Main character
-
లోకేశ్ నిల్.. యాంకర్ ఫుల్
ఒంగోలు సబర్బన్: జయహో బీసీ సదస్సులో యాంకర్దే ప్రధాన పాత్రగా మారింది. గురువారం ఒంగోలు నగరంలో పాత గుంటూరు రోడ్డులోని ఏ1 ఫంక్షన్ హాల్లో ‘జయహో బీసీ’ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీకి చెందిన బీసీ నాయకులు, బాధితులుగా చెప్పుకుంటున్న వారి కుటుంబ సభ్యులను పిలిపించారు. ఈ కార్యక్రమం మొత్తం యాంకర్ ఉదయభాను పాత్రే ఎక్కువైంది. దీంతో పరిస్థితి లోకేశ్ నిల్.. యాంకర్ ఫుల్ అన్న చందంగా తయారైంది. లోకేశ్ మాట్లాడుతూ ‘9 నెలలు ఆగండి.. వైఎస్సార్సీపీ నేతలను బజారులో తరిమితరిమి కొడదాం. టీడీపీ నాయకులను వేధించిన వైఎస్సార్సీపీ నాయకులను లోపలేసి శిక్ష పడేంత వరకూ పడుకోను..’ అంటూ శపథం చేశారు. గనుల శాఖను ఘన్నుల శాఖగా ఉచ్ఛరించిన లోకేశ్.. జీవోను జియో... అని అనడంతో సదస్సులో అందరూ ఒక్కరాసిగా నవ్వారు. జయహో బీసీ సదస్సులా కాకుండా ఇది టీడీపీ సర్వసభ్య సమావేశంలా సాగింది. -
'ఆర్ఆర్ఆర్'లో అలరించే కీలక పాత్రధారులు వీరే..
RRR Movie Main Key Characters: ప్రస్తుతం యావత్ భారతదేశం వేయి కళ్లతో ఎదురుచూసిన తరుణం సమీపించింది. ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ మల్టీస్టారర్ చిత్రం 'రౌద్రం.. రణం.. రుధిరం'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పవర్ఫుల్ నటనను వీక్షించేందుకు ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఎన్నో వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ శుక్రవారం అంటే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది ఆర్ఆర్ఆర్. ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమురం భీమ్‌గా తారక్, సీతగా బాలీవుడ్ క్యూట్ బ్యూటీ అలియా భట్ అలరించనున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్లో ఈ ఇద్దరే కాకుండా ఇతర కీలక పాత్రలు కూడా సందడి చేయనున్నాయి. ఆ పాత్రలేంటో చూద్దామా ! 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంతోనే ఆయన తెలుగు ప్రేక్షకులకు చేరువకానున్నాడు. ఇందులో ఆయనది పవర్ఫుల్ రోల్ అని తెలుస్తోంది. 'యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయ్..', 'నేనంటేనే ఓ పోరాటం' అంటూ తన చుట్టూ ఉన్న ప్రజల కోసం భార్యాబిడ్డల్ని వదిలి యుద్ధభూమిలోకి అడుగు పెట్టిన పోరాటయోధుడిగా అజయ్ దేవగన్ కనిపించనున్నారు. ఈ రోల్‌కు అజయ్ ఎలాంటి రెమ్మ్యునరేషన్ తీసుకోలేదని సమాచారం. అజయ్ దేవగన్‌కు సతీమణిగా సరోజిని పాత్రలో అలరించనుందని స్టార్ హీరోయిన్ శ్రియ సరన్. 'ఛత్రపతి' తర్వాత రాజమౌళి సినిమాలో మళ్లీ కనిపిస్తోంది శ్రియ. భర్త అడుగుజాడల్లో పోరాటంలోకి అడుగుపెట్టిన స్త్రీగా ఆమె పండించిన హావాభావాలు ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యేలా ఉన్నాయి. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు, డైరెక్టర్ సముద్రఖని నటించారు. ఇందులో ఆయన పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో రామ్‌చరణ్‌కు సన్నిహితుడిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. బ్రిటీష్ వారికి ఎదురుతిరిగేందుకు చెర్రీ సిద్ధమవుతుండగా 'చాలా ప్రమాదం.. ప్రాణాలు పోతాయిరా..' అని ఆయన ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్ మెప్పించింది. ఇంకా ఈ మూవీలో రాజీవ్ కనకాల నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళికి ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఉంది. జక్కన్న తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. వీళ్లే కాకుండా ఎన్టీఆర్‌కు లవర్‌గా విదేశీ భామ ఒలివీయా మోరీస్ కొన్ని సన్నివేశాల్లో తళుక్కున మెరిసి ఆకట్టుకోనుంది. విలనిజంతో కూడకున్న పాత్రలో ఐరిష్ నటి అలిసన్ డూడీ నటించారు. లేడీ స్కాట్‌గా ఆమె తన విలనిజాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కమెడియన్, నటుడు రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ఎన్టీఆర్ వెంట ఉండే వ్యక్తిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. -
దీపావళి వరకు ఆగాలి
‘‘సినిమాల్లో పోషించేది కేవలం పాత్రే అయినప్పటికీ కొన్నిసార్లు ఆ పాత్రలు మన మనసులో ఉండిపోతాయి’’ అంటున్నారు తాప్సీ. భూమీ ఫెడ్నేకర్, తాప్సీ ముఖ్యపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సాండ్‌కీ ఆంఖ్’ చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా ఆమె ఆ చిత్రానికి సంబంధించి తన మనోభావాలను వెల్లడించారు. ఆశయం ముందు వయసు ఎంత పెద్దదైనా చిన్నదే అవుతుందనే దానికి నిదర్శనంగా అరవై ఏళ్ల వయసులో షూటర్స్‌గా పతకాలు సాధించిన ధీర వనితలు ప్రకాషీ తోమర్, చంద్రో తోమర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. అనురాగ్ కశ్యప్ నిర్మాణంలో తుషార్ హిరానందనీ దర్శకత్వం వహించారు. ‘‘ప్రకాషీ తోమర్ అనే పాత్ర ఎప్పటికీ నాలోనే ఉండిపోతుంది. టీమ్ అందరం కలిసి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం’’ అని తాప్సీ అన్నారు. ‘‘కొన్నిసార్లు గుడ్‌బైలు కష్టంగా ఉంటాయి. ఈ టీమ్‌కు గుడ్‌బై చెప్పడం కూడా అలాంటిదే. టీమ్‌ను బాగా మిస్ అవుతాను’’ అని భూమి అన్నారు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం విడుదల అవుతోంది. -
ఆచార్యా మజాకా!
దాసరి నారాయణరావు, మోహన్‌బాబు, అన్నపూర్ణ, జయలక్ష్మి...ప్రధాన పాత్రలు పోషించిన సినిమాలోని కొన్ని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం కలిసికట్టుగా వచ్చినట్లున్నది అక్కడి పరిస్థితి.‘‘తక్షణం ఇల్లు ఖాళీ చేయాల్సిందే’’ అని ఒంటికాలి మీద లేచి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నాడు ఇంటోనరు (ఇల్లు+ ఓనరు).‘‘ఒక్క పదిరోజులు ఆగండి’’ అన్నది ఆ ఇల్లాలు భయం భయంగా.‘‘వీల్లేదు. ఈ క్షణం ఖాళీ చేయాల్సిందే. నన్ను వెధవ అనుకుంటున్నాడా....దద్దమ్మ అనుకుంటున్నాడా...చవట అనుకుంటున్నాడా....వాజమ్మ అనుకుంటున్నాడా...అసలు ఏమనుకోవడం లేదా’’ అంటూ కేకలేస్తున్నాడు ఓనరు.అనుకున్నాడో లేదో తెలియదుగానీ ‘‘నమస్కారం గురూ’’ అని ఒక న‘మస్కా’ర బాణం విసిరాడు అద్దెదారు ఆచార్య. ఆచార్యను చూడగానే మరింత ఎత్తు ఎగిరాడు ఇంటోనరు.‘‘ఏం పెద్దమనిషివయ్యా బుద్ధిలేదా’’ అని తిట్టాడు. ఉందా లేదా అని చెప్పలేదుగానీ ‘‘చదువుకున్నావు బుద్ధి లేదు. పెద్ద మనిషిని అలా నిలబెట్టి మాట్లాడతావా! వెళ్లి కాఫీ పట్రా’’ అని అరిచి ‘‘లోనికి రండి సార్’’ అని ఇంటి యజమానిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించాడు ఆచార్య.ఇక్కడ మనం ఆచార్య గురించి చెప్పుకోవాలి. కాస్త అటు ఇటుగా ‘కన్యాశుల్కం’లో గిరీశంలాంటి వాడు. మండు వేసవిలో కూడా చలికోట్లను బ్లాక్‌లో అమ్మగల నేర్పరి.‘‘ఏంటి సార్, ఆపరేషన్ చేయించుకున్నాక ఇలా అయ్యారు. ఏనుగులా ఉండేవారు పీనుగులా అయ్యారు’’ సానుభూతిగా అన్నాడు ఆచార్య.‘‘నీ మాటల్లో పడడానికి నేనేమైనా పిచ్చొడ్ని అనుకుంటున్నావా! అద్దెయ్యా....మూడు నెలల అద్దెయ్యా...మార్యాదగా ఇస్తావా లేకపోతే ఖాళీ చేస్తావా!’’ కరాఖండిగా, కఠినంగా అరిచాడు ఇంటి యజమాని.‘‘ఎందుకు సార్ అంత గట్టిగా అరుస్తారు. పాపం మీకు అసలే బ్లడ్‌ప్రెషర్. పొరపాటును మీకు గుండె నొప్పి వచ్చిందనుకో...ఫినిష్’’ అంటూ ఇటీవల ఎవరెవరు హార్ట్ ఎటాక్‌లతో చనిపోయింది పేర్లు, వృత్తితో సహా లిస్ట్ చదివాడు.ఈ దెబ్బకు ఇంటి ఓనరు భయంతో బిక్కచచ్చాడు.‘‘అన్నట్లు మీరు అమెరికా వెళ్లాలనుకుంటున్నారు కదా... మీకు అభ్యంతరం లేకపోతే మీ చెయ్యిని ఒకసారి ఇవ్వండి’’ అడిగాడు ఆచార్య.‘‘దానికేం...తప్పకుండా చూడు’’ అని చెయ్యి ఇచ్చాడు ఇంటి యాజమాని. ‘‘మీరు కొత్త ఇంట్లోకి వెళ్లి ఎన్నాళ్లయింది?’’‘‘మహా అయితే ఆర్నెల్లు అవుతుంది’’‘‘మరో ఆరు నెలల్లో నువ్వు పోతావు గురూ...’’ఇంటి యజమాని గుండెల్లోకి పిడుగు నేరుగా దూరింది. 60 లీటర్ల కన్నీరయ్యాడు.‘‘బావి ఎక్కడ తవ్వారు?’’‘‘మూలలో...’’‘‘ఏ మూలా? దక్షిణంలోనా....దానికి శాంతి చేయాలోయ్. ఓ పనిచెయ్. ఇప్పుడు నువ్వు వెళ్లిపో. నీ వెనకాలే నేను వస్తాను. నీ ఇంట్లో అన్నీ చూస్తాను. శాస్త్రోక్తంగా ఎక్కడ శాంతి చేయాలో అక్కడ చేస్తాను’’‘‘త్వరగా వచ్చేస్తావుగా’’ భయంభయంగా అన్నాడు ఇంటి యజమాని.‘‘నీ పని తప్ప నాకు వేరే ఏ పని ఉందోయ్... ఇదిగో ఒక పదిరూపాయలు ఉంటే ఇవ్వు’’ అడిగాడు ఆచార్య.వేరే సందర్భంలో అయితే ఎలా స్పదించేవాడో తెలియదుగానీ... ఇప్పుడు మాత్రం ఇరౖవై రూపాయలు తీసి...‘‘ఇరవై రూపాయల నోటే ఉంది’’ అన్నాడు ఇంటి యజమాని.‘‘ఉంటే ఏమవుతుంది! పూజకు మొత్తం 180 అవుతుంది. 20 రూపాయలు పోగా....160 మిగులుతుంది. ఆ డబ్బులు నువ్వు నాకు బాకీ అన్నమాట. ఫరవాలేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. ఇంటికి వచ్చి తీసుకుంటాలే’’ అన్నాడు ఆచార్య.కళ్ల ముందు భయం తప్ప యజమానికి ఏదీ కనిపించడం లేదు. ‘‘ఏమిటో’’ అనుకుంటూ వచ్చిన దారిన వేగంగా వెనక్కి వెళ్లాడు యజమాని.పాలవాడిని చూడగానే ఆచార్య బుర్ర బంపర్ ఐడియాతో మురిసిపోయింది.‘‘ఏమోయ్ నారాయణ ఇట్రా’’ అని పిలిచాడు.‘‘ఏమిటి బాబూ’’ అడిగాడు నారాయణ.‘‘ఏమిటయ్యా ఇది. నీ దగ్గర నేను బాకీ ఉన్నాను. నువ్వు అడగవు. నా దగ్గర తీసుకోవు’’ అన్నాడు ఆచార్య.‘‘మీలాంటి పెద్దల దగ్గర డబ్బు ఎక్కడికి పోతుంది బాబూ’’ మర్యాదగా అన్నాడు నారాయణ.‘‘పోయేది పెద్దల దగ్గరేనోయ్. ఇదిగో ఈ ఇరవై రూపాయలు తీసుకో’’ అని డబ్బు చేతిలో పెట్టాడు ఆచార్య.ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాడనే అమాయకత్వంతో ‘‘16 రూపాయలే బాబూ’’ అన్నాడు నారాయణ. ‘‘అయితే ఏమిటి! మిగిలిన నాలుగు రూపాయలతో...గేదెలున్నాయి కదా....వాటికి బ్రహ్మాండమై గడ్డి వేయించు’’ అన్నాడు ఉదారంగా నారాయణ.నారాయణ కళ్లు ఆనందంగా మెరిసాయి.‘‘ఒకమాట...నీ గేదెలను ఎవరో బందెలదొడ్లో పెట్టారని విన్నాను’’ అడిగాడు ఆచార్య.‘‘అవును బాబూ...రెండు వందలు కడితేగానీ వాటిని విడిపించుకోవడానికి లేదు’’ దీనంగా అన్నాడు నారాయణ.‘‘రెండొందలా!’’‘‘అవును బాబూ’’‘‘రెండొందలా!!!’’‘‘అవును బాబు’’‘‘ఒక యాభై రూపాయలు ఇవ్వు. వాటిని విడిపించేస్తాను’’ నమ్మకంగా అన్నాడు ఆచార్య.‘‘అంతకంటేనా బాబూ!’’ అని అడిగిన యాభై ఆచార్య చేతిలో పెట్టాడు నారాయణ. ‘‘సాయంత్రం అయిదు గంటలలోపు నీ గేదెలు నీ దొడ్లో ఉంటాయి. ఇదిగో జున్నుపాలు దొరుకుతాయా...ఆ...ఎందుకు దొరకవు...మా ఆవిడకు చాలా ఇష్టం. సాయంకాలం పట్రా’’ అని ఆర్డర్ వేసి...భార్యను కేకేసి...‘‘ఏమోయి మేరీ...నీ పుట్టిన రోజు ప్రెజెంటేషన్. ఈ యాభై రూపాయలు పెట్టి బ్రహ్మాండమైన చీర తీసుకో. ఇదిగో చూడు...సాయంత్రం నిన్ను రిసీవ్ చేసుకోవడానికి నేను రాలేను. మన హౌస్ఓనరు ఇంట్లో శాంతి చేయాలి....ఆ నారాయణ గేదెలు విడిపించాలి. ఈరోజు ఫుల్‌బిజీ’’ అంటూ హడావిడి పడతున్నాడు ఆచార్య. (జవాబు 38వ పేజీలో) -
విజయ్ సేతుపతి చిత్రంలో టీఆర్
విజయసేతుపతి కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో సీనియర్ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ ముఖ్యపాత్ర పోషించనున్నారు. టి.రాజేందర్ ఇప్పటి వరకు కథానాయకుడిగానే నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తన కొడుకు శింబు చిత్రాల్లోనే, కీలక పాత్రలను, ప్రత్యేక పాటల్లోనూ అరుదుగా నటిస్తున్న టీ.రాజేందర్ ఇప్పుడు తొలిసారిగా యువ నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనుండడం విశేషం. ఈ రేర్ కాంబినేషన్ చిత్రానికి కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. కో,అయన్, అనేగన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఈయన దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది. దీనికి ఆయనకు కథా సహకారాన్ని శుభ, కపిలన్ వైరముత్తు అందిస్తున్నారు. దీన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ అధినేతలు కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశన్, కల్పాత్తి ఎస్.సురేష్ నిర్మించనున్నారు. తనీఒరవన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత వీరు నిర్మించనున్న భారీ చిత్రం ఇది. అదే విధంగా ఏజీఎస్ సంస్థ నిర్మించనున్న 18వ చిత్రం ఇదని వారు తెలిపారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కథానాయకి, సంగీత దర్శకుడు ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో కూడి ఉంటుందని నిర్మాతల వర్గం తెలిపారు. -
మళ్లీ వెండితెరపై?
గాసిప్ శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లలాగే మీనాక్షి శేషాద్రి కూడా మళ్లీ వెండితెరపై కనిపించ నుందా? ‘గాయల్’ (1990) సినిమా సీక్వెల్లో ఆమె ముఖ్య పాత్ర పోషించ నుందట. ‘హీరో’ ‘మేరీ జంగ్’ ‘షెహన్షా’ ‘దామిని’ మొదలైన సినిమాలతో బాలీవుడ్లో చక్కని గుర్తింపు తెచ్చుకుంది శేషాద్రి. 1995లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ హరీష్ మైసూర్‌తో వివాహమయ్యాక భర్తతో పాటు అమెరికాకు వెళ్లి సినిమాలకు దూరమయ్యింది. డల్లాస్‌లో ‘చెరిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్యాన్స్’ పేరుతో డ్యాన్స్ స్కూల్‌ను కూడా ప్రారంభించింది. మీనాక్షి శేషాద్రి మళ్లీ బాలీవుడ్లో నటించనుంది అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నప్పటికీ ఆమె మాత్రం జవాబు స్పష్టంగా చెప్పడం లేదు. ‘‘ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. చర్చలు జరుగుతున్నాయి’’ అంటుంది. పైకి అలా అంటున్నప్పటికీ, బాలీవుడ్లో పునఃప్రవేశానికి తగిన కథల కోసం వెదుకుతుందనేది ఆ నోటా ఈ నోటా వినిపిస్తుంది. ‘‘అక్కడి వాతావరణంలో ఇమిడిపోవడం కాస్త కష్టంగానే ఉంది’’ అని అమెరికా గురించి ఒకప్పుడు తన మనసులో మాట చెప్పింది మీనాక్షి. కుటుంబంతో కలిసి ఇండియాలో స్థిరపడడానికి ఆమె ఆసక్తి చూపుతుందా? అందులో భాగంగానే బాలీవుడ్ సినిమాల్లో నటించనుందా? వేచి చూద్దాం!