విజయ్ సేతుపతి చిత్రంలో టీఆర్ | t.rajender in vijay sethupathi film | Sakshi
Sakshi News home page

విజయ్ సేతుపతి చిత్రంలో టీఆర్

Published Wed, Mar 23 2016 3:06 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

విజయ్ సేతుపతి చిత్రంలో టీఆర్

విజయ్ సేతుపతి చిత్రంలో టీఆర్

విజయసేతుపతి కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో సీనియర్ నటుడు, దర్శకుడు టి.రాజేందర్ ముఖ్యపాత్ర పోషించనున్నారు. టి.రాజేందర్ ఇప్పటి వరకు కథానాయకుడిగానే నటిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం స్వీయ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తన కొడుకు శింబు చిత్రాల్లోనే, కీలక పాత్రలను, ప్రత్యేక పాటల్లోనూ అరుదుగా నటిస్తున్న టీ.రాజేందర్ ఇప్పుడు తొలిసారిగా యువ నటుడు విజయ్‌సేతుపతి కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనుండడం విశేషం. ఈ రేర్ కాంబినేషన్ చిత్రానికి కేవీ.ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. కో,అయన్, అనేగన్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత ఈయన దర్శకత్వం వహించనున్న చిత్రం ఇది.

దీనికి ఆయనకు కథా సహకారాన్ని శుభ, కపిలన్ వైరముత్తు అందిస్తున్నారు. దీన్ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ ఏజీఎస్ అధినేతలు కల్పాత్తి ఎస్.అఘోరం, కల్పాత్తి ఎస్.గణేశన్, కల్పాత్తి ఎస్.సురేష్ నిర్మించనున్నారు. తనీఒరవన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత వీరు నిర్మించనున్న భారీ చిత్రం ఇది. అదే విధంగా ఏజీఎస్ సంస్థ నిర్మించనున్న 18వ చిత్రం ఇదని వారు తెలిపారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రంలో కథానాయకి, సంగీత దర్శకుడు ఇతర తారాగణం ఎంపిక జరుగుతోందని చెప్పారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం భారీ నిర్మాణ విలువలతో కూడి ఉంటుందని నిర్మాతల వర్గం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement