నరసాపురం(పశ్చిమగోదావరి జిల్లా): రాష్ట్రంలో ప్రతీ సామాజికి వర్గానికి సముచిత న్యాయం అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికారిత రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా నరసాపురంలో పేర్ని నాని ప్రసంగించారు.
‘ప్రతీ సామాజిక వర్గం నుంచి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటున్నారు అంటే అది సీఎం జగన్ ఇచ్చిన రాజ్యాధికారమే. గత ముఖ్యమంత్రి చంద్రబాబు అందర్నీ ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. 2014 నుంచి 2019 వరకూ అన్ని మంత్రి పదవుల్లో ఎక్కవ మంది చంద్రబాబు సామాజిక వర్గీయులే ఉండేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మన ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గీయులకు సముచిత స్థానం కల్పించారు సీఎం జగన్. నామినేటెడ్ పదవులను కూడా అన్ని కులాలకు ఇస్తున్నారు.
పవన్ లాంటి వ్యక్తులు సినిమాల్లో డాన్స్ రాదు గానీ రాజకీయాల్లోకి వచ్చి డ్యాన్స్‌లు కడుతున్నారు. వైఎస్సార్‌సీపీని గద్దె దించడమే తన లక్ష్యమని అంటాడు పవన్. మరి జగన్ మళ్లీ సీఎం కావాలో వద్దో అన్ని సామాజిక వర్గీయులు ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో డాన్స్ మాస్టర్ పవన్ లాంటి వారు పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ఎందుకని అడుగుతున్నారు మరి వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు?, పవన్ పిల్లల్ని మొగల్తూరు బడిలో ఎందుకు వేయలేదు? మీ పిల్లకు ఒక న్యాయం పేదలకు న్యాయమా?, చంద్రబాబు రాష్ట్రంలో అందరికి ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసాడు’ అని ధ్వజమెత్తారు. ఇక ఈ ప్రభుత్వంలో ప్రతీ పేదవాడికి సొంతింటి కల నెరవేర్చిన ఘనత జగన్‌ది’ అని కొనియాడారు పేర్ని నాని.
పవన్ కాపులను కూడా మోసం చేశాడు
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి మోసం చేయని సామాజిక వర్గం లేదు. అబద్ధం ఆడితే వచ్చే అధికారం నాకు వద్దు అని చెప్పిన వ్యక్తి జగన్. ఆయన చేసేవే చెప్తాడు, అందుకే ప్రజలంతా ఆయన్ను అభిమానిస్తారు. చంద్రబాబు లాంటి వ్యక్తులకు పవన్ కళ్యాణ్ లాంటి వారు అండగా ఉండటమే కాకుండా కాపులను కూడా మోసం చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సముచితం న్యాయం కల్పించిన వ్యక్తులు వైఎస్సార్.. ప్రస్తుతం సీఎం జగన్. ఈరోజు ఏ సామాజిక వర్గీయులు కూడా ఎవరి దగ్గరా చేయి చాచకుండా చేసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం.
ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేసాడు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకానికి కూడా చంద్రబాబు స్వస్తి పలికాడు. పేదరికం బీసీల పాలిట రాక్షసిలా ఉండేది. అలాంటి రాక్షసిని అంతం చేసిన ఘనత సీఎం జగన్‌ది. బీసీల్లో పది మందిని చట్ట సభలకు పంపించిన ఘనత కూడా సీఎం జగన్‌దే.
తొక్క తీస్తా.. తోలు తీస్తా.. ఫినిష్ చేస్తా అన్నాడు
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. ‘తొక్క తెస్తా తోలు తీస్తా.. ఫినిష్ చేస్తా అన్నాడు. నువ్వు ఏంట్రా మమ్మల్లి ఫినిష్ చేసేది.. నీ పాపం పండింది. అందుకే జైల్లో ఉన్నావ్. నాయి బ్రాహ్మానులను తోక కత్తి రిస్తా అన్నాడు.. వారు చంద్రబాబు తోకే కత్తిరించారు.బీసీ జడ్జీలుగా పనికి రారన్న వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు సామాజిక వర్గం వారే జడ్జీలుగా పనికి వస్తారా....?, బీసీ బ్యాక్ బోన్ అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. పేదలకు సంక్షేమ పాలన అందినప్పుడే నిజమైన సాధికారత అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్.
గతంలో సంక్షేమ పథకాలు అందాలంటే జన్మభూమి కమిటీలు ఆ పిండా కూడు కమిటీల వద్ద ఆత్మాభిమానం చంపు కావాల్సి వచ్చేది. నేడు సీఎం జగన్ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ తెచ్చి పేదల గడపకు పాలన చేర్చారు. మన నాయకుడు సీఎం అయితే అన్ని పథకాలు అమలు అవుతాయి.. మోస పూరిత చంద్రబాబు కావాలో హామీలు నిరవెర్చే సీఎం జగన్ కావాలో ఆలోచించండి. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క హార్బర్‌కి శంకుస్థాపన చేశాడా....? పవన్ కళ్యాణ్ ఎందుకు అడగలేదు’ అని మండిపడ్డారు.
చంద్రబాబు ఎక్కడా అబివృద్ధి గురించి పట్టించుకోలేదు
మంత్రి పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ.. ‘ఏపీలో గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నారు. ఆయన కొడుక్కి తప్ప ఎవరికి జాబ్ రాలేదు. సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఒకే ఒక్క నోటిఫికేషన్‌తో లక్షా 40 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌ది. చంద్రబాబు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఎక్కడా రుణ మాఫీ చేయలేదు. సీఎం జగన్ మూడు విడతల్లో దాదాపు 20 వేల కోట్ల రూపాయల మహిళా రుణాల రుణమాఫీ చేసిన ఘనత జగన్‌ది. చంద్రబాబు 2 సార్లు ముఖ్యమంత్రి చేశారు గానీ ఎక్కడా పింఛన్‌లను పెంచలేకపోయాడు. కానీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 33 లక్షలు ఉన్న పింఛన్‌లు 2 వేలు పెంచి పింఛన్‌ల సంఖ్య 64 లక్షలకు పెరిగింది. ఈ పింఛన్ వచ్చే జనవరి నుంచి 3 వేలు కానుంది’ అని స్పష్టం చేశారు.
అన్ని రంగాల్లోనూ సముచితం స్థానం
ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ.. ‘బడుగు బలహీన వర్గాలకు అన్ని రంగాల్లోనూ సముచిత కల్పించారు. సీఎం జగన్ నాయకత్వంలో అందరికీ సామాజిక న్యాయం లభించింది. సీఎం జగన్ రెండు లక్షల నలభై వేల కోట్లు పేదలకు అందించారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment