
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మెడికో.. ఎదురుగా వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొట్టడంతో అక్కడిక్కడ మృతి చెందాడు. రూరల్ ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్న ఎం.సాయిభార్గవ్(23) శుక్రవారం మధ్యాహ్నం 11.50సమయంలో స్కూటీపై కళాశాల నుంచి శ్రీనివాస కాలనీకి బయల్దేరాడు.
మార్గమధ్యలో అప్పన్నపల్లి బ్రిడ్జి సమీపంలో మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల వైపు వెళ్తున్న టాటా ఏస్ వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో సాయిభార్గవ్ తలకు తీవ్రమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు సాయి భార్గవ్ పట్టణంలోని శ్రీనివాస కాలనీలో అద్దెకు ఉంటూ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఫైనలీయర్ చదువుతున్నాడు. రోజు కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శుక్రవారం కళాశాలకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి ప్రభు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!)
కొవ్వొత్తుల ప్రదర్శన
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సాయి భార్గవ్ ఆత్మకు శాంతి కోసం జిల్లా జనరల్ ఆస్పత్రిలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, డాక్టర్ రామకిషన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment