
చంద్రబాబు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని మంత్రి అన్నారు.
సాక్షి, విజయవాడ: ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు ముందుందని మంత్రి జోగి రమేష్ అన్నారు. జయహో బీసీ మహాసభ విజయవంతం కావడానికి సీఎం జగన్ సంక్షేమ పాలనే కారణమన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ గల్లంతు కావడం ఖాయం అన్నారు.
కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోబోతున్నారు. సీఎం జగన్ బలహీన వర్గాలను బ్యాక్ బోన్‌గా గుర్తించారు. చంద్రబాబు బీసీలను ఓట్ల కోసం వాడుకున్నారు. బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని మంత్రి అన్నారు.
‘‘జన ప్రభజనంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ట్రైలర్ చూసి టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాబోయే మూడు దశాబ్ధాల పాటు సీఎం జగన్ పాలనను బలహీనవర్గాలతో పాటు రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. అంబేద్కర్ ఆశయాలతో సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. బీసీలకి అండగా నిలబడిన వైఎస్ జగన్‌కి బలహీన వర్గాలు అండగా ఉంటాయి’’ అని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
చదవండి: చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: సీఎం జగన్