సీబీఎస్‌ఈకి ఇంటర్ విద్యార్థుల మార్కులు | inter students marks to cbse | Sakshi
Sakshi News home page

సీబీఎస్‌ఈకి ఇంటర్ విద్యార్థుల మార్కులు

Published Fri, Jun 10 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:05 AM

inter students marks to cbse

సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల మార్కుల వివరాలతో కూడిన సీడీని ఇంటర్‌బోర్డు సీబీఎస్‌ఈకి గురువారం పంపింది. జేఈఈ ఆలిండియా ర్యాంకులను ఖరారు చేసేందుకు ఈ సీడీని అందించింది. జేఈఈ మెయిన్స్ కోర్‌కు 60% వెయిటేజీ, ఇంటర్ మార్కుల స్కోరుకు 40% వెయిటేజీ ఇచ్చి పర్సంటైల్ నార్మలైజ్ చేసి ఆల్‌ఇండియా జేఈఈ మెయిన్‌ర్యాంకులను ఖరారు చేస్తుంది.

వీటి ఆధారంగానే ఎన్‌ఐటీ, ఐఐఐటీలలో ప్రవేశాలను చేపడతారు. ఈ ర్యాంకులను ఈ నెల 30న లేదా అంతకంటే ముందే సీబీఎస్‌ఈ ప్రకటించనుంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆలిండియా ర్యాంకులను ఈ నెల 12న విడుదల చేసేందుకు ఐఐటీ గువాహటి చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement