నరసాపురం వశిష్ట గోదావరి గట్టు ఒడ్డున బుధవారం ‘ముకుంద’ ఫేమ్ హీరో వరుణ్‌తేజ్
నరసాపురం అర్బన్: నరసాపురం వశిష్ట గోదావరి గట్టు ఒడ్డున బుధవారం ‘ముకుంద’ ఫేమ్ హీరో వరుణ్‌తేజ్ సందడి చేశాడు. లాకు ప్రాంతంలో గోదావరి గట్టు ఒడ్డున నంబర్ 1 ఫ్రేమ్స్ ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న ‘కంచె’ చిత్రం షూటింగ్ నిర్వహించారు. చిత్రంలో వరుణ్‌తేజ్ సరసన కొత్త నటి ప్రజ్ఞ పరిచయమవుతోంది. హీరో, హీరోయిన్ల మధ్య పడవపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక జాతర పాటను కూడా చిత్రీకరించారు. పాటలో దేవుని ఊరేగింపు, కోలాటం తదితర సన్నివేశాల్లో పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఈ చిత్ర షూటింగ్ నరసాపురం, పాలకొల్లు పరిసరాల్లో 15 రోజులపాటు కొనసాగుతుందని చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ సునీల్ తెలిపారు.