సెల్ఫీ సరదాకు రెండు ప్రాణాలు బలి! | students died while trying to take selfies | Sakshi
Sakshi News home page

సెల్ఫీ సరదాకు రెండు ప్రాణాలు బలి!

Published Thu, Jan 26 2017 9:31 PM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM

students died while trying to take selfies

ఘట్‌కేసర్‌: సెల్ఫీ సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకుంది. హైదరాబాద్‌ తార్నాకకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అవినాశ్‌, పీడీఎస్‌ చరణ్‌, భరత్‌, వంశీలు గణతంత్ర దినోత్సవం కావడంతో కళాశాలకు సెలవు ఇచ్చారని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు వరంగల్‌ జాతీయ రహదారి ఘట్‌ కేసర్‌ సమీపంలో ఉన్న సత్యాపాల్‌ క్రషర్‌ లో ఉన్న నీటి గుంత వద్ద కొద్ది సమయం గడిపారు.

అక్కడ అవినాశ్‌, పీడీఎస్‌ చరణ్‌లు సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడిపోయారు. వారిని తోటి విద్యార్థులు రక్షించే లోగానే మృతిచెందారు. విషయాన్ని మృతుల కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ప్రమాద స్థలికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement