
సాక్షి, ఏలూరు: ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా నరసాపురంలో భారీ ర్యాలీ చేపట్టనున్నట్లు ఏపీ బహుజన ఐక్య వేదిక వెల్లడించింది. రెండేళ్లుగా నియోజకవర్గ ప్రజలను, అభివృద్ధిని పట్టించుకోని రఘురామను ఎంపీ పదవి నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసింది. ఓట్లేసి ఎన్నుకున్న ఎంపీ తమను మోసం చేశాడంటూ నియోజకవర్గ ప్రజలు రఘురామకృష్ణరాజుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఇదిలా ఉంటే, దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రఘురామకృష్ణరాజుపై ఇవాళ ఉదయం గరగపర్రు గ్రామ దళితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజును ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. రఘురామకృష్ణరాజు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
చదవండి: రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి
Comments
Please login to add a commentAdd a comment