
ఒంగోలు సబర్బన్: జయహో బీసీ సదస్సులో యాంకర్‌దే ప్రధాన పాత్రగా మారింది. గురువారం ఒంగోలు నగరంలో పాత గుంటూరు రోడ్డులోని ఏ1 ఫంక్షన్ హాల్లో ‘జయహో బీసీ’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీకి చెందిన బీసీ నాయకులు, బాధితులుగా చెప్పుకుంటున్న వారి కుటుంబ సభ్యులను పిలిపించారు. ఈ కార్యక్రమం మొత్తం యాంకర్ ఉదయభాను పాత్రే ఎక్కువైంది.
దీంతో పరిస్థితి లోకేశ్ నిల్.. యాంకర్ ఫుల్ అన్న చందంగా తయారైంది. లోకేశ్ మాట్లాడుతూ ‘9 నెలలు ఆగండి.. వైఎస్సార్‌సీపీ నేతలను బజారులో తరిమితరిమి కొడదాం. టీడీపీ నాయకులను వేధించిన వైఎస్సార్‌సీపీ నాయకులను లోపలేసి శిక్ష పడేంత వరకూ పడుకోను..’ అంటూ శపథం చేశారు. గనుల శాఖను ఘన్నుల శాఖగా ఉచ్ఛరించిన లోకేశ్.. జీవోను జియో... అని అనడంతో సదస్సులో అందరూ ఒక్కరాసిగా నవ్వారు. జయహో బీసీ సదస్సులా కాకుండా ఇది టీడీపీ సర్వసభ్య సమావేశంలా సాగింది.