సాక్షి, విజయవాడ: బీసీలను అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని బీసీ ఉద్యమ నేత, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఏపీలో బీసీలకు ఆత్మగౌరవాన్ని కల్పించింది సీఎం జగనే అని వైఎస్‌ఆర్‌సీపీ జయహో మహాసభలో ఉద్ఘాటించారాయన.
బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జయహో బీసీ మహాసభలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్.. పదకొండు మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దే. బీసీ బిల్లు వస్తే.. మన(బీసీలను ఉద్దేశించి..) తల రాతలు మారిపోతాయి.
ఎన్నో ఉద్యమాలు చేశా.. బీసీ కేంద్రమంత్రుల్ని కలిశా. కానీ, ఎవరూ సీఎం జగన్‌లా కృషి చేయలేదు. ధైర్యం చేసి ఆయన బీసీల పక్షాన నిలిచారు. బీసీలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు. సీఎం జగన్ ఓ సంఘ సంస్కర్త. ఒక బీసీలకే కాదు.. అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చూస్తున్నారు.
మాయమాటలకు, మభ్య పెట్టే మాటలకు బీసీలు లొంగిపోకూడదని, చిత్తశుద్ధితో నిజంగా మన అభివృద్ధి కోరుతున్న నాయకుడికి(సీఎం జగన్) మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆర్ కృష్ణయ్య.. ఈ సందర్భంగా బీసీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment