
‘నర్సాపురం, అమలాపురాలను కలిపి జిల్లా చేయండి’
సాక్షి, హైదరాబాద్: నర్సాపురం జిల్లా కేంద్రంగా నర్సాపురం, అమలాపురం రెవెన్యూ డివిజన్లను కలిపి సెంట్రల్ గోదావరి కొత్త జిల్లా ప్రకటించాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సీఎం చంద్రబాబును కోరారు.
నర్సాపురంలో మేజర్ పోర్టు నిర్మాణం, అంతర్వేది, పాలకొల్లు ప్రాంతాల్లో దేవాలయాలకు సౌండ్, లైట్‌సిస్టమ్ కల్పించడంతో టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను కలిపి జిల్లా చేయడం అవసరమన్నారు.