CM Jagan Attends Jayaho BC Mahasabha at Vijayawada 7th December - Sakshi
Sakshi News home page

విజయవాడలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Published Tue, Dec 6 2022 7:36 PM | Last Updated on Tue, Dec 6 2022 8:51 PM

CM Jagan attends Jayaho BC Mahasabha at Vijayawada 7th December - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో నిర్వహించనున్న జయహో బీసీ మహాసభ​ కార్యక్రమానికి హాజరవుతారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు
నగరంలో జయహో బీసీ మహాసభ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా తెలిపారు. నగరంలో వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ  ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

బెంజిసర్కిల్‌ నుంచి బందరు రోడ్డులోకి, పోలీస్‌ కంట్రోల్‌ రూం నుంచి బెంజిసర్కిల్‌ వైపు, ఐదో నంబర్‌ రూట్, ఏలూరు రోడ్డులోని సీతారామపురం సిగ్నల్‌ నుంచి ఆర్‌టీఏ జంక్షన్‌ వరకు, శిఖామణి సెంటర్‌ నుంచి బందరు రోడ్డుకు జయహో బీసీ మహా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. 

చదవండి: ('నా రాజకీయ జీవితంలో సీఎం జగన్‌లా ఆలోచించిన నాయకుడిని చూడలేదు')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement