విశాల్ సరసన మడోన్న సెబాస్టియన్ | Madonna's second outing in Tamil likely with Vishal | Sakshi
Sakshi News home page

విశాల్ సరసన మడోన్న సెబాస్టియన్

Published Mon, Mar 28 2016 4:20 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

విశాల్ సరసన   మడోన్న సెబాస్టియన్ - Sakshi

విశాల్ సరసన మడోన్న సెబాస్టియన్

విశాల్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని మలయాళ చిత్రం ప్రేమమ్ నాయకి కొట్టేసింది. ప్రేమమ్ చిత్రం అందులో నటించిన ముగ్గురు కథానాయికలకు విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టేసింది. ఇప్పటికే సాయిపల్లవి ఏకంగా మణిరత్నం చిత్రంలో కార్తీకి జంటగా నటించే లక్కీచాన్స్‌ను దక్కించుకుంది. ఈ మలయాళీ కుట్టి తెలుగులోనూ నటించేస్తోంది. నటి మడోన్న సెబాస్టియన్‌కు కోలీవుడ్‌లో అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే ఈ కేరళ భామ నటుడు విజయసేతుపతి సరసన నటించిన కాదలుమ్ కడందుపోగుమ్ చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది.

తాజాగా విశాల్‌తో జత కట్టడానికి సిద్ధమవుతోందన్నది కోలీవుడ్ టాక్. విశాల్ ప్రస్తుతం మరుదు చిత్రాన్ని పూర్తి చేశారు. శ్రీదివ్య నాయకిగా నటించిన ఈ చిత్రానికి కొంబన్ చిత్రం ఫేమ్ ముత్తయ్య దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమం జరుపుకుంటున్న మరుదు చిత్రాన్ని మేలో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. తాజాగా విశాల్ సంచలన దర్శకుడు మిష్కిన్ దర్శకత్వంలో తుప్పరివాలన్ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. దీనితో పాటు మరో చిత్రంలో కూడా నటించడానికి పచ్చజెండా ఊపినట్లు కోలీవుడ్ టాక్. ఇంతకు ముందు పడిక్కాదవన్, మాప్పిళ్లై,అలెక్స్ పాండియన్, సకలకళావల్లవన్ చిత్రాలను తెరకెక్కించిన సురాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఇందులో విశాల్‌తో మడోన్న సెబాస్టియన్ రొమాన్స్ చేయనున్నట్లు తె లిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement