సిన కదనోత్సాహాన్ని శ్రేణుల్లో నింపిందనే చెప్పాలి. -
టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా?.. బాబూ నెక్ట్స్ఏంటి?
విజయవాడలో వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన జయహో బీసీ సభ విజయవంతం అవడం సహజంగానే తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఈనాడు, జ్యోతి వంటి మీడియా సంస్థలకు జీర్ణం కాని విషయమే. ఈ సభకు సంబంధించి రెండు అంశాలను గమనించాలి. ఒకటి సీఎం వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల కోసం ఎజెండాను సెట్ చేస్తున్నారు. రెండు సభ జరిగిన తీరు, దానిని మీడియా కవర్ చేసిన వైనం. ముందుగా జగన్ స్పీచ్‌ను గమనిస్తే ఆయన తన సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీముల వల్ల అత్యధిక లబ్ధి పొందింది బీసీలేనని ఆయన తెలిపారు. నా బిసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ వర్గాలు అంటూ ఆయన ఉచ్చరించడం ద్వారా వారిని సొంతం చేసుకోవడానికి యత్నించారు. ఇప్పటికే ఆ వర్గాలలో మెజార్టీ తనవైపు ఉన్న నేపథ్యంలో ఆయన వారిని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నారు. జయహో బీసీ పేరుతో జరిగిన ఈ సభలో బీసీ వర్గాలకు చెందిన సుమారు 80 వేల మంది వివిధ హోదాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. దీని ద్వారా బీసీ వర్గాలలో వైసీపీ ఎంత పట్టు సాధించింది పరోక్షంగా చెప్పారన్నమాట. బీసీ వర్గాల ఆదరణ మళ్లీ పొందడానికి గాను తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహాలకు ఇది ప్రతి వ్యూహం అనుకోవచ్చు. ఈ సందర్భంగా ఆయన పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్దం జరగబోతోందని, 18 నెలల్లో జరిగే ఈ యుద్దంలో అంతా తనకు మద్దతు ఇవ్వాలని జగన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధం అన్న పదం వినడానికి కొంత ఇబ్బందికరంగా ఉన్నా, రాజకీయంగా ఆయన దానిని అంత సీరియస్‌గా తీసుకున్నారని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పన్నుతున్న వ్యూహాలను ఆయన తిప్పికొట్టడానికి, తన వాదనను ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి బలంగా వినిపించారు. గతంలో ఏ సీఎం చెప్పని విధంగా తన పాలన వల్ల మేలు జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలని, అదే విషయం ప్రజల ఇళ్లకు కూడా తెలియచేయాలని ఆయన కోరారు. బీసీల సమాజానికి వెన్నుముక వంటి వారని, వారి కోసం తాను ఏఏ స్కీములను ప్రవేశపెట్టింది. వాటిని అడ్డుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు ఏమి చేసింది.. మొదలైన విషయాలను ఆయన వివరించారు. ఇక మీడియా కవరేజీ విషయానికి వస్తే ఈనాడు, జ్యోతి వంటి పత్రికలు పత్రికా ప్రమాణాలతో సంబంధం లేకుండా వార్తలు ఇస్తున్నాయి. అదే పద్దతిని ఇప్పుడు కూడా కొనసాగించాయి. ఈనాడు అయితే కనీసం ఒక వార్తకు అయినా ప్రాముఖ్యత ఇచ్చారు. జ్యోతి అయితే మొదటి పేజీలోనే తీవ్ర వ్యతిరేకతను కనబరుచుతూ కథనాలను ఇచ్చింది. కర్నూలులో ఒక ప్రధాన వీధిలో చంద్రబాబు సభ జరిగితే జనం ఫోటోలను ప్రచురించిన ఈనాడు.. జగన్ సభకు సంబంధించి వేదికను మాత్రమే ఫోటోగా ఇచ్చింది. అక్కడితో ఆగకుండా.. ఈనాడు, జ్యోతి కూడబలుక్కుని రాసినట్లుగా జగన్ మాట్లాడుతుండగా వెళ్లిపోయారని ఎప్పటి మాదిరి రాశాయి. అయితే ఆంధ్రప్రభ తదితర కొన్ని పత్రికలు సభ విజయవంతం అయిందని, బీసీ ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారని ప్రముఖంగా ఇచ్చాయి. ఆంధ్రప్రభలో మొదటి పేజీలోనే సభ సక్సెస్ అన్న శీర్షికను కథనం ఇచ్చారు. టీడీపీతో పరోక్షంగానో, ప్రత్యక్షంగానో కలిసి ప్రయాణిస్తున్న సిపిఐకి చెందిన విశాలాంధ్ర మాత్రం బీసీ సభ వార్తను మొదటి పేజీలోనే వేయలేదు. చివరి పేజీకి పరిమితం అయింది. సిపిఎంకు చెందిన ప్రజాశక్తి బానర్గా కథనం ఇచ్చింది. ఆ సందర్భంగా భారీగా ట్రాపిక్ జామ్ అయిన విషయాన్ని ప్రస్తావించింది. ఇక జ్యోతి పత్రిక జనం లేరని ఒక వార్త, సభ వల్ల మొత్తం నగరం అంతా నరకంగా మారిందని మరో వార్త రాసింది. నిజంగానే జనం పెద్దగా రాకపోతే నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఎందుకు వస్తుందన్న సంగతి మర్చిపోయింది. విశేషం ఏమిటంటే గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రద్దీగా ఉండే బెంజ్ సెంటర్ నడి రోడ్డులో నవనిర్మాణ దీక్షలని కార్యక్రమం నిర్వహించినప్పుడు అహా, ఓహో అంటూ వార్తలు ఇచ్చాయి. నిజానికి అప్పుడు ఆ రోడ్డులో వచ్చిన జనమే తక్కువ. దాని కోసం ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది టీడీపీ మీడియా మర్చిపోయి ఉండవచ్చు. అంతేకాదు.. పోలవరం సందర్శన అని, లేని అమరావతి విజిట్ అని, ఇలా రకరకాల ప్రచార యాత్రలకు జనాన్ని ఆర్టీసీ బస్‌లలో తిప్పినందుకుగాను ఆర్టీసీ వారికి 78 కోట్ల మేర టీడీపీ చెల్లించనేలేదట. చదవండి: ఆర్టీసీకి ‘చంద్రన్న భజన’ బకాయి రూ.78.36 కోట్లు మరి వైసీపీ మాత్రం ఈ సభకు బస్‌ల ఏర్పాటు నిమిత్తం అయిన 3.8 కోట్ల రూపాయలను చెల్లించినట్లు వెల్లడైంది. అయినా ఈనాడు అసత్య కథనాలు రాసింది. ఏది ఏమైనా ప్రతి నిత్యం తెలుగుదేశం పార్టీతోనే కాకుండా, ఈనాడు, జ్యోతి వంటి టీడీపీ మీడియాతో యుద్దం జరుగుతూనే ఉంది. జగన్ చెప్పినట్లు ఎన్నికల యుద్దం కాదు.. ఇప్పటికే అది ఆరంభం అయిందని అనుకోవచ్చు. అందుకే జగన్ తన మద్దతుదారులను అప్రమత్తం చేస్తున్నారు. -హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బీసీల సభ సక్సెస్ తో చంద్రబాబు కు బీపీ పెరిగింది : మంత్రి జోగి రమేష్
-
చంద్రబాబు మైండ్ సెట్ మార్చుకోవాలి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
సాధికారతకు జయహో
-
జయహో బీసీ సదస్సులో పిడికిళ్లు బిగించిన బీసీలు
-
సీఎం భరోసా.. దొరికింది ఆసరా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. విజయవాడలో బుధవారం ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభ ముగించుకొని సీఎం తన కాన్వాయ్‌లో వెళ్తుండగా.. రోడ్డుపైన నిస్సహాయ స్థితిలో వీల్‌చైర్‌లో కూర్చున్న ఒక యువకుడిని గమనించారు. వెంటనే అతడి వైపు సీఎం తన చేయి చూపుతూ తాను ఉన్నాననే భరోసాను కల్పించారు. వెంటనే అతడి సమస్య ఏమిటో ఆరా తీయాలని తన సెక్యూరిటీ సిబ్బందిని సీఎం ఆదేశించారు. అలాగే అతడి వివరాలను తక్షణమే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా గన్నవరం విమానాశ్రయానికి వెళ్తూ కూడా ఆ యువకుడి విషయం ఎంతవరకు వచ్చిందని సీఎం జగన్ మరోసారి ఆరా తీశారు. యువకుడికి అవసరమైన సాయం అందేలా.. వైద్యానికి అవసరమైన ఖర్చును అంచనా వేసి తనకు వివరాలు పంపాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో తక్షణమే స్పందించిన విజయవాడ కలెక్టర్ ఢిల్లీ రావు స్వయంగా తన వాహనాన్ని యువకుడి ఉన్న చోటుకు పంపి అతడిని తన కార్యాలయానికి రప్పించారు. అతడి పరిస్థితిని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్నారు. వెంటనే డీఎంహెచ్ఓను పిలిపించి చికిత్స నిమిత్తం యువకుడిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అంతేకాకుండా తక్షణ సహాయం కింద రూ.లక్ష చెక్కును సైతం కలెక్టర్ ఢిల్లీ రావు అందజేశారు. సీఎం అండ.. తీరింది బెంగ.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన ఏసుబాబు, శివగంగల దంపతుల కుమారుడు లక్ష్మణ్ (20)కు రెండేళ్ల క్రితం ఓ ప్రమాదంలో తలకు బలమైన గాయమైంది. అప్పట్లో 71 రోజులు ఆస్పత్రిలోనే వైద్యం పొందినప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. లక్ష్మణ్ కాలు చచ్చుపడిపోయింది. కూలి పనులు చేసుకునే తల్లిదండ్రులు తమకు శక్తికి మించి వైద్యం చేయించారు. అయితే ప్రతి నెలా మందులకు రూ.10 వేలు వెచ్చించడం భారంగా మారింది. మిగిలిన ఇద్దరు కుమారులు కుటుంబ పోషణ కోసం చదువు మానేసి పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్‌ను కలిస్తే తమకు న్యాయం జరుగుతుందని బుధవారం బాధితుడు లక్ష్మణ్ తన తల్లిదండ్రులతో విజయవాడ వచ్చాడు. సీఎం అండతో సమస్య పరిష్కారమైంది. -
Jaiho BC: కదనోత్సాహం.. జయహో బీసీ.. జయహో జగన్
‘మేమంతా కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మన సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు.. బీసీలంటే వెనుకబడిన వర్గాలు కానేకాదు.. బ్యాక్ బోన్ అని చేతల్లో నిరూపించారు. అందువల్లే మేమంతా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం.. అందువల్లే పార్టీ ఇచ్చిన ఒక్క పిలుపునకు ఇంత స్పందన.. సీఎం జగన్ మాట్లాడిన ప్రతి మాటకూ ప్రతిస్పందన.. ఈ జన సునామీని చూసిన చంద్రబాబుకు, దుష్టచతుష్టయానికి ఇక నిద్ర కరువే’ అని వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో బల్లగుద్ది చెబుతున్నాయి. జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వెనుకబడిన కులాలే వెన్నెముక అనే నినాదంతో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ మహాసభ’కు తరలిరావాలని వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపే ప్రభంజనమైంది.. దూరాభారాన్ని లెక్క చేయక ఒడిశా సరిహద్దులోని ఇచ్చాపురం, తమిళనాడు సరిహద్దులోని కుప్పం, కర్ణాటక సరిహద్దులోని హిందూపురం, తెలంగాణ సరిహద్దులోని మంత్రాలయం.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పోటాపోటీగా బీసీ ప్రజాప్రతినిధులు మంగళవారం రాత్రి నుంచే విజయవాడకు తరలివచ్చారు. బుధవారం ఉదయం 5 గంటలకే ఎముకలు కొరుకుతున్న చలిని ఖాతరు చేయకుండా.. మంచు తెరలను చీల్చుకుంటూ.. సూర్యోదయానికి ముందే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తున్న మహాసభ ప్రాంగణానికి కడలి తరంగంలా పోటెత్తారు. ఉదయం 9 గంటలకు మహాసభ ప్రాంగణం జన సంద్రంగా మారింది. ప్రాంగణం కిక్కిరిసిపోవడంతో బందరు రోడ్డుతోపాటు ఇందిరాగాంధీ స్టేడియంకు నలువైపులా వేలాది మంది ప్రతినిధులు రహదారులపైనే ఉండిపోయారు. దాంతో మహాసభ ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ సమయం ఉదయం 10 గంటల కన్నా 45 నిముషాల ముందే.. 9.15 గంటలకే ఆరంభమైంది. జ్యోతి ప్రజ్వలన చేసి.. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించి.. సభను ప్రారంభించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహాసభ ప్రాంగణానికి 12 గంటలకు చేరుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. 1.35 గంటల వరకు కొనసాగించారు. అప్పటి వరకు మహాసభ ప్రాంగణం నుంచి ఏ ఒక్కరూ కట్టు కదలలేదు. నేతలందరి ప్రసంగాలను శ్రద్ధగా విన్నారు. రహదారులపై గంటల తరబడి నిలబడిన వారూ అడుగు కదపకుండా ఎల్ఈడీ తెరలపై మహాసభను వీక్షిస్తూ ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. తలెత్తుకు తిరిగేలా సమున్నత గౌరవం ఏలూరులో 2019 ఫిబ్రవరి 17న బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన దానికంటే మిన్నగా సీఎం వైఎస్ జగన్ చేస్తుండటం.. కాలరెగరేసుకుని సగర్వంగా తలెత్తుకునే రీతిలో సమున్నత గౌరవం ఇస్తూ పరిపాలిస్తుండటం వల్లే బీసీ ప్రజాప్రతినిధులు, ప్రతినిధులు కదనోత్సాహంతో మహాసభకు కదలి వచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తరిస్తా అంటూ చంద్రబాబు బెదిరించడం.. హామీలను నిలబెట్టుకోవాలని అడిగిన మత్స్యకారులను అంతుచూస్తానని భయపెట్టడం.. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని దళితుల పుట్టుకనే అవహేళన చేయడాన్ని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేసినపుడు ప్రతినిధుల నుంచి విశేష స్పందన లభించింది. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపకుండా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే.. మూడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే అందులో నలుగురు బీసీలను రాజ్యసభకు సీఎం వైఎస్ జగన్ పంపి తమకు సమున్నత గౌరవం ఇచ్చారని అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వీరన్న ‘సాక్షి’కి చెప్పారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, మహిళా, విద్యా సాధికారత సాధించేలా చేస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే తాము నడుస్తామని స్పష్టం చేశారు. శ్రేణుల్లో మరింత రగిలిన సమరోత్సాహం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత జూలై 8–9న నిర్వహించిన ప్లీనరీ గ్రాండ్ సక్సెస్ కావడంతో నూతనోత్సాహంతో శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ చేసిన దిశానిర్దేశం మేరకు గడప గడపకూ వెళ్లి.. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి ఒక్కరికీ వివరించి చెబుతూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభకూ బీసీ ప్రతినిధులు పోటెత్తారు. ఏడాదికి బీసీ సబ్ ప్లాన్ కింద రూ.పది వేల కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేస్తే.. సీఎం వైఎస్ జగన్ ఏడాదికి రూ.15 వేల కోట్లు చొప్పున రూ.75 వేల కోట్లు ఇస్తానని మాట ఇచ్చి మూడున్నరేళ్లలోనే అంతకంటే అధికంగా రూ.1.63 లక్షల కోట్ల ప్రయోజనాన్ని తమకు చేకూర్చారని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండల పరిషత్ ఉపాధ్యక్షుడు తిరుమాను ధనుంజయ్ చెప్పారు. చంద్రబాబు చేసిన మోసాన్ని.. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న న్యాయాన్ని ఇంటింటికీ వెళ్లి వివరించి.. 175కు 175 శాసనసభ స్థానాల్లో వైఎస్సార్సీపీని గెలిపించడమే లక్ష్యంగా పని చేస్తామని స్పష్టం చేశారు. జయహో బీసీ మహాసభ అంచనాలకు మించి గ్రాండ్ సక్సెస్ కావడం వైఎస్సార్సీపీ శ్రేణుల్లో కదనోత్సాహాన్ని మరింతగా రగిల్చింది. లక్ష మందితో సభ.. ఎక్కడా స్తంభించని ట్రాఫిక్ మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి లక్ష మందికి పైగా ప్రతినిధులు హాజరైనప్పటికీ నగరంలో ఎక్కడా ట్రాఫిక్ స్తంభించడం అంటూ జరగలేదు. పోలీసు, ఇతర శాఖల పక్కా ప్రణాళిక, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు.. ప్రజల సహకారంతో ఎక్కడా ఇబ్బంది ఎదురు కాలేదు. వందల సంఖ్యలో వాహనాలకు పార్కింగ్ స్థలాలు వేర్వేరుగా కేటాయించడం.. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డులో ఒక వైపున, బీఆర్టీఎస్ రోడ్డునకు ఇరువైపులా, ఏఎస్.రామారావు రోడ్డు, ఐదో నెంబరు బస్సు రూట్లలో వాహనాలను అనుమతించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. -
ఆహా ఏమి రుచి.. తిన్నారు మైమరచి
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ‘జయహో బీసీ మహాసభ’లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వారి కోసం నిర్వాహకులు పసందైన వంటకాలతో ఏర్పాటు చేసిన కమ్మని భోజనాలు అదరగొట్టాయి. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, కోడిగుడ్లతో పాటు వివిధ రకాల శాఖాహార వంటకాలు, స్వీట్లతో ఆహూతులు సంతృప్తిగా పసందైన భోజనం చేశారు. స్టేడియంలో ఇరువైపులా మూడు భారీ భోజనశాలలతో పాటు కూతవేటు దూరంలోని బిషప్ అజరయ్య హైస్కూల్ ప్రాంగణంలోనూ భారీ భోజనశాలను ఏర్పాటు చేయడం, పదుల సంఖ్యలో కౌంటర్లు పెట్టడంతో సభకు వచ్చిన వారంతా ప్రశాంతంగా భోజనాలు ఆరగించారు. వడ్డించిన వంటకాలు: ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, రవ్వ కేసరి, కాఫీ, టీ భోజనం– నాన్‌వెజ్: మటన్ బిర్యానీ, చికెన్ ప్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు–ఎగ్ కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, వైట్ రైస్, పెరుగు, చక్కెర పొంగలితో పాటు వెజ్ బిర్యానీ, పనసకాయ ధమ్, పన్నీర్ గ్రీన్‌పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమోటా పప్పు, గోంగూర పచ్చడి, వైట్‌రైస్, సాంబారు, పెరుగుతో పాటు అందరికీ తాపేశ్వరం కాజా, మంచినీటి బాటిళ్లను అందించారు. -
ఇది పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం
గడప, గడపకూ మీరు కూడా వెళ్లాలి. ఇక నుంచి బూత్ కమిటీలు మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక అక్కచెల్లెమ్మ, ఒక అన్నదమ్ముడు మేపింగ్ జరగాలి. ప్రతి 50 ఇళ్లకు మనం ఓనర్షిప్ తీసుకోవాలి. మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ సారి మన టార్గెట్ 175కు 175 సీట్లు అని గుర్తుపెట్టుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘మరో 18 నెలల్లో యుద్ధం జరగబోతోంది.. ఈ యుద్ధంలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే, మరో వైపు బీసీల తోకలను కత్తిరిస్తాను, ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే దుర్మార్గమైన మనస్తత్వమున్న చంద్రబాబు ఉన్నారు. మంచికి, చెడుకు.. నిజాయితీకీ, వెన్నుపోటుకు.. పేదల భవిష్యత్‌కు, పెత్తందార్లకు.. మాట మీట నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతోందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండ’ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ‘మీ ఇంట్లో మంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. మంచి జరగకపోతే వద్దమ్మా.. జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి.. ఎందుకంటే జగనన్న ఏదైతే చెప్పాడో అది చేస్తాడు’ అని అన్నారు. ‘వాళ్లంతా పేదల శత్రువులు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని తేల్చి చెప్పండి.. 2019కి మించి 2024 ఎన్నికల్లో మన గెలుపు ఖాయమని ఊరూరా.. ఇంటింటా చాటి చెప్పండి’ అని 85 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. మారీచులతో యుద్ధం తప్పదు ► ఈ రోజు ఇక్కడకు వచ్చినవారంతా ప్రజాప్రతినిధులే. మీ మీ గ్రామాల్లో.. ప్రతి గడపకూ వెళ్లి 2024లో కూడా ఇంతకు మించిన గెలుపు ఖాయమని చెప్పండి. ఆ ఎన్నికల్లో కూడా మనమంతా మారీచులతోనూ, పెత్తందార్లతోనూ యుద్ధం చేయకతప్పదని చెప్పండి. ► పేదవాడి ఇంటింటికీ, మనిషి మనిషికీ మన ప్రభుత్వంలో పథకాలు అందితే.. రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని ఈ పేదల శత్రువులు మాట్లాడుతున్నారని ప్రతి ఇంట్లో చెప్పండి. వీళ్లంతా రైతులకు, అవ్వాతాతలకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకుంటున్న పేదపిల్లలకు శత్రువులు అని, ఇలాంటి మారీచులతో మనమంతా యుద్ధం చేయక తప్పదని గట్టిగా చెప్పండి. ► చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకం పేరు కూడా గుర్తుకు రాదు. అలాంటి బాబుతో, ఆయన ఎల్లో మీడియాతో, దత్తపుత్రుడితో... మూడున్నర సంవత్సరాలలో ఇన్ని విప్లవాత్మక సంక్షేమ పథకాలు, ఇంత డీబీటీ ఇచ్చిన మనం యుద్దం చేస్తున్నామని చెప్పండి. ఈ యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య జరగబోతుందని చెప్పండి. పేదల భవిష్యత్తుకు, పేదలు పేదలుగానే మిగిలిపోవాలని ఆరాటపడే పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. చంద్రబాబును నమ్మొద్దు.. ► చంద్రబాబు ఆగడాలు, నిర్వాకాలనూ.. మనం చేస్తున్న మంచిని ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గడపకూ తీసుకుపోవాలి. తేడా గమనించమని అందరినీ అడగండి. చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా.. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల స్వప్నాలను చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టే బంగారం ఇంటికి రావాలంటే.. బాబునే ముఖ్యమంత్రి కావాలంటాడు. రైతులకు రుణమాఫీ కావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలంటాడు. ► తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాను అని కూడా అంటాడు. కానీ నమ్మొద్దు. ఒక్కసారి నమ్మాం.. అడుగులు వెనక్కి పడ్డాయి. జగన్‌ని నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మన బిడ్డని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొబెట్టుకున్నాం. మన బతుకులు మారాయా?లేదా? అన్నది ఒక్కసారి గుండెల మీద ఆలోచన చేయండి అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. -
YS Jagan: బీసీలే వెన్నెముక
మహాకవి శ్రీశ్రీ మహా ప్రస్థానంలో చెప్పినట్టు.. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి ఇలా మన సహస్ర గ్రామీణ వృత్తుల సంగమం వేల సంవత్సరాలుగా మన కుటీర పరిశ్రమల సముదాయం మన బీసీ. నా మనసంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నిరుపేద వర్గాల వారే. నా ఆచరణ కూడా మీరే. నా వెనకాల ఉన్న ఆ నలుగురూ కూడా మీరే. మీరిచ్చిన అధికారాన్ని మనసుతో మీ కోసం ఉపయోగించే విషయంలో మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ అందరికంటే మిన్నగా ఉంటాడు. నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు ఇస్తున్న రాష్ట్ర బడ్జెట్‌ను వారికి అందనివ్వకుండా 40 ఏళ్లుగా అడ్డంగా తిని, బొజ్జలు బాగా పెంచిన దుష్ట చతుష్టయంతో మనం యుద్ధం చేయబోతున్నాం. ఇదే విషయాన్ని గడప గడప లోనూ చెప్పండి. మనందరి ప్రభుత్వం ద్వారా లబ్ధి కలిగి ఉంటేనే జగనన్నకు తోడుగా నిలవాలని అడగండి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జయహో బీసీ మహాసభ ప్రాంగణం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు బ్యాక్ బోన్ క్లాస్‌లని చాటిచెబుతూ మూడున్నరేళ్లుగా అడుగులు ముందుకు వేస్తున్నామని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలను సమాజానికి వెన్నెముక కులాలుగా తీర్చిదిద్దుతానని మాట ఇచ్చానని.. ఆ దిశగా ప్రతి అడుగూ వేస్తున్నానని గుర్తు చేశారు. ‘2014 ఎన్నికల్లో బీసీలకు చంద్రబాబు ఏకంగా 114 వాగ్దానాలు ఇచ్చి, అందులో 10 శాతం కూడా అమలు చేయకుండా దగా చేస్తే.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతిమాట నిలబెట్టుకున్న మా జగనన్న ప్రభుత్వానికి మేము ఇప్పుడు వెన్నెముక కులాలుగా మారామని, నేడు రాజ్యాధికారంలో మేమంతా భాగస్వాములమని ఆ చంద్రబాబుకు చెప్పండి’ అని పిలుపునిచ్చారు. విజయవాడలో ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం వైఎస్సార్సీపీ నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి.. ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మహాసభకు వేలాదిగా కదలివచ్చిన బీసీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో వార్డు మెంబర్ మొదలు ఎంపీ వరకు వివిధ పదవులకు ఎన్నికైన దాదాపు 85 వేల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలందరికీ నిండు మనస్సుతో చేతులు జోడించి పేరుపేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న జన సంద్రం మన రాజకీయ సాధికారతకు నిదర్శనం అన్నారు. ‘మీ హృదయంలో జగన్.. జగన్ హృదయంలో మీరు.. ఇది ఎప్పటికీ మన అనుబంధం’ అని సగర్వంగా తెలియజేస్తున్నానని చెప్పారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభ ప్రాంగణంలో ఓ భాగం బీసీలే నాగరికతకు పట్టుకొమ్మలు ► ఒకనాటి పారిశ్రామిక విప్లవం, ఆధునిక విద్యకు దూరం చేయడం, రాజకీయంగా న్యాయబద్ధమెన వాటా ఇవ్వకపోవడం వల్ల బీసీలు వెనుకబాటుకు గురయ్యారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న నా 139 బీసీ కులాల వారి కష్టాలను నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో స్వయంగా చూశాను.. విన్నాను. వారి ఆశలను, ఆకాంక్షలను తెలుసుకుని, 2019 పిబ్రవరిలో ఏలూరులో బీసీ గర్జన నిర్వహించాం. ఆ రోజు ఇచ్చిన మాట మేరకు బీసీలను వెన్నెముక కులాలుగా మార్చాను. తోకలు కత్తిరిస్తామని చంద్రబాబుకు చెప్పండి ► బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, షేవింగ్ కిట్లు, పనిముట్లు కాదని చంద్రబాబుకు చెప్పండి. వ్యవసాయ రుణమాఫీ, డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్.. కేజీ నుంచి పీజీ వరకు బీసీ పిల్లలందరికీ ఉచిత విద్య, కాలేజీ పిల్లలకు ఐప్యాడ్లు, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఏటా రూ.10 వేల కోట్లు.. ఇలా ఎన్నో వాగ్దానాలు చేసి.. బీసీలందరికీ నిలువెత్తు ద్రోహం చేసిన ఆ చంద్రబాబు మోసాన్ని గుర్తు చేయండి. ► మత్స్యకారుల అంతు చూస్తానని, నాయి బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్న బెదిరింపులను ఒక్కసారి అందరూ గుర్తుకు తెచ్చుకోండి. అయ్యా బాబూ.. మాకు తోకలు లేవు కానీ మీ తోకల్ని.. మీకు మొలిచిన కొమ్ముల్ని, మీకు కొమ్ము కాసేవారిని అందరినీ కత్తిరించే సామాజిక చైతన్యం మాకు ఉందని గట్టిగా చెప్పండి. వెన్నెముక కులాలుగా మార్చడమంటే ఇదీ.. ► మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు 2024లో మన ప్రభుత్వం మీద ఒంటరి పోరాటం చేస్తానని మాత్రం చెప్పడం లేదు. ఎందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి మీద ఆధారపడుతున్నారో తెలుసా? ఈ పెద్దమనిషి చేసింది చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పథకం లేదు. ► చంద్రబాబు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌కు కేటాయిస్తామని చెప్పింది. చివరకు 5 ఏళ్లలో కనీసం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. మనం బీసీ సబ్‌ప్లాన్‌కు ప్రతి ఏటా రూ.15 వేల కోట్లు, 5 సంవత్సరాలలో రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పాం. ఈ మూడున్నరేళ్లలో బీసీలకు మాత్రమే, డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఖర్చు చేసిన మొత్తం ఏకంగా రూ.1.63 లక్షల కోట్లు. ఇందులో డీబీటీ ద్వారా ఇచ్చిన సొమ్ము రూ.86 వేల కోట్లు. వెన్నెముక కులాలుగా మార్చడం అంటే ఇదీ. నవరత్నాలు.. సామాజిక సాధికారత ► నవరత్నాల్లో మొదటిది ఆర్థిక సాధికారత, డీబీటీ, నాన్ డీబీటీ పరంగా అడుగులు వేశాం. రెండోది రాజకీయ సాధికారత, దీనికి అద్దం పట్టే విధంగా పదవులు, నియామకాలు. ఈ రెండింటి ద్వారా సామాజిక సాధికారత దిశగా పయనించాం. మహిళా సాధికారత నాలుగో విషయం. రేపటి తరాల భవిష్యత్ నిర్ణయించే విద్యా సాధికారత ఐదోది. ► గత మూడున్నరేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.3,19,228 కోట్లు లబ్ధి చేకూర్చాం. ఇందులో మొత్తంగా నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలకు అందించింది అక్షరాలా రూ.2,50,358 కోట్లు. అంటే దాదాపు 80 శాతం. దోచుకుతిన్న చంద్రబాబు, ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ► 2018–19లో చంద్రబాబు హయాంలో బడ్జెట్ ఎంత ఉందో.. మన అందరి ప్రభుత్వానిది కూడా దాదాపు అంతే బడ్జెట్. అప్పుడు అప్పుల పెరుగుదల రేట్ 19 శాతం ఉంటే ఇప్పుడు 15 శాతం మాత్రమే. అదే రాష్ట్రం అదే బడ్జెట్, మీ బిడ్డ ప్రభుత్వంలోనే తక్కువ. మరి అప్పుడు ఈ పథకాలు ఎందుకు లేవని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. కారణం అప్పట్లో ఆ బడ్జెట్‌ను చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు.. మాత్రమే దోచుకో పంచుకో తినుకో (డీపీటీ) అనే పద్దతిలో తినేసే పరిస్థితి. ► ఈ రోజు మీ బిడ్డ పాలనలో మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు ఆ డబ్బు నేరుగా మీ ఇంటికి వస్తుంది. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు. ప్రతి ఇంట్లో చిరునవ్వులు ఇవ్వగలిగాం. ► మన దేశంలో బీసీలకు మేలు చేయడానికి 1980లో వచ్చిన మండల్ కమిషన్ నాటి నుంచి అనేక కమిషన్లు, కమిటీలు ఏర్పాటైనా ఎక్కడా విద్య, ఉద్యోగాల విషయంలో అనేక అవరోధాలు ఎదురయ్యాయి. అలాంటిది మన రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం రాజకీయ సాధికారత విషయంలో చేతలతో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది. రాజకీయ సాధికారత అంటే ఇదీ.. ► మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్థానం కల్పిస్తే.. రెండో విడతలో దానిని ఏకంగా 70 శాతానికి తీసుకెళ్లాం. ఐదుగురుకి ఉప ముఖ్యమంత్రులు పదవులు ఇస్తే అందులో నలుగురు ఈ వర్గాల వారే. 25 మంది మంత్రులలో 11 మంది ఈ రోజు బీసీలే ఉన్నారు. ► 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపిన పాపాన పోలేదు. మీ బిడ్డ రాజ్యసభకు 8 మందిని పంపితే అందులో నలుగురు మన బీసీలే. ► శాసనమండలిలో మన పార్టీ తరఫున 32 మంది ఎమ్మెల్సీలు ఉంటే అందులో 18 మంది నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. శాసనసభ స్పీకర్‌గా ఇదే వేదికపై ఉన్న తమ్మినేని సీతారామ్ బీసీ. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీ వర్గానికి చెందిన మోషేన్, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన నా అక్కను ఆ స్థానంలో కూర్చొబెట్టాం. స్థానిక సంస్థలలో సింహభాగం వాటా ► స్థానిక సంస్థలకు మొత్తంగా 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 637 మండలాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగరేసింది. అందులో ఒక్క బీసీలకు మాత్రమే 237 ఎంపీపీ పదవులలో కూర్చోబెట్టాం. అంటే 38 శాతం. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 67% ఇవ్వగలిగాం. ► 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో బీసీలకు 6 పదవులు అంటే 46 శాతం ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే 9 పదవులు అంటే 69 శాతం చైర్మన్ పదవులు. ► 14 నగర కార్పొరేషన్ మేయర్ పదవులలో వైఎస్సార్సీపీ జెండా ఎగరేస్తే.. బీసీలకు ఏకంగా 9 పదవులు అంటే 64 శాతం ఇచ్చాం. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కు గాను 12 పోస్టులు అంటే 86 శాతం మేయర్ పదవులు కట్టబెట్టాం. ► 87 మున్సిపాల్టీలకు గాను 84 చోట్ల వైఎస్సార్సీపీ జెండా ఎగరవేసింది. ఇందులో 44 మున్సిపల్ ఛైర్మన్లుగా బీసీలు.. 53% కనిపిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 58 స్థానాల్లో 69 శాతంగా వీరే రాజ్యాన్ని పాలిస్తున్నారు. జయహో బీసీ అంటే ఇదీ.. ► 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకు ఇచ్చాం. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 117 అంటే 60 శాతం ఇచ్చాం. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్ పదవులలో 53 పదవులు (39 శాతం) బీసీలకే ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 79 అంటే 58 శాతం పదవులు ఇచ్చాం. వీటిలో 484 నామినేటెడ్ డైరెక్టర్ పదవులుంటే అందులో 201 బీసీలకు 41 శాతం ఇచ్చాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 280 అంటే 58 శాతం ఇచ్చాం. ► బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. వీటిలో మరో 684 డైరెక్టర్ పదవులన్నీ వీరికే ఇచ్చాం. ఆలయ బోర్డులు, ఆలయ ఛైర్మన్ పదవులు తీసుకున్నా అందులో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ఇచ్చాం. ► దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503 సగభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారే ఉన్నారు. ఇందులో బీసీలు ఒక్కరే 2,650 పదవుల్లో 38 శాతం ఉన్నారు. ఇది జయహో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే. ఉద్యోగాలలోనూ అధిక శాతం వాటా ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ఇందులో 84% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ తమ్ముళ్లు, చెల్లెళ్లు పనిచేస్తున్నారు. అప్పట్లో ఇంటికో ఉద్యోగం ఇస్తామని లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేసి, మోసం చేశారు. ► మన ప్రభుత్వంలో 54 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో రెగ్యులరైజ్ అయ్యారు. ఆరోగ్య రంగంలో 46 వేల పోస్టులు.. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఆప్కాస్ ) ద్వారా మరో లక్ష మందికి ఎటువంటి దళారులు లేకుండా, లంచాలిచ్చే పరిస్థితి లేకుండా, కమీషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా మెరుగైన జీతాలు కల్పిస్తున్నాం. కాంట్రాక్ట్‌లో పని చేస్తున్న వారికి తొలిసారిగా మినిమమ్ టైం స్కేల్ తీసుకొచ్చాం. 2.60 లక్షల మంది తమ్ముళ్లు, చెల్లెళ్లు వలంటీర్ ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిలో 83% నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. మొత్తంగా 6 లక్షల పై చిలుకు మంది చిరునవ్వుతో ఉద్యోగాలు చేస్తున్నారు. వారు ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో? ► ప్రభుత్వ బడులన్నింటినీ నాడు–నేడుతో రూపురేఖలు మార్చుతున్నాం. బైలింగ్యువల్ బుక్స్, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్ తీసుకొచ్చాం. ఇన్ని చేస్తుంటే పెత్తందారీ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మొత్తంగా ఎల్లోబ్రదర్స్ వారితో పాటు దత్తపుత్రుడికి బాధ కలుగుతోంది. వీరంతా ఏ సామాజిక న్యాయానికి ప్రతినిధులో అందరూ ఆలోచించాలి. ► పేదలకు ఇళ్ల స్ధలాలిస్తామంటే కోర్టులో కేసులు వేస్తారు. అమరావతిలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇళ్ల పట్టాలిస్తామంటే.. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని కోర్టుల్లో కేసులు వేయిస్తారు. చివరకి ప్రాంతాల వారీగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా 3 రాజధానులు చేస్తామని అంటే వీళ్లంతా అరిచి గీపెడుతున్నారు. వారు ఇలాగే పేదరికంలో మిగిలిపోవాలన్నది వారి ఆలోచన. వీళ్లను శాశ్వతంగా పేదరికంలోంచి ఎలా బయటకు తేవాలన్నది మీ బిడ్డ ప్రభుత్వం తాపత్రయం. మానవతావాదానికి ప్రతీక వైఎస్సార్సీపీ. మహిళా సాధికారత దిశగా.. ► ఏకంగా 30 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అందులో ఇప్పటికే 21.20 లక్షల ఇళ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. ఆ 30 లక్షల ఇళ్ల పట్టాలలో నా బీసీ అక్కచెల్లెమ్మలకు 16,70,286 ఇళ్లు ఇవ్వగలిగాం. అంటే 56 శాతం బీసీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చి మేలు చేశాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అక్కచెల్లెమ్మలను కలుపుకుంటే.. 88 శాతం వీళ్లకే ఇళ్ల పట్టాలిచ్చాం. వీటిలో ఇళ్లు కట్టడం కూడా పూర్తయితే ప్రతి అక్కా, చెల్లెమ్మ చేతిలో రూ.5 లక్షల నుంచి 10 లక్షలు వారి చేతిలో పెట్టినట్లవుతుంది. రాష్ట్రం మొత్తంగా రూ.2..3 లక్షల కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టినట్లవుతుంది. ► 79 లక్షల మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.12,758 కోట్లు ఇచ్చాం. ఇందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రూ.9,294 కోట్లు.. అంటే 73%. రేపు జనవరిలో మరో రూ.6,379 కోట్లు వారి చేతుల్లో పెట్టబోతున్నాం. ► దాదాపు కోటి రెండు లక్షల మంది ఉన్న నా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ రూపంలో రూ.3,615 కోట్లు ఇచ్చాం. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.2,803 కోట్లు ఇచ్చాం. అంటే 78 శాతం నిరుపేద అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టగలిగాం. ► 45 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్న దాదాపు 26.40 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కలకు, చెల్లెమ్మలకు వైయస్సార్ చేయూత పథకం ద్వారా రూ.14,110 కోట్లు ఇచ్చాం. ► జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా దాదాపు 44.50 లక్షల మంది చెల్లెమ్మలకు రూ.19,617 కోట్లు ఇచ్చాం. ఇందులో రూ.15,378 కోట్లు అంటే 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చెల్లెమ్మల చేతిలో పెట్టాం. మరో 25 లక్షల మంది పిల్లలకు, తల్లులకు మేలు చేస్తూ.. జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన డబ్బులన్నీ ఆ తల్లుల ఖాతాల్లో జమ చేశాం. చెప్పినట్లుగా బీసీ డిక్లరేషన్ అమలు ► చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా 139 కులాల పేర్లతో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. శాశ్వత బీసీ కమిషన్‌ను దేశంలో తొలిసారిగా నియమించాం. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. ► ఆలయ బోర్డులు మొదలు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల వరకు ఇతర నామినేటెడ్ పదవులన్నింటిలోనూ ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే కనిపిస్తున్నారు. ఇవాళ ఇక్కడ కనిపిస్తున్న 85 వేల మందే ఇందుకు సాక్ష్యం. నామినేషన్ పనుల్లో కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసి, అమలు చేస్తున్నాం. ► జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా షాపులు పెట్టుకుని సంప్రదాయ వృత్తులు చేసుకుంటున్న బీసీలకు, చిరు వ్యాపారులకు అండగా నిలిచాం. ఈ మూడున్నరేళ్లలో చేదోడు ద్వారా రూ.584 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. జగనన్న తోడు ద్వారా రూ.2,059 కోట్లు సున్నా వడ్డీ రుణాలు అందించాం. తద్వారా దాదాపు 15 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయి. ► 45 ఏళ్లు నిండిన 26.40 లక్షల మంది నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల కోసం చేయూత పథకం ద్వారా మేలు చేస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో రూ.14,110 కోట్లు ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక సాధికారతను బలోపేతం చేశాం. సన్నిధిగొల్లలకు తిరుమల ఆలయం తలుపులు తెరిచే సంప్రదాయ హక్కును పునరుద్ధరిస్తూ జీవో జారీ చేశాం. ► ఎంత పెద్ద చదువైనా సరే వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తున్నాం. గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిలూ చెల్లించాం. ఈ మూడున్నరేళ్లలో రూ.9,052 కోట్లు ఖర్చు చేశాం. హాస్టల్ ఖర్చుల కోసం వసతి దీవెన కింద రూ.20 వేల వరకు ఇస్తున్నాం. ఈ మూడున్నరేళ్లలో ఈ పథకానికి రూ.3,349 కోట్లు వెచ్చించాం. ► చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే భృతిని రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంచాం. మత్స్యకార భరోసా పథకం ద్వారా రూ.418 కోట్లు అందించాం. సొంత మగ్గమున్న నేత కార్మికులకు ఏటా రూ.20 వేలు చొప్పున ఈ మూడున్నరేళ్లలో రూ.776 కోట్లు వారి చేతుల్లో పెట్టాం. -
బిగ్ క్వశ్చన్: బీసీల గుండె చప్పుడుగా వైఎస్ జగన్
-
ఆ మాట జగనన్నే చెప్పాడని కూడా చెప్పండి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: మరో 18 నెలల్లో రాష్ట్రంలో యుద్ధం జరగబోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇదే మాట ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని విజయవాడలో జరిగిన జయహో బీసీ మహాసభకు హాజరైన ప్రజల్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. 'ఈ యుద్ధం మంచికి చెడుకి మధ్య జరగబోతుందని చెప్పండి. ఈ యుద్ధం నిజాయితీ, వెన్నుపోటుకి మధ్య జరగబోతుందని చెప్పండి. మాట మీద నిలబడే నాయకత్వానికి, ప్రజలకు వెన్నుపోటు పొడిచే మనస్తత్వానికి మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. ఈ యుద్ధం సామాజిక న్యాయానికి, సామాజిక అన్యాయానికి మధ్య జరగబోతుందని చెప్పండి. పేదల భవిష్యత్తుకు, పేదలు పేదలుగానే మిగిలిపోవాలని తాపత్రయపడే పెత్తందార్లకు మధ్య యుద్ధం జరగబోతుందని చెప్పండి. ఈ యుద్దంలో నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, నిరుపేద వర్గాలు ఒకవైపు ఉంటే.. మరోవైపున బీసీల తోకలను కత్తరిస్తాను, ఎస్సీ కులాల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అనే దుర్మార్గమైన మనస్తత్వమున్న చంద్రబాబునాయుడికి మధ్య యుద్దం జరగబోతుందని చెప్పండి' అంటూ బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపును ఇచ్చారు. చంద్రబాబుని నమ్మొద్దు.. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రతి జిల్లాలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గడపకూ తీసుకునిపోవాలి. తేడా గమనించమని అందరినీ అడగండి. మీ ఇంట్లోమంచి జరిగితేనే జగనన్నకు తోడుగా ఉండండి. మంచి జరగకపోతే వద్దమ్మా.. జగనన్నే చెప్పాడు అని కూడా చెప్పండి. ఎందుకంటే జగనన్న ఏదైతే చెప్పాడో అది చేస్తాడు. చంద్రబాబును మాత్రం నమ్మొద్దమ్మా.. ఎన్నికలప్పుడు మాత్రం రంగురంగుల స్వప్నాలను చూపిస్తాడు. బ్యాంకుల్లో పెట్టే బంగారం ఇంటికి రావాలంటే.. బాబునే ముఖ్యమంత్రి కావాలంటాడు. రైతులకు రుణమాఫీ కావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలంటాడు. పిల్లలను మన రాష్ట్రంలోనే కాదు విదేశాల్లో కూడా చదివిస్తాడు. తాను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని అమెరికా చేస్తాను అని కూడా అంటాడు. కానీ నమ్మొద్దు. ఒక్కసారి నమ్మాం.. అడుగులు వెనక్కి పడ్డాయి. జగన్‌ని నమ్మాం, మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మన బిడ్డని ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చొబెట్టుకున్నాం. మన బ్రతుకులు మారాయా? లేదా? అన్నది ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకొని ఆలోచన చేయండి అని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండి. చదవండి: (నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్) మన టార్గెట్ 175కి 175.. ఇక మీదట నుంచి మీ అందరూ చేసే ఒక గొప్ప కార్యక్రమం. గడప,గడపకూ మీరు కూడా వెళ్లడం మొదలు కావాలి. ఇక నుంచి బూత్ కమిటీలు మొదలు కావాలి. ప్రతి 50 ఇళ్లకు ఒక అక్కచెల్లెమ్మ, ఒక అన్నదమ్ముడు మ్యాపింగ్ జరగాలి. ప్రతి 50 ఇళ్లకు మనం కూడా ఓనర్షిప్ తీసుకోవాలి. మరో 18 నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఈ సారి మన టార్గెట్ 175 కి 175 సీట్లు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి అడుగు కూడా అదే విధంగా వేయాలని, ఆవిధంగా ప్రయాణం చేయాలని ఇక్కడికివచ్చిన నా 80 వేల మంది బీసీ కుటుంబసభ్యులందరికీ కూడా పేరు, పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మన ప్రభుత్వానికి కలకాలం ఉండాలని కోరుకుంటూ... ఇంకా మంచి చేసే అవకాశం దేవుడి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు. చదవండి: (చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: సీఎం జగన్) -
మీ తోకలను , కొమ్ములను కత్తిరిస్తాం : సీఎం వైఎస్ జగన్
-
‘ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది’
సాక్షి, విజయవాడ: ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు ముందుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. జయహో బీసీ మహాసభ విజయవంతం కావడానికి సీఎం జగన్ సంక్షేమ పాలనే కారణమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతు కావడం ఖాయం అన్నారు. కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోబోతున్నారు. సీఎం జగన్ బలహీన వర్గాలను బ్యాక్ బోన్‌గా గుర్తించారు. చంద్రబాబు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని మంత్రి అన్నారు. ‘‘జన ప్రభజనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ట్రైలర్ చూసి టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే మూడు దశాబ్ధాల పాటు సీఎం జగన్ పాలనను బలహీనవర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అంబేద్కర్ ఆశయాలతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. బీసీలకి అండగా నిలబడిన వైఎస్ జగన్‌కి బలహీన వర్గాలు అండగా ఉంటాయి’’ అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: సీఎం జగన్ -
బీసీల పల్లకీ మోస్తున్న మహానేత సీఎం జగన్ : ఉష శ్రీ చరణ్
-
చంద్రబాబు ఆ ఒక్క మాట చెప్పలేకపోతున్నాడు..!
-
మీ గుండెల్లో జగన్.. జగన్ గుండెల్లో మీరు..
-
బీసీలంటే పనిముట్లు మాత్రమే కాదు.. బీసీలంటే వెన్నెముక కులాలు: సీఎం జగన్
-
జయహో బీసీ సభకు తరలి వచ్చిన ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు భోజన ఏర్పాట్లు
-
బీసీల్లోని అన్ని కులాలకు సీఎం ప్రధాన్యత ఇచ్చారు : మంత్రి సీదిరి
-
సీఎం జగన్ 85వేల మంది బీసీ సైన్యాన్ని తయారు చేశారు : మంత్రి జోగి రమేష్
-
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు. రాజ్యసాధికారికతకు బీసీలు నిదర్శనంగా నిలిచారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెప్పండని సీఎం వైఎస్ జగన్.. విజయవాడ జయహో బీసీ మహాసభలో బీసీ శ్రేణులను ఉద్దేశించి పిలుపు ఇచ్చారు. ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. బీసీలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని చంద్రబాబుకు గుర్తు చేయండి. చేసిన మోసాలను, నయవంచనను గుర్తు చేయండి. ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పండి అని సీఎం జగన్ ప్రసంగించారు. మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. చేసిందేమీ లేక అబద్ధాలతో మోసం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే చెప్పుకోవడానికి చంద్రబాబు బీసీల కోసం ఒక్క మంచి పని చేయలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిపై పడుతున్నాడు. చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్ద పీట వేశాం. ఆర్థిక సాధికారత కోసం రూ.3 లక్షల 19 వేల 228 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో 80 శాతం డబ్బు పేద సామాజిక వర్గాలకు ఖర్చు చేశాం. చంద్రబాబు హయాంలో అప్పుల్లో పెరుగుదల రేటు 19 శాతం. అప్పుడు ఆ రేటు కేవలం 15 శాతం మాత్రమే అని సీఎం జగన్ ప్రకటించారు. చంద్రబాబు హయాంలో పథకాలు ఎందుకు లేవో ప్రజలే ఆలోచించుకోవాలి. దోచుకో.. పంచుకో.. తినుకో ఇదే చంద్రబాబు విధానం అని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ప్రతి గడపకు అందే సామాజిక న్యాయం, సాధికారతే నవరత్నాలు అని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం. ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధికారతకు కృషి చేశాం. ఎక్కడా అవినీతికి అవకాశం లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నాం అని సీఎం జగన్ చేశారు. బాబుకు చివరి ఎన్నికలే! 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్ ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. పేదలకు ఇళ్లు ఇస్తామంటే కోర్టులో కేసు వేస్తారు వీళ్లు. పేదల శత్రువు, ఆయన పెత్తందారులు. వాళ్లకు ఏనాడూ మంచి బుద్ధి లేదు. వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్ఆర్సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. 2024లో ఇంతటికి మించిన గెలుపు ఖాయమని చెప్పండి అని బీసీ శ్రేణులను ఉద్దేశించి సీఎం జగన్ పిలుపు ఇచ్చారు. ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి అని జయహో బీసీ మహాసభకు హాజరైన సుమారు 85 వేలమంది బీసీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి పేర్కొన్నారు. -
బీసీలంటే బ్యాక్‌బోన్ క్లాసులు: సీఎం జగన్
సాక్షి, కృష్ణా: నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభివర్ణించారు. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో ఆయన ప్రసంగించారు. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. వార్డు మెంబర్ల దగ్గరి నుంచి తన కేబినెట్లోని మంత్రులకు, ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడున్నరేళ్ల కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడుతున్నాయి. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ అని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉందని తెలిపారు. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశానని సీఎం జగన్ గుర్తు చేశారు. బీసీ కులాలన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్రలో చెప్పాను. రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని మేం అమలు చేశాం. దేశంలోనే తొలిసారిగా శాశ్వత బీసీ కమిషన్ తెచ్చాం. నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చాం. మరోవైపు అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత పథకాల ద్వారా ఆదుకుంటున్నాం. చిరువ్యాపారులకు తోడుగా ఉండేందుకు జగనన్న చేదోడు పథకం తెచ్చాం. చేయూత పథకం కింద రూ.14,110 కోట్లు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. తిరుమలలో సన్నిధి గోల్లలకు తలుపులు తెరిచే సంప్రదాయం కల్పించాం. బీసీలంటే ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు, పనిముట్లు కాదు.. వెన్నెముక కులాలు అని మరోసారి సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఈ గణాంకాలే నిదర్శనం చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. రాష్ట్రం విషయానికొస్తే.. ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. 32 మంది ఎమ్మెల్సీలలో 18 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైన్టార్టీలే. శాసన సభ స్పీకర్‌గా బీసీ నేత తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్‌గా ఎస్సీ నేత మోషేన్‌రాజును నియమించాం. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ 32 మంది సభ్యుల్లో బీసీలే అత్యధికం. మండల పరిషత్ పదవుల్లో 67 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. రెండో విడత కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. రాష్ట్రంలోని 117 మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. మున్సిపల్ చైర్పర్సన్లలో 84లో 44 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 137 కార్పొరేషన్ చైర్పర్సన్లలో 79 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76 బీసీలకే. ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. 86 శాతం మేయర్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు. 484 డైరెక్టర్ పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే ఉన్నారు. గ్రామ సచివాలయాల్లో లక్షా 30 వేల ఉద్యోగుల్లో.. 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలలో 84 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. మొత్తంగా రాజకీయ, సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చాం అని సీఎం జగన్ ప్రసంగించారు. -
బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం అల్ టైమ్ రికార్డ్ : అనిల్ కుమార్ యాదవ్
-
విజయవాడలో సీఎం జగన్ కాన్వాయ్..
-
బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు : ఎంపీ మోపిదేవి
-
బీసీలకు పదవులిచ్చి ప్రోత్సహించింది సీఎం జగన్ : తమ్మినేని
-
దమ్మున్న నాయకుడు సీఎం జగన్: ఆర్.కృష్ణయ్య
సాక్షి, విజయవాడ: బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని బీసీ ఉద్యమ నేత, వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం జగనే అని వైఎస్ఆర్సీపీ జయహో మహాసభలో ఉద్ఘాటించారాయన. బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్.. పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దే. బీసీ బిల్లు వస్తే.. మన(బీసీలను ఉద్దేశించి..) తల రాతలు మారిపోతాయి. ఎన్నో ఉద్యమాలు చేశా.. బీసీ కేంద్రమంత్రుల్ని కలిశా. కానీ, ఎవరూ సీఎం జగన్‌లా కృషి చేయలేదు. ధైర్యం చేసి ఆయన బీసీల పక్షాన నిలిచారు. బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు. సీఎం జగన్ ఓ సంఘ సంస్కర్త. ఒక బీసీలకే కాదు.. అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చూస్తున్నారు. మాయమాటలకు, మభ్య పెట్టే మాటలకు బీసీలు లొంగిపోకూడదని, చిత్తశుద్ధితో నిజంగా మన అభివృద్ధి కోరుతున్న నాయకుడికి(సీఎం జగన్) మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్ కృష్ణయ్య.. ఈ సందర్భంగా బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. -
జయహో బీసీ: ‘రాజ్యాధికారంలో బీసీలను భాగస్వాముల్ని చేశాను’
జయహో బీసీ మహాసభ.. లైవ్ అప్డేట్స్ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ► ప్రతి గడపకు వాస్తవ పరిస్థితిని తీసుకెళ్లాలి. మంచి జరిగితేనే జగనన్నకు తోడు ఉండండని చెప్పండి. చంద్రబాబు అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పండి ► వైఎస్ఆర్సీపీ సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం. మానవతా వాదానికి వైఎస్ఆర్సీపీ ప్రతీక. నిజాయితీకి వెన్నుపోటుకు మధ్య యుద్ధం జరగబోతోంది. ► 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలే. మనమంతా మారీచులు, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదు. చంద్రబాబు, ఆయన బ్యాక్‌బోన్ ఎల్లో బ్రదర్స్, దత్తపుత్రుడు ఏ సామాజిక వర్గానికి ప్రతినిధులో ఆలోచన చేయాలి. ►రెండో విడత కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు ఉన్నారు. కేబినెట్లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పించాం. ► చంద్రబాబు ఒక్క బీసీని రాజ్యసభకు పంపించలేదు. కానీ, మన ప్రభుత్వం ప్రతీ అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ప్రాధాన్యత కల్పించాం. ఈ మూడున్నరేళ్లలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు దక్కితే.. సగం బీసీలకే ఇచ్చాం. ► ఎస్సీల్లో ఎవరైనా పుడతారా? అని చంద్రబాబు హేళన చేశారు. కానీ, మన హయాంలో అన్ని వర్గాలను గుండెల్లో పెట్టుకున్నాం. ► వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఆత్మ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంక్షేమమే. గడప గడపకు నవరత్నాలు అందించడమే లక్ష్యం. ► చరిత్రలో ఎవరూ వేయని విధంగా అడుగులు వేశాం. బీసీ కులాలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేశాం. ► టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది. కానీ, మన పాలనలో రాజ్యాధికారంలో బీసీలు భాగస్వామ్యం అయ్యారు. ► ఖబడ్దార్ మీ అంతు చూస్తా అని బీసీలను చంద్రబాబు బెదిరించాడు. తోకలు కత్తిరిస్తానన్నాడు. కానీ, బీసీలు రాజ్యాధికారంలో భాగస్వాములనే విషయం చంద్రబాబుకు చెప్పండి. ► మీ బిడ్డ జగన్ వయసు 49 ఏళ్లు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోంది. కానీ, 2024లో ఒంటరిగా పోటీ చేస్తానని చంద్రబాబు చెప్పలేకపోతున్నారు. ► నా బీసీ కుటుంబం.. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు ఎన్నికైన ప్రజాప్రతినిధులకు స్వాగతం. బీసీలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. నాగరికతకు పట్టుకోమ్మలు బీసీలు. నా బీసీ కుటుంబం జనసముద్రంలా నా ముందు ఉంది. మీ హృదయంలో జగన్.. నా హృదయంలో మీరు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదని.. బ్యాక్‌బోన్ క్లాసులు అని, వెనుకబాటు కులాలు కాదని.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు. బీసీ అంటే శ్రమ.. బీసీ అంటే పరిశ్రమ. ఈ దేశ సంస్కృతికి, సంప్రదాయానికి ఉన్నంత చరిత్ర బీసీలకు ఉంది. పారిశ్రామిక విప్లవం బీసీలను వెనక్కి నెట్టింది. ఆధునిక విద్య బీసీలను వెనకబాటుకు గురి చేసింది. బీసీలంటే వెనుకబడిన కులాలు కాదు.. వెన్నెముక కులాలు చేస్తానని చెప్పాను. నేడు రాజ్యాధికారంలో వారిని భాగస్వాముల్ని చేశాను: సీఎం జగన్ ► సీఎం జగన్ ప్రసంగం ప్రారంభం.. బీసీ సోదరులకు, అక్కచెల్లెమ్మలకు హృదయపూర్వక కృతజ్ఞతలతో మహాసభను ఉద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారాయన. ► నేతల ప్రసంగాలు పూర్తి కావడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి.. అందరికీ అభివాదం తెలిపారు. చివరగా.. సీఎం వైఎస్ జగన్‌ను ప్రసంగానికి ఆహ్వానించారు. ► సీఎం జగన్ బీసీలకు పదవులు ఇచ్చి ప్రొత్సహించారు. అన్ని కులాలకు ప్రాధాన్యత ఇచ్చారు. పేదవాళ్లను చదువకు దగ్గర చేసిన ఘనత ఆయనది. ఒక యజ్ఞంలా సీఎం జగన్.. ఎన్నో సంక్షేమాలను ప్రజలు అందించారు. సీదిరి అప్పలరాజు గుర్తు చేశారు. ► మళ్లీ జగన్నే గెలిపించుకుందాం సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోనే సామాజిక న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ పోతుల సునీత పేర్కొన్నారు. ఇక్కడి బీసీ నినాదాలు చంద్రబాబు గుండెల్లో వణుకు పుట్టించాలన్నారు ఆమె. బీసీల కోసం ఇంతలా కష్టపడే ముఖ్యమంత్రిని ఎవరం చూడలేదని ఆమె పేర్కొన్నారు. ధర్మానికి-అధర్మానికి.. నిజానికి-అబద్ధానికి రాబోయే రోజుల్లో యుద్ధానికి సిద్ధం కావాలని బీసీలను కోరారు ఆమె. సంక్షేమ పథకాలు కొనసాగాలన్న.. మంచి పాలన అందాలన్నా సీఎం జగన్నే మళ్లీ సీఎంగా చేసుకుందామని, దుష్టచతుష్టయానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఆమె పిలుపు ఇచ్చారు. ► 2024 ఎన్నికలకు మేమంతా సిద్ధం వచ్చే ఎన్నికలకు మేం సిద్ధం. సీఎం జగన్ 85వేల బీసీ సైన్యాన్ని తయారు చేశారు. ఈ సైన్యాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి.. మీకు అండగా ఉంటామన్న జగనన్న వెంట నడుద్దామని బీసీలను కోరారు మంత్రి జోగి రమేష్. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడిపై పంచ్‌లు పేల్చారు జోగి రమేష్. వైఎస్ జగన్‌ను ఎదుర్కొలేని దద్దమ్మలు.. కుట్రలు చేస్తున్నారు. 2024లో 175కి 175 గెల్చి తీరుతాం అని ఆయన అన్నారు. ► బీసీలకు సీఎం జగన్ ఇచ్చింది ఆల్‌టైం రికార్డు లక్షమంది హాజరైన వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభలో మాజీమంత్రి అనిల్‌యాదవ్ భావోద్వేగంగా మాట్లాడారు. బీసీలకు సీఎం జగన్ ఇచ్చిన సంక్షేమం.. ఆల్‌టైం రికార్డు. ఇదే వేదిక నుంచి ఆయన చంద్రబాబుకు చరకలు అంటించారు. చంద్రబాబు డీఎన్ఏలో ఉంది కుళ్లు, కుతంత్రం తప్ప మరేమీ లేదు. చంద్రబాబుకు బీసీలు వణుకు పుట్టిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్‌ను గెలిపించి తీరతాం.. 175కి 175లో గెలిపిద్దాం అని బీసీలకు పిలుపు ఇచ్చారు అనిల్ యాదవ్. ► ఇవాళ బీసీల పండుగ. బీసీల తలరాతలు మార్చిన మహానేత సీఎం జగన్ అని మంత్రి గుమ్మనూరి జయరాం పేర్కొన్నారు. ► జయహో బీసీ మహాసభకు దాదాపుగా 80వేల మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు హాజరయ్యారని మంత్రి కారుమూరి తెలిపారు. చంద్రబాబు జీవితంలో ఎప్పుడైనా ఇంతమంది బీసీలకు పదవులిచ్చారా?అని నిలదీశారు. అన్ని బీసీ కులాలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌దే అని మంత్రి కారుమూరి స్పష్టం చేశారు. ► బీసీల పల్లకి మోస్తున్న మహానేత సీఎం జగన్ అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీ చరణ్ పేర్కొన్నారు. పూలేకి సరిసమానమైన నేత జగన్ అని ఆమె కితాబిచ్చారు. 139 కులాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. ఆయన్ని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత బీసీలదే అని ఈ సందర్భంగా మంత్రి ఉషా శ్రీ చరణ్ పిలుపు ఇచ్చారు. ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీ మహాసభను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాల నుంచి భారీగా బీసీ ప్రజాప్రతినిధులు, నేతలు, శ్రేణులు ఈ సభకు హాజర్యారు. బీసీల నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగిపోయింది. సభా ప్రాంగణంలో బీసీలతో గ్యాలరీలు కిక్కిరిసిపోయాయి. 11.31AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ వేదికపైకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. అక్కడే ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే, మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ► బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. రాజకీయ గౌరవం ఇచ్చింది సీఎం జగన్ అని మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సీఎం జగన్ బీసీ బాంధవుడు. చంద్రబాబు బీసీల పట్ల రాబందు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారని అన్నారామె. ► విజయవాడ జయహో బీసీ మహాసభ.. ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ► వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ వరకు బీసీలకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్‌ది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. ఆశాజ్యోతి పూలే, అంబేద్కర్ భావజాలం ఆయనది. చంద్రబాబుకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తారు అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ► బీసీల్లో పేదరికాన్ని తొలగించేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారు. బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. చదవుకు పేదరికం అడ్డుకావొద్దని ఆయన భావించారు: ఎంపీ మోపిదేవి ► బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అని చంద్రబాబు బీసీలను బెదిరించారు. కానీ, బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. బీసీలకు సీఎం జగన్ ఏం చేశారో ఈ సభను చూస్తే తెలుస్తుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. బీసీలే ఈ రాష్ట్రానికి వెన్నెముక అనే భావజాలాన్ని తెచ్చింది కూడా సీఎం జగనే అని పార్థసారథి పేర్కొన్నారు. బీసీలే రాష్ట్రానికి వెన్నెముక అని సీఎం జగన్ భావించారు. రాష్ట్రంలో బీసీలకు సీఎం జగన్ పెద్దపీట వేశారు. గతంలో కాళ్లు అరిగేలా తిరిగినా సంక్షేమ పథకాలు వచ్చేవి కావు. కానీ, జగన్ పాలనలో ఇంటి గడపకే సంక్షేమ పథకాలు వస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే అని పార్థసారథి పేర్కొన్నారు. ► బీసీలు బాబుకి బుద్ధి చెప్పాలి: స్పీకర్ తమ్మినేని జయహో బీసీ మహాసభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీల తోకలు కత్తిరిస్తామన్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ ఏకంగా లేఖ రాశాడు. కానీ, సీఎం జగన్ బీసీలకు గొప్ప ఆత్మగౌరవం ఇచ్చారు. బీసీలకు సమున్నత స్థానం కల్పించారు. చరిత్ర తెలియనివాళ్లు బీసీల తోకలు కత్తిరిస్తారా?బీసీలు జడ్జిలుగా పనికి రారా? ముసుగులు వేసుకుని మారువేషంలో వస్తున్నారు జాగ్రత్త.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెప్పాలి అని తమ్మినేని పిలుపు ఇచ్చారు. బీసీలకు పదవులిచ్చి ప్రొత్సహించింది సీఎం జగన్. ఎంపీపీ పదవుల్లో 67 శాతం పదవులు కల్పించారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కేటాయించారు. బీసీలంతా ఆలోచించుకుని.. సీఎం జగన్ వెంట నడవాలని తమ్మినేని సీతారాం బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు స్పీకర్ తమ్మినేని. ► పదకొండు తరాల వెనుకబాటు తనానికి కారణం చంద్రబాబు కష్టం నా కులం అన్నాడు. మానవత్వం నా మతమన్నాడు. వ్యక్తిత్వం నా వర్గమన్నాడు. అదీ జగనంటే.. అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు. ‘‘బీసీల పక్షపాతి సీఎం జగన్. రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన వ్యక్తి కూడా. 139 బీసీ కులాలను ఏకం చేసిన నేత. చంద్రబాబు నాయుడు కేవలం కుల వృత్తులకే బీసీలను పరిమితం చేయాలనుకున్నాడు. పదకొండు తరాల వెనుకబాటుకి కారణం అయ్యాడు. కానీ, సీఎం జగన్ అలా కాదు’’ అంటూ ప్రశంసలు గుప్పించారు మంత్రి చెల్లుబోయిన. ► విజయవాడ దారులన్నీ జయహో బీసీ మహాసభ వైపే వెళ్తున్నాయి. సభ కోసం భారీ సంఖ్యలో బీసీలు తరలి వస్తున్నారు. బీసీ జయ జయ నాదాలతో విజయవాడ మారుమోగిపోతోంది. 80 వేల మంది అంచనాని దాటేసి.. సుమారు లక్ష మంది దాకా సభకు హాజరు అయ్యారు. ► ఆయనేమో బీసీలను చిన్నచూపు చూశారు బీసీలకు సీఎం జగన్ సముచిత స్థానం కల్పించారు. బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటనే ఉన్నారు. బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు కల్పించిన ఘతన సీఎం జగన్‌దే. బీసీలను చంద్రబాబు చిన్నచూపు చూశారు. కించపరిచారు. అలాంటిది.. బీసీల ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి సీఎం జగన్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ► బీసీల ఆత్మగౌరవమే కాదు.. అభివృద్ధి జరిగింది ఏపీలో బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు సీఎం జగన్ అని వైఎస్ఆర్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు ఆత్మగౌరవాన్ని మాత్రమే కాదు.. అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది సీఎం జగనే అని ఉద్ఘాటించారాయన. మాయమాటలకు లొంగిపోకుండా.. మన అభివృద్ధికి పాటుపడుతున్న నిజమైన నేత వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. ► బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ ‘జయహో బీసీ మహాసభ’ ప్రారంభోపన్యాసాన్ని చేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీసీ స్థితిగతులను మార్చేసిన వ్యక్తి సీఎం జగన్. సంచార జాతులను గుర్తించిన ఏకైక సీఎం కూడా ఈయనే. సీఎం జగన్ తన పాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కేబినెట్లో పదకొండు మంది బీసీలకు స్థానం కల్పించారు. రాజ్యసభ పదవుల్లో సగం బీసీలకే ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్’’ అని కొనియాడారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. 09.35AM ► వైఎస్ఆర్సీపీ జయహో బీసీ మహాసభ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభం అయ్యింది. బీసీ నేతలంతా కలిసి జ్యోతి ప్రజల్వనతో ప్రారంభించారు. అనంతరం ప్రసంగోపన్యాసం సాగుతోంది. ► బీసీలంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు - మంత్రి కారుమూరి ► 14 ఏళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. చంద్రబాబు బలహీనవర్గాలను కట్టుబానిసలుగా వాడుకున్నారు. బీసీలకు ఏపీలో మాత్రమే న్యాయం జరిగింది. బీసీ మహాసభ చరిత్రలో నిలిచిపోతుంది. - జోగి రమేష్ ► వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో ఇవాళ(బుధవారం) విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభను నిర్వహిస్తోంది అధికార వైఎస్సార్సీపీ పార్టీ. ఇందుకోసం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి బీసీలు సభ కోసం తరలి వచ్చారు.. ఇంకా వస్తూనే ఉన్నారు. ► జయహో బీసీ మహాసభకు సీఎం జగన్ హాజరై.. ప్రసంగించనున్నారు. ► వైఎస్ఆర్సీపీ మినీ ప్లీనరీ తరహాలో ‘జయహో బీసీ మహాసభ’కు భారీ ఏర్పాట్లు చేశారు. ► బీసీ ప్రజాప్రతినిధులు వేలాదిగా తరలి రానున్నారు. భారీ సంఖ్యలో వచ్చే వారి కోసం అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు. ► జయహో బీసీ మహాసభకు హాజరయ్యే వాళ్ల కోసం విజయవాడ, గుంటూరు హోటళ్లు, కమ్యూనిటీ హాళ్లలో వసతి ఏర్పాటు చేశారు. ► బీసీ మహాసభ సందర్భంగా.. విజయవాడలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుచోట్ల ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. ► బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. ఎన్నికల హామీలకు మించి అత్యధికంగా బీసీలకు ప్రయోజనం చేకూర్చారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
జయహో బీసీ.. ఛలో విజయవాడ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం సిద్ధమైంది. ‘వెనుకబడిన వర్గాలే వెన్నెముక’ నినాదంతో బుధవారం నిర్వహిస్తున్న మహాసభకు భారీఏర్పాట్లు చేశారు. జయహో బీసీ.. అంటూ వెనుకబడిన కులాల ప్రతినిధులు ఛలో విజయవాడకు వస్తున్నారు. నగర పరిసర ప్రాంతాల్లో మహాసభకు వచ్చేవారికి స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. బీసీ మహాసభకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి మంగళవారమే బీసీల ర్యాలీలు బయలుదేరాయి. అనంతపురం జిల్లాతోపాటు పలు ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో బీసీ ప్రతినిధుల వాహనాలు విజయవాడకు పయనమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 82,432 మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రతినిధులకు మహాసభకు ఆహ్వానం పంపించారు. వెనుకబడిన తరగతులకు చెందిన పంచాయతీ వార్డు మెంబర్, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులతోపాటు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న వారికి సైతం జయహో బీసీ మహాసభ ఆహ్వానాలు అందాయి. పార్టీ మినీప్లీనరీ తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు వస్తున్న ఆహ్వానితుల సంఖ్యకు అనుగుణంగా సభ ప్రాంగణంతోపాటు అల్పాహారం, భోజన, వసతి ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను రెండువేల బస్సులు ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా మరో రెండువేల భారీవాహనాల్లో బీసీ ప్రతినిధులు తరలిరానున్నారు. వాటితోపాటు సమీప ప్రాంతాల నుంచి సొంత కార్లు, బైక్‌లపైన కూడా పెద్దసంఖ్యలో విజయవాడకు వస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే బీసీ ప్రతినిధులకు విజయవాడ, గుంటూరు నగరాల్లో నాలుగువేలకుపైగా హోటల్ గదులు, 150 కమ్యూనిటీ హాళ్లు, కల్యాణమండపాల్లో వసతి ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. బందరు రోడ్డులో బెంజిసర్కిల్ నుంచి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ వరకు బీసీ సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. విజయవాడ నగరం మీదుగా దూరప్రాంతాలకు వెళ్లే వాహనాలను నగర శివారు ప్రాంతాల నుంచే మళ్లిస్తున్నారు. విజయవాడ నుంచి విజయదుందుభి రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఈ సభను నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన మూడున్నరేళ్లలోనే బీసీలకు అందించిన లబ్ధిని జయహో బీసీ మహాసభలో వివరించనున్నారు. రానున్న కాలంలో బీసీలకు మరింత మేలుచేసేలా స్పష్టమైన సంకేతాలు ఇవ్వనున్నారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది. విజయవాడ సభను విజయవంతంగా పూర్తిచేసుకున్న అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో సభలు నిర్వహించి విజయదుందుభి మోగించేందుకు నాంది పలకనున్నారు. అల్పాహారంలో 9.. భోజనంలో 21 రకాల పదార్థాలు జయహో బీసీ మహాసభకు సభా ప్రాంగణం, ఆహారం, నీరు, వసతి వంటి ఏర్పాట్ల బాధ్యతల్ని మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు అప్పగించారు. వీరు నాలుగు రోజులుగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు వచ్చేవారికి 9 రకాల పదార్థాలతో అల్పాహారం, 21 రకాల పదార్థాలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి పదివేల మంది భోజనం చేసేలా రెండు ప్రదేశాల్లో భోజనశాలలు ఏర్పాటుచేశారు. అల్పాహారంలో ఇడ్లీ, గారె, మసాలా ఉప్మా, పొంగలి, సాంబారు, కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ, స్వీట్, రవ్వకేసరి ఉన్నాయి. కాఫీ, టీ ఏర్పాటు చేశారు. మాంసాహారంలో మటన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, రొయ్యలు కోడిగుడ్డు కర్రీ, చేపల పులుసు, కట్టా, ఉల్లి చట్నీ, అన్నం, పెరుగు, చక్కెర పొంగలి, శాఖాహారంలో వెజ్ బిర్యాని (పనసకాయ ధమ్), పన్నీర్ గ్రీన్‌పీస్ కర్రీ, డబుల్ బీన్స్ జీడిపప్పు కర్రీ, ఉల్లి చట్నీ, టమాటాపప్పు, గోంగూర పచ్చడి, అన్నం, సాంబారు, పెరుగు, చక్కెర పొంగలి వడ్డిస్తారు. 12 గంటలకు సీఎం ప్రసంగం జయహో బీసీ.. మహాసభ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. వేదికపై బీసీ నాయకులు మాట్లాడతారు. 12 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి మధ్యాహ్నం 2 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 3.25 గంటలకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ మండలం కనపర్తిపాడుకు చేరుకుంటారు. 3.55 గంటల నుంచి 4.10 వరకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం అక్కడినుంచి బయలుదేరి సాయంత్రం 6.20 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. -
టీడీపీకి సమాధి కట్టేది బీసీలే
సాక్షి, అమరావతి/పటమట (విజయవాడ తూర్పు): వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7న బుధవారం నిర్వహించనున్న జయహో బీసీ సభతో టీడీపీ అధినేత చంద్రబాబుకి వణుకు మొదలైందని వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేశారు. అందుకే అయ్యన్న, అచ్చెన్నలాంటి టీడీపీ జాగిలాలను తమపైకి వదులుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీకి సమాధి కట్టేది బీసీలేనని స్పష్టం చేశారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలోనే బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా మూడున్నరేళ్ల పాలనలోనే సీఎం జగన్ బడుగు, బలహీనవర్గాలకు రూ.90,415 కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ విధానంలో అందించారని కొనియాడారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే.. పెద్ద బీసీ.. సీఎం జగన్ శతాబ్దాల నుంచి బీసీలు వివక్ష అనుభవిస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ బీసీలకు ఆత్మగౌరవంతోపాటు పాలనలో భాగస్వామ్యం కూడా కల్పించారు. పెద్ద బీసీ.. సీఎం జగన్ మాత్రమే. శతాబ్దాలుగా ఇనుప గజ్జెలతో మోతుబరి వ్యవస్థ మాపై నాట్యం చేస్తున్న తరుణంలో బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు.. దేశానికే బ్యాక్ బోన్ అని సీఎం జగన్ నిరూపించారు. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారు. గత ప్రభుత్వంలో బీసీలకు చంద్రబాబు కేవలం రూ.965 కోట్లు బడ్జెట్ మాత్రమే కేటాయించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మూడేళ్లలోనే రూ.90,415 కోట్లు ఖర్చు చేశారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీపీలు, సహకార సంఘాల డైరెక్టర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభల్లో ఎంపీలుగా బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు. బీసీలు అధికంగా ఉండే విశాఖలో రాజధానిని ఏర్పాటు చేయడం బీసీల అభ్యున్నతికి చిహ్నం. – తమ్మినేని సీతారాం, శాసనసభ స్పీకర్ టీడీపీలో వణుకు మొదలైంది.. ఈ మూడున్నరేళ్లలోనే బీసీల్లో ఎంతో పేరు సంపాదించిన సీఎం వైఎస్ జగన్‌ను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్సార్సీపీ జయహో బీసీ సభ అనగానే టీడీపీలో వణుకు మొదలైంది. బీసీలే టీడీపీకి సమాధి కడతారు. బీసీలకు ఏం చేశామో.. ధైర్యంగా మేం చెప్పుకోగలం. చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా? బీసీలకు బాబు వెన్నుపోటు పొడిచారు. బీసీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదు. అయ్యన్నపాత్రుడు ఒక రోగ్. బీసీలను చంద్రబాబు ఓటింగ్ యంత్రాలుగానే చూశారు. ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వలేదు. సీఎం జగన్ ఏకంగా నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించారు. బీసీల గుండెల్లో జగన్ ఉన్నారు. బాబు పునాదులు కదులుతున్నాయి. ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు విసుక్కుంటున్నారు. –కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి బీసీల సంక్షేమంపై టీడీపీ నేతలవి పచ్చి అబద్ధాలు.. బీసీల సంక్షేమంపై టీడీపీ నేతల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. 1995లో చంద్రబాబు టీడీపీని ఆక్రమించుకున్నాక ప్రతి సాధారణ ఎన్నికల్లో బీసీలకు 100 టికెట్లు ఇస్తామని చెప్పి ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదు? దీన్ని ఎందుకు టీడీపీలోని బీసీ నాయకులు ప్రశ్నించలేకపోతున్నారు? బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకున్నది టీడీపీకి చెందిన వ్యక్తి. ఇది వాస్తవం కాదా? కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా బీసీలకు మేలు చేయడానికి సీఎం జగన్ పార్టీ తరఫున రిజర్వేషన్లు అమలు చేశారు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్ల చొప్పున రూ. 50 వేల కోట్లు ఇస్తామని చెప్పి, కేవలం రూ.14,246 కోట్లు మాత్రమే బాబు ఖర్చు చేశారు. సీఎం జగన్ తొలి ఏడాదిలోనే రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 5 చట్టాలు, 56 కార్పొరేషన్లు, 9 నవరత్నాలు, 18 ప్రత్యేక పథకాలు, 14 శాఖల పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే బీసీ జనగణన చేయాలని శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ సైతం పంపారు. – యనమల నాగార్జున యాదవ్, అధికార ప్రతినిధి, వైఎస్సార్సీపీ బీసీలే ఎజెండా రూపకర్తలు జయహో బీసీ సభకు వచ్చే బీసీ సోదరుల సునామీలో చంద్రబాబు కొట్టుకుపోతారు. దీంతో టీడీపీకి చెందిన బీసీ జాగిలాలను మా మీద దాడికి వదిలారు. అయ్యన్నపాత్రుడు ఒక గంజాయి డాన్, స్మగ్లర్. ఈఎస్ఐలో మందులు మెక్కిన అచ్చెన్నాయుడు, కాల్‌మనీ సెక్స్ రాకెట్ల ద్వారా మహిళా జాతిని సర్వనాశనం చేసిన బుద్ధా వెంకన్న ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బీసీలను చంద్రబాబు బానిసలుగా చూస్తే, అదే బీసీలకు రక్షగా సీఎం జగనన్న ఉన్నారు. టీడీపీలో బీసీలను జెండా మోసేవారిగానే చూశారు. అదే వైఎస్సార్సీపీలో బీసీలే ఎజెండా రూపకర్తలు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు లేఖ రాసింది నిజమా? కాదా? కాదని లోకేష్ మీద ప్రమాణం చేయగలరా? – కొండా రాజీవ్‌గాంధీ, అధికార ప్రతినిధి వైఎస్సార్సీపీ -
మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల ప్రజలను (బీసీలను) సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దుతానంటూ 2019 ఫిబ్రవరి 17న ఏలూరులో వైఎస్సార్సీపీ నిర్వహించిన బీసీ గర్జనలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడున్నరేళ్లుగా చిత్తశుద్ధితో అమలుచేసి చూపిస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాలకు అధిక ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఇదే అంశాన్ని వివరించి.. రానున్న రోజుల్లో మరింత ప్రయోజనం కల్పిస్తామని బీసీలకు భరోసా ఇవ్వాలనే లక్ష్యంతో బుధవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘జయహో బీసీ’ మహాసభను వైఎస్సార్సీపీ నిర్వహిస్తోంది. ఉదయం పదిగంటలకు ప్రారంభమయ్యే ఈ మహాసభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ పాల్గొని.. గత మూడున్నరేళ్లుగా బీసీలకు చేస్తున్న మేలును, రానున్న రోజుల్లో కలిగించబోయే ప్రయోజనాలను వివరించనున్నారు. ఈ మహాసభకు 82,432 మంది బీసీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ.. వారికి పేరుపేరునా ఆహ్వానపత్రికలను పంపారు. వెనుకబడిన వర్గాలే వెన్నెముక నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంతోపాటు విజయవాడ నగరాన్ని వైఎస్సార్సీపీ జెండాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. విజయవాడ వారధిపై రెపరెపలాడుతున్న వైఎస్సార్సీపీ జెండాలు బీసీ డిక్లరేషన్‌లో చెప్పినదానికంటే అధికంగా.. బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల కంటే ఆ వర్గాల ప్రజలకు మూడున్నరేళ్లుగా సీఎం వైఎస్ జగన్ అధిక ప్రయోజనం చేకూర్చారు. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తూ పేదరికం నుంచి గట్టెక్కించడం, అమ్మఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం, పరిపాలనలో సింహభాగం భాగస్వామ్యం కల్పించడం ద్వారా సమాజానికి వెన్నెముకలా బీసీలను తీర్చిదిద్దుతున్న అంశాన్ని సీఎం వైఎస్ జగన్ వివరించనున్నారు. రానున్న రోజుల్లోనూ ఇదేరీతిలో ప్రయోజనం చేకూరుస్తామని భరోసా ఇవ్వనున్నారు. స్థానికసంస్థల్లో బీసీలకు 34 శాతం.. ఎస్సీ, ఎస్టీలతో కలిపి 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న తమ ప్రభుత్వం జీవో జారీచేస్తే.. దీనిపై టీడీపీ నేతలను పురిగొల్పి సుప్రీం, హైకోర్టుల్లో కేసులు వేయించి.. రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించేలా చంద్రబాబు కుట్ర చేసిన తీరును వివరించనున్నారు. రిజర్వేషన్లు తగ్గించేలా చేసి బీసీ వర్గాలకు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచినా.. స్థానికసంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 34 శాతం కంటే అధికంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తీరును గుర్తుచేయనున్నారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సీఎం వైఎస్ జగన్‌ల కటౌట్లు సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలన టీడీపీకి బీసీలే వెన్నెముక.. బీసీలు లేనిదే టీడీపీ లేదు.. అంటూ మాయమాటలు చెప్పే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఉదంతాలను సీఎం వైఎస్ జగన్ మరోసారి గుర్తుచేయనున్నారు. తమ హక్కులు పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తిరిస్తానంటూ సచివాలయం సాక్షిగా చంద్రబాబు బెదిరించడాన్ని, ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగిన మత్స్యకారులను తాటతీస్తానంటూ చంద్రబాబు భయపెట్టిన తీరును గుర్తుచేయనున్నారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ సుప్రీంకోర్టు కొలీజియంకు చంద్రబాబు లేఖ రాయడాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపనున్నారు. 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపకపోవడాన్ని ఎత్తిచూపుతూ.. ఈ ముడున్నరేళ్లలో రాష్ట్ర కోటాలో ఎనిమిది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే.. అందులో నలుగురు బీసీలను తాము రాజ్యసభకు పంపడాన్ని గుర్తుచేయనున్నారు. టీడీపీ సర్కార్ హయాంలో బీసీల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీస్తే.. తాము అన్నింటా సమున్నత గౌరవం వచ్చి బీసీలు సగర్వంగా తలెత్తుకునేలా పరిపాలిస్తున్న తీరును ముఖ్యమంత్రి వివరించనున్నారు. -
బీసీ మహాసభ: నాడు అవమానం.. నేడు సమున్నతం..
నాడు బాబు హయాంలో... తమ హక్కులను పరిరక్షించాలని కోరిన నాయీ బ్రాహ్మణులను తాత్కాలిక సచివాలయం సాక్షిగా తోకలు కత్తిరిస్తానంటూ అధికార దర్పంతో చంద్రబాబు బెదిరించారు. హామీలను నెరవేర్చాలని విన్నవించిన మత్స్యకారులను తాట తీస్తానంటూ హూంకరించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ అవహేళన చేశారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అంటూ దళితులను, కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ మహిళలను కించపరిచి తన నిజ స్వరూపాన్ని చాటుకున్నారు. నేడు జగన్ పాలనలో... బీసీలను సమాజానికి వెన్నెముకలా తీర్చిదిద్దడమే లక్ష్యమని 2019 ఫిబ్రవరి 17న ఏలూరు బీసీ గర్జనలో చేసిన ప్రకటనను సీఎం జగన్ ఆచరించి చూపుతున్నారు. సంక్షేమ పథకాల ద్వారా డీబీటీతో బీసీల ఖాతాల్లోకి రూ.85,915.06 కోట్లు జమ చేశారు. అమ్మఒడి నుంచి విద్యాదీవెన వరకూ వివిధ పథకాల ద్వారా బీసీ విద్యార్థులకు సింహభాగం మేలు చేస్తూ ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ పదవుల వరకూ అత్యధిక పదవులను బీసీలకే కేటాయించారు. సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక చేయూత.. రాజ్యాధికారంలో సింహభాగం వాటా.. బీసీ బిడ్డల చదువులకు అండగా నిలిచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడం ద్వారా బీసీ సామాజిక వర్గాలను సీఎం వైఎస్ జగన్ సమాజానికి వెన్నెముకలా నిలబెడుతున్నారని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మూడున్నరేళ్లలో పేదలకు రూ.1,77,585.51 కోట్లను పారదర్శకంగా అందించగా బీసీ వర్గాలకే రూ.85,915.06 కోట్ల మేర ప్రయోజనం చేకూరటాన్ని ప్రస్తావిసు్తన్నారు. నగదు బదిలీ, నగదేతర బదిలీతో పేదలకు మొత్తం రూ.3,19,227.86 కోట్ల మేర లబ్ధి చేకూరగా బీసీ వర్గాలకే రూ.1,63,344.10 కోట్ల మేర మేలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టి అమ్మఒడి, విద్యాకానుక అందచేసి పిల్లలను చదువుకునేలా ప్రోత్సహించడంతోపాటు విద్యాదీవెన, వసతి దీవెన లాంటి పథకాల ద్వారా బీసీ బిడ్డలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు. అధికారంగా వాటా.. ఎన్నికలకు ముందు 2019 ఫిబ్రవరి 17న వైఎస్సార్సీపీ ఏలూరులో బీసీ గర్జన సభను నిర్వహించింది. తాము అధికారంలోకి రాగానే బీసీలకు చేసే మేలును బీసీ డిక్లరేషన్ రూపంలో ఈ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక అందులో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా వారికి ప్రయోజనం చేకూర్చారు. అవి ఏమిటంటే... ► 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50% ఓట్లతో 151 అసెంబ్లీ సీట్లు, 22 లోక్‌సభ స్థానాలతో చారిత్రక విజయాన్ని సాధించింది. 2019 మే 30న సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2019 జూన్ 8న ఏర్పాటు చేసిన మంత్రివర్గాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 11న పునర్వ్యవస్థీకరించారు. 25 మంది సభ్యులున్న తాజా కేబినెట్లో 11 మంది బీసీలకు స్థానం కల్పించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అంజాద్ బాషాతో పాటు బూడి ముత్యాలనాయుడును డిప్యూటీ సీఎంగా నియమించారు. విద్య, రెవెన్యూ, లాంటి కీలక శాఖలను ఆ వర్గాలకే అప్పగించారు. ► స్పీకర్‌గా బీసీ వ్యక్తి అయిన తమ్మినేనికు అవకాశం కల్పించారు. శాసన మండలిలో వైఎస్సార్సీపీకి 32 మంది సభ్యులుండగా అందులో బీసీలే అత్యధికం కావడం గమనార్హం. ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా నలుగురు బీసీలను జగన్ రాజ్యసభకు పంపారు. ► స్థానిక సంస్థల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించడంపై హైకోర్టును ఆశ్రయించేలా టీడీపీ నేతలను చంద్రబాబు ఉసిగొల్పారు. హైకోర్టు తీర్పుతో బీసీల రిజర్వేషన్లు 24%కి తగ్గిపోయాయి. రిజర్వేషన్లు తగ్గినా అంతకంటే ఎక్కువగా బీసీలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు. ► 13 జిల్లా పరిషత్‌ల్లో 9 జడ్పీ చైర్పర్సన్ పదవులను (70%) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించారు. ఇందులో బీసీలకే పెద్దపీట వేశారు. ► మండల పరిషత్ ఎన్నికల్లో 648 మండలాలకుగాను వైఎస్సార్సీపీ 635 మండల పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకోగా అందులో 67 శాతం పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. ఇందులో కూడా గరిష్టంగా బీసీలకే పదవులు దక్కాయి. ► 13 కార్పొరేషన్లనూ వైఎస్సార్ సీపీ క్లీన్‌స్వీప్ చేయగా ఏడు చోట్ల మేయర్ పదవులు బీసీలకు ఇచ్చారు. మొత్తంగా మేయర్ పదవుల్లో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే దక్కాయి. ఇందులోనూ బీసీలకే అగ్రతాంబూలం కల్పించారు. ► 87 మున్సిపాలిటీల్లో 84 వైఎస్సార్సీపీ కైవశం చేసుకోగా చైర్పర్సన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 73% ఇచ్చారు. ఇందులోనూ బీసీలదే అధిక శాతం వాటా ఉంది. చట్టం చేసి మరీ నామినేటెడ్ పదవులు.. ► దేశ చరిత్రలో ఎక్కడాలేని రీతిలో నామినేటెడ్ పదవులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 % రిజర్వేషన్ కల్పిస్తూ సీఎం చట్టం తెచ్చారు. 196 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవుల్లో 76(39%) బీసీలకే ఇచ్చారు. ► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల్లో 53 బీసీలకు కేటాయించారు. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. ► 137 కార్పొరేషన్లకు సంబంధించి మొత్తం 484 డైరెక్టర్ పదవుల్లో 201 బీసీలకు (42%) ఇచ్చారు. పెద్దల సభకు ఒక్కరినీ పంపలేదు బీసీలు లేనిదే టీడీపీ లేదంటూ తరచూ చెప్పే చంద్రబాబు ఆ వర్గాల ఓట్లతో అధికారంలోకి వచ్చాక వారికి వెన్నుపోటు పొడిచారు. 2014లో అధికార పగ్గాలు చేపట్టాక మంత్రివర్గంలో ఆరుగురు బీసీలకే బాబు అవకాశం కల్పించగా 11 మంది ఓసీలకు ఛాన్స్ ఇచ్చారు. 2014–19 మధ్య రాజ్యసభకు ఒక్క బీసీని కూడా బాబు పంపలేదు. నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ, మత్స్యకారులను తాట తీస్తానంటూ బెదిరించారు. అడుగడుగునా బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారు. వైఎస్సార్సీపీ వెంటే బీసీలు.. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే రాజ్యసభలో వైఎస్సార్సీపీ ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టింది. అధికారంలోకి వచ్చాక బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ చిత్తశుద్ధితో కృషిచేస్తుండటంతో ఆ వర్గాలు వైఎస్సార్సీపీ వెంటే నడుస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. చట్టసభల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంట్ ఉభయ సభల్లో పోరాటం చేస్తూ బీసీల అభ్యున్నతి కోసం శాశ్వత కమిషన్‌ను సీఎం నియమించడంతో ఆయా వర్గాలు వైఎస్సార్సీపీకి వెన్నెముకలా నిలిచాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తిరుపతి లోక్‌సభ, బద్వేలు, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయాలు ఇందుకు నిదర్శనమని ప్రస్తావిస్తున్నారు. బీసీల జనాభా అధికంగా ఉండే కుప్పంలో టీడీపీ కోట కుప్ప కూలటానికి ఇదే కారణమంటున్నారు. -
విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ కార్యక్రమానికి హాజరవుతారు. ట్రాఫిక్ ఆంక్షలు నగరంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా తెలిపారు. నగరంలో వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బెంజిసర్కిల్ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వైపు, ఐదో నంబర్ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. చదవండి: ('నా రాజకీయ జీవితంలో సీఎం జగన్‌లా ఆలోచించిన నాయకుడిని చూడలేదు') -
బీసీలంటే బ్యాక్ బోన్ క్యాస్ట్ గా నమ్మిన వ్యక్తి సీఎం జగన్ : స్పీకర్ తమ్మినేని
-
'నా రాజకీయ జీవితంలో సీఎం జగన్‌లా ఆలోచించిన నాయకుడిని చూడలేదు'
సాక్షి, విజయవాడ: దేశ చరిత్రలోనే ఎన్నడూలేని విధంగా బీసీలకి న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. నా రాజకీయ జీవితంలో సీఎం వైఎస్ జగన్‌లా బీసీల సంక్షేమానికి ఆలోచించిన నాయకుడిని చూడలేదని అన్నారు. విజయవాడ ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో డిసెంబర్ 7న జరగనున్న జయహో బీసీ సభా ఏర్పాట్లని మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరి జయరాం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, తలశిల రఘురాం తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరు బీసీ డిక్లరేషన్ని వంద శాతం అమలు చేశాం. నామినేటేడ్ పోస్టులలో 50 శాతం రిజర్వేషన్లంటే అసాధ్యమని నేను అన్నాను. అయితే సీఎం వైఎస్ జగన్ నామినేటేడ్ పోస్డులలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వేషన్లిచ్చి చరిత్ర సృష్టించారు. బీసీలకి న్యాయం చేసింది ఒక్క వైఎస్ జగన్ మాత్రమే. చంద్రబాబు బీసీలకి ఏం చేశారో చెప్పాలి. ఇస్త్రీ పెట్టెలు, తోపుడు బండ్లు ఇవ్వడమేనా బీసీల సంక్షేమం అంటూ ప్రశ్నించారు. చదవండి: (దగుల్బాజీ రామోజీ తప్పు చేస్తే ప్రశ్నించకూడదా?: మంత్రి కాకాణి) 'అమ్మ ఒడి, ఫీజు రీఎంబర్స్ మెంట్ లాంటి ఎన్నో సంక్షేమ పధకాలతో బీసీల జీవితమే మారిపోయింది. మేము చెప్పిందే చేస్తాం.. చేసేదే చెబుతాం. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలతో బీసీలకి మార్కెట్ కమిటీల నుంచి రాజ్యసభ సభ్యుల వరకు పదవులు దక్కాయి. మంత్రులుగా మాకు అధికారం లేదని టీడీపీ వ్యాఖ్యలు మా బలహీనవర్గాలని అవమానించడమే. బలహీనవర్గాలకి అండగా నిలబడింది వైఎస్ జగన్ మాత్రమే. గడిచిన మూడున్నర ఏళ్లలో బీసీలకి జరిగిన మేలు ఈ సభ ద్వారా వివరిస్తాం. రాబోయే కాలంలోనూ బీసీలకి మరింత మేలు చేయడమే వైఎస్ జగన్ ఆలోచన' అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో చుక్కెదురు) -
జయహో బీసీ మహాసభ: ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ ప్లేస్ వివరాలు ఇవే..
సాక్షి, విజయవాడ: నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఈ నెల ఏడో తేదీన జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా సోమవారం తెలిపారు. నగరంలో వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. బెంజిసర్కిల్ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్ కంట్రోల్ రూం నుంచి బెంజిసర్కిల్ వైపు, ఐదో నంబర్ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్ నుంచి ఆర్టీఏ జంక్షన్ వరకు, శిఖామణి సెంటర్ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. జాతీయ రహదారులపై.. - హైదరాబాద్–విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వాహనాలు ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, మైలవరం, నూజివీడు, హనుమాన్ జంక్షన్ ద్వారా రాకపోకలు సాగించాలి. - విశాఖపట్నం–చెన్నై మార్గంలో ప్రయాణించే వాహనాలు హనుమాన్‌జంక్షన్, గుడివాడ, పామర్రు, చల్లపల్లి, రేపల్లె, బాపట్ల, చీరాల, త్రోవగుంట, ఒంగోలు మార్గంలో ప్రయాణించాలి. - గుంటూరు–విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే వాహనాలు బుడంపాడు, తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు జంక్షన్, అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, హనుమాన్‌జంక్షన్ మీదుగా రాకపోకలు సాగించాలి. - చెన్నై–హైదరాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు మేదరమెట్ల, అద్దంకి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్‌పల్లి మీదుగా ప్రయాణించాలి. విజయవాడలో ఇలా.. - విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులు రామవరప్పాడు రింగ్, మహానాడు జంక్షన్, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు చేరుకోవాలి. - పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సులు పీసీఆర్ జంక్షన్, ప్రకాశం విగ్రహం జంక్షన్, పాత గవర్నమెంట్ ఆస్పత్రి, ఏలూరు లాకులు, జీఎస్ రాజురోడ్డు, సీతన్నపేట సిగ్నల్, బీఆర్టీఎస్ రోడ్డు, గుణదల, రామవరప్పాడు మార్గంలో ప్రయాణించాలి. - మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాల నుంచి పీఎన్‌బీఎస్‌కు వచ్చే బస్సులు తాడిగడప 100 అడుగుల రోడ్డు, ఎనికేపాడు, రామవరప్పాడురింగ్, బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్, కృష్ణలంక మార్గాన్ని అనుసరించాలి. - బస్టాండ్ నుంచి మచిలీపట్నం, గుడివాడ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పీసీఆర్, చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్రోడ్డు, గుణదల, రామవరప్పాడురింగ్, ఎనికేపాడు, తాడిగడప 100 అడుగుల రోడ్డును అనుసరించాలి. - బెంజిసర్కిల్ వైపు నుంచి బందరు రోడ్డులో ప్రయాణించే వాహనాలు పకీరుగూడెం జంక్షన్, స్క్యూ బ్రిడ్జి, వారధి జంక్షన్ మార్గం ద్వారా పీఎన్‌బీఎస్‌కు చేరుకోవాలి. - పీఎన్బీఎస్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్లే బస్సులు బస్టాండ్‌లో మధ్యనున్న ఐదో నంబర్ గేటు ద్వారా బయటకు వచ్చి రాజీవ్‌గాంధీ పార్కు, కనకదుర్గ ఫ్లై ఓవర్, స్వాతిజంక్షన్ మార్గాన్ని అనుసరించాలి. పార్కింగ్ ప్రదేశాలు ఇలా.. - మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల వాహనాలను సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ గ్రౌండ్లో నిలపాలి. - ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను స్వరాజ్య మైదానంలో పార్కు చేయాలి. - గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులకు సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ మైదానం కేటాయించారు. - కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో నిలపాలి. - పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల నుంచి సభకు వచ్చే బస్సులను బీఆర్టీఎస్ రోడ్డులో నిలపాలి. - శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే బస్సులకు ఆంధ్రా లయోల కాలేజీ మైదానాలను కేటాయించారు. -
జయహో బీసీ మహాసభకు మద్దతు
సాక్షి, అమరావతి: బీసీలే వెన్నెముక అనే నినాదంతో ఈ నెల 7న విజయవాడలో జరుగనున్న జయహో బీసీ మహాసభకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విజయవాడలోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో జయహో బీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటుతున్నా దేశంలో బీసీ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో సైతం బీసీలకు జరగని మేలు ఏపీలో సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలో జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీసీలకు అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని చెప్పారు. ఏపీలో బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా సీఎం వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని కొనియాడారు. బడుగు బలహీనవర్గాలంతా జగన్‌కు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీ రాణి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోర్ల మహీధర్ తదితర బీసీ సంఘం నేతలు మాట్లాడారు. మారుమోగుతున్న జయహో బీసీ నినాదం గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సాక్షి, అమరావతి: దేశచరిత్రలో ఎవరూ చేయలేని సామాజిక విప్లవాన్ని, జ్యోతిరావు పూలే ఆశయాలను నిజంచేసి చూపించిన సీఎం వైఎస్ జగన్ వెంటే బీసీలంతా నడుస్తున్నారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశచరిత్రలో 82 వేలమంది బీసీలను ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన ఒకే ఒక్కడు సీఎం జగన్ అని తెలిపారు. జయహో బీసీ నినాదం రాష్ట్రమంతా మారు మోగుతోందని ఆయన చెప్పారు. -
రేపే ‘జయహో బీసీ’ మహాసభ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: బీసీలు మరింత అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో వారి సమస్యలను తెలుసుకునేందుకే ‘వెనుకబడిన కులాలే వెన్నెముక’ అనే నినాదంతో ‘జయహో బీసీ మహాసభ’ కార్యక్రమాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం భారీఎత్తున నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల ఇన్చార్జి, పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నెల ఏడో తేదీన విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘జయహో బీసీ’ నినాదం చంద్రబాబు సొత్తుకాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని.. జనాభాలో 50 శాతం ఉన్న ఆ వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడచిన మూడున్నరేళ్లలో 50 శాతం నామినేటెడ్ పదవులు ఇచ్చి రాజకీయంగా, సంక్షేమం కింద రూ.1.37 లక్షల కోట్లను మంజూరు చేసి ఆర్థికంగా, విద్యా, ఉద్యోగ ఆవకాశాలు కల్పించి సామాజికంగా తలెత్తుకు తిరిగేలా చేసిందన్నారు. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కంటే ఏపీలో బీసీలు ఎక్కువ అభివృద్ధి సాధించడం సీఎం వైఎస్ జగన్ ఘనతగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా సభల నిర్వహణ ఇక సామాజిక, ఆర్థిక, రాజకీయంగా బీసీలు అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే 139 బీసీ కులాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయిలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సభ ద్వారా తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. సభ అనంతరం జోనల్, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ఇదే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా సభలు నిర్వహిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అలాగే, రాబోయే రోజుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల మహాసభలను కూడా నిర్వహిస్తామన్నారు. మరోవైపు.. సభలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ టీకే రాణా, డీసీపీలు విశాల్ గున్ని, శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్‌కు ఎంపీ సూచించారు. ఈ సందర్భంగా భోజనశాల, వాహనాల పార్కింగ్, స్టేజ్, ప్రజలు వచ్చి వెళ్లే మార్గాలను ఎంపీ పరిశీలించారు. 82 వేల మందికి ఆహ్వాన పత్రాలు ఇక వార్డు మెంబర్లు, పంచాయతీ సర్పంచ్‌లు, పీఏసీఎస్ అధ్యక్షులు, సభ్యులు, ఇతర నామినేటెడ్ పదవుల్లో ఉన్న 82,432 మంది బీసీలకు జయహో బీసీ మహాసభ ఆహ్వాన పత్రాలను పంపించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇక సభకు వచ్చే వారికోసం 24 రకాల వంటకాలను సిద్ధంచేయిస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. చంద్రబాబు బీసీల ద్రోహి: బొత్స బొత్స మాట్లాడుతూ.. బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకుని టీడీపీ రాజకీయ లబ్ధిపొందిందని మండిపడ్డారు. 14 ఏళ్ల తన పాలనలో చంద్రబాబు బీసీలను ఆణగదొక్కారన్నారు. ఆ కాలంలో బీసీ ఉపకులాలకు చెందిన వ్యక్తులకు మొక్కుబడిగా ఇస్త్రీ పెట్టెలు, మోకులు, కత్తెర్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అదే ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీల మేరకు ఏడాదికి రూ.80 వేల కోట్లను బీసీల బ్యాంకు ఖాతాల్లో జమచేశారని గుర్తుచేశారు. టీడీపీలోని బీసీ నాయకులే చంద్రబాబును చూసి ‘ఇదేం ఖర్మరా బాబూ!’ అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ ఇదీ.. ఉదయం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభను ప్రారంభిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. 10 నుంచి 12 గంటల వరకు బీసీ మంత్రులు, నాయకులు ప్రసంగిస్తారు. 12 నుంచి ఒంటి గంట వరకు సీఎం ప్రసంగిస్తారు.