చంద్రబాబూ.. వంకర బుద్ధి మార్చుకో: జోగి రమేష్‌ | Ex Minister Jogi Ramesh Fires On Chandrababu Naidu, More Details Inside | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. వంకర బుద్ధి మార్చుకో: జోగి రమేష్‌

Published Tue, Aug 13 2024 10:09 AM | Last Updated on Tue, Aug 13 2024 12:27 PM

Ex Minister Jogi Ramesh Fires On Chandrababu

సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగిరమేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు రాజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై జోగి రమేష్‌ నిరసన తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు  నిరసనగా ధర్నాకు దిగారు.

‘‘అగ్రిగోల్డ్‌లో మా కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా కుమారుడు విదేశాల్లో చదివాడు, ఉద్యోగం చేశాడు. బలహీనవర్గాలపై దాడి ఇది.. గౌడ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగా. కోపం ఉంటే నాపై కక్ష తీర్చుకోండి. నా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ అని జోగి రమేష్‌ ధ్వజమెత్తారు.

చంద్రబాబూ.. నీకూ కొడుకులు ఉన్నారు.. తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు. చంద్రబాబు వంకర బుద్ది మార్చుకోవాలి. ఇది జోగి రమేష్ మీద.. జోగి రాజీవ్‌పై జరిగిన దాడి కాదు.. బలహీన వర్గాలపై జరిగిన దాడి. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి.. డైవర్షన్ పాలిటిక్స్ వద్దు.. హామీలు నెరవేర్చి ప్రజలకి మంచి చేయండి ’’ అంటూ జోగి రమేష్‌ హితవుపలికారు.

అన్యాయంగా నా కొడుకు అరెస్ట్: జోగి రమేష్

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement