chegondi harirama jogaiah
-
చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒక జోకర్‌గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్‌ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్‌ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలు కోరి మాట్లాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళ్దామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాలలో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు. మనకు అంత బలం ఉందా? బూత్ స్థాయి బలగం ఉందా? భోజనం పెట్టే ఖర్చులు ఇవ్వగలమా? అంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకన అయిపోయారు. ఈ పరిణామం సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు పదో- పరకో సీట్లు ఇస్తే, పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. దానిని పవన్ నిజం చేశారు. రెండు పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు దానిని టీడీపీలో చేరిక సభగా మార్చి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు టీడీపీ కండువా కప్పుతుంటే పవన్ కళ్యాణ్ బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. పవన్ కళ్యాణ్ తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అవుతుండడం చిత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్ణు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు సార్లు కలుస్తానని కబురు చేసి, పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరువైపు కూడా వెళ్లకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి. ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు. అంటే పవన్‌తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడే ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడుతుండవచ్చు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఇప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్‌తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎందురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమి చేయలేని నిన్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నింటి కారణంగా పవన్‌తో కలిసి ప్రయాణించడానికి సిద్దపడితే.. పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీకి తన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 80 అసెంబ్లీ సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అడగాల్సి ఉండగా, ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే, మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయాయని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరువిప్పలేదు. జనసేననేతలు కూడా ఎవరూస్పందించలేదు. ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మీ ఖర్మ అని వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆయనను తూలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైఎస్సార్సీపీ కోవర్టుగా ముద్రవేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి, కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే తనను కోవర్టు అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్‌ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. ఇరవై సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ, తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు, జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి వారికి బోధపడింది. ఇప్పటికైనా చంద్రబాబు నోట రెండున్నరేళ్లపాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. ఎందుకంటే తన కుమారుడు లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అంత సమర్ధుడు కాదని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అవమానంగా ఫీల్ కాలేదు. అయితే జోగయ్య వంటివారి అనుమానం ఏమిటంటే ఒకవేళ కూటమికి అధికారం వస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని, అప్పుడు పవన్ అడ్డురాకూడదని కోరుకుంటారని కావచ్చు. ఈ రకంగా చంద్రబాబు ఆడుతున్న జూదంలో పవన్ కళ్యాణ్ ఒక పావుగానో, లేక ఒక జోకర్గానో ఉంటున్నారనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు చేతిలో పవన్ బందీ అయిపోయారు. బీజేపీతో పొత్తులో ఉండి, అక్కడ కాపురాన్ని వదలివచ్చినట్లు చెప్పకుండా, అనైతిక రాజకీయ సంబంధం పెట్టుకుని టీడీపీతో కలిసి ఉంటున్నారు. పైగా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ పరువు కూడా తీశారు. కానీ, బీజేపీ అధిష్టానం వీరికి ఏ సంగతి చెప్పకుండా అల్లాడిస్తోంది. దాంతో పవన్ ఎప్పుటికప్పుడు ఢిల్లీ వెళతారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లి బీజేపీతో ఒప్పందం చేసుకుంటారని ప్రచారం చేయిస్తుంటారు. కానీ, అది జరగలేదు. బీజేపీతో పొత్తు కోరుతూనే ఈ రెండు పార్టీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి నచ్చుతుందా అన్నది సందేహం. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోతే పవన్‌కు ఒకరకంగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివాటిపై క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తంటాలుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడటం ఒక కోణం అయితే, కాపులు, బీజేపీ, తన అభిమానుల మధ్య సాలెగూడులో చిక్కిన పరిస్థితి ఆయనకు ఎదురవుతోందని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
‘పవనూ.. ఈ సీట్లను మాత్రం వదలొద్దు’
పశ్చిమ గోదావరి, సాక్షి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీతో పొత్తు ప్రకటించి.. సీట్ల పంపకంలో మాత్రం ఘోరంగా తడబడుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో పోటీ చేసి.. టీడీపీతో పొత్తు సంగతి ఏమోగానీ ఈసారి పట్టుమని ముప్ఫై స్థానాలు కూడా సాధించుకోలేని స్థితికి చేరుకున్నారనే విశ్లేషణ నడుస్తోంది. అయితే సీట్ల విషయంలో రాజీపడొద్దంటూ పవన్‌పై ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరి రామజోగయ్య. ఈ క్రమంలో వరుసగా లేఖల ద్వారా చురకలూ అంటిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరో లేఖను పవన్‌కు రాశారు. రాష్ట్రంలో పావు వంతు జనాభాగా ఉండి.. ఆర్థికంగా బలంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు.. అక్కడ పోటీ చేయాల్సిన అభ్యర్థుల వివరాలను సమర్పించారాయన. ఆ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాల్సిందిగా కోరారాయన. ఈ క్రమంలో పవన్‌ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు.అలాగే.. తిరుపతి నుంచి పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయించాలని సూచించారు. మొత్తంగా.. ఆరు పార్లమెంట్ స్థానాలతో పాటు 41 అసెంబ్లీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని హరి రామజోగయ్య లేఖ ద్వారా పవన్‌ను కోరారు. 👉: హరి రామజోగయ్య లేఖ, ఏయే స్థానాలంటే.. -
పవన్.. ఐ యామ్ సారీ.. : హరి రామ జోగయ్య
పశ్చిమగోదావరి, సాక్షి: చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ పై ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరి రామ జోగయ్య స్పందించారు. ఈ మేరకు పవన్‌కు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధిస్తూ మరో లేఖ రాశారు. చంద్రబాబు అధికారం కోసం కాపులు పవన్ వెంట నడవడం లేదని.. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని.. రెండున్నరేళ్లు పవన్ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని లేఖలో హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు. పవన్‌కు హరిరామ జోగయ్య ప్రశ్నలు 1. జగన్‌ను గద్దె దించడం అంటే చంద్రబాబును అధికారంలోకి తేవడమా? 2. చంద్రబాబును సీఎం చేయడం కోసం కాపులు పవన్ వెనకాల నడవాల? 3. కూటమి అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు సీఎం పదవి ఇస్తానని ఎన్నికల ముందే చంద్రబాబు ప్రకటన చేస్తారా? 4. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు జరగకపోతే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత? 5. జనసేన సపోర్ట్ లేకుండా టిడిపి అధికారంలోకి రావడం కష్టమని 2019 ఫలితాలు చెప్పాయన్న విషయం గుర్తుందా? జనసేనకు 27 నుంచి 30 సీట్లంటూ ఏకపక్షమైన ఎల్లో మీడియాలో వస్తోన్న వార్తలు చూస్తుంటే.. ఎవరిని ఉద్ధరించడానికని పొత్తు అని ప్రశ్నించారు హరిరామ జోగయ్య. ఆయా పార్టీ శ్రేణులు ఈ విషయాల్ని గ్రహించాలంటూనే లేఖలో మరిన్ని అంశాల్ని ప్రస్తావించారాయన. వైఎస్సార్సీపీని రాజ్యాధికారం నుండి తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం కాదని.. అసలు కాపు సామాజిక వర్గం పవన్ కల్యాణ్ తో కలిసి ప్రయాణం చేస్తుంది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలని లేఖలో జోగయ్య పేర్కొన్నారు. జనసేన సపోర్ట్ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని.. అందుకే 2019 ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారాయన. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో జనసేన కనీసం 50 సీట్లలోనైనా పోటీ చేసే అవకాశం దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందన్న నమ్మకం వస్తుందని తెలిపిన జోగయ్య.. తప్పనిసరిగా 40-60 సీట్ల మధ్య పోటీ చేసి తీరాలని పవన్‌కు మరోమారు సూచించారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారపోస్తే మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయంటూ పవన్ కల్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు. అలాగే.. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం జరగకపోయినా.. ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడతానని చంద్రబాబు ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా? అని జోగయ్య లేఖ ద్వారా నిలదీశారు. -
పొత్తులపై స్పందించిన మాజీ మంత్రి హరిరామ జోగయ్య
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు పొత్తు ధర్మాన్ని పాటించలేదంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య లేఖ రాశారు. మండపేట, అరకుకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడం సరికాదన్నారు. రాజోలు, రాజానగరం సీట్లను పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటికీ జనసేన కార్యకర్తలు సంతృప్తిగా లేరన్నారు. ‘‘జనసేనకు 50 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాలు కేటాయించాలి. 20-30 సీట్లు ఇస్తే పవన్ ఆశయాలకు భంగం కలుగుతుంది. పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది. 2019లో ఓడిపోయిన జనసేన నేతలు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయిస్తే నిరాశపరిచినట్టేనని మాజీ మంత్రి హరిరామ జోగయ్య లేఖలో పేర్కొన్నారు. కాగా, యాచించే స్థితిని పవన్ నుంచి జన సైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ గతంలో కూడా లేఖ ద్వారా చురకలంటించారాయన. -
ఇంకా యాచించే స్థితేనా?.. పవన్‌కు హరిరామజోగయ్య ప్రశ్న
పశ్చిమ గోదావరి, సాక్షి: మాజీ పార్లమెంటేరియన్, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరి రామజోగయ్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. యాచించే స్థితిని పవన్ నుంచి జనసైనికులు కోరుకోవట్లేదని.. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో వైఖరి ఏంటో స్పష్టం చేయాలంటూ లేఖ ద్వారా చురకలంటించారాయన. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యల నేపథ్యంలో హరిరామ జోగయ్య లేఖ ద్వారా పవన్‌కు పలు ప్రశ్నలు సంధించారు. రాబోయే కాలంలో చంద్రబాబు నాయకత్వాన్ని పవన్ నిజంగా సమర్థిస్తున్నాడా? ఒకవేళ సమర్థిస్తే.. బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏంటని జనసేనానిని నిలదీశారు హరిరామజోగయ్య. ఏపీలో 80 శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షం ఇంకెప్పుడు? అని లేఖ ద్వారా పవన్‌ను నిలదీశారు. ‘‘మిమ్మల్ని నమ్ముకున్నవాళ్లు, మీ నుంచి ఏదో ఆశిస్తున్నవాళ్లు.. మీ వైఖరి ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఆ వైఖరిని స్పష్టంగా అందరికీ అర్థం అయ్యేట్లు చెప్పాలి’’ అని లేఖలో కోరారాయన. ఇదిలా ఉంటే.. రాష్ట్రానికి అనుభవస్తుని నాయకత్వమే కావాలంటూ పవన్ కల్యాణ్ అనేకసార్లు ప్రస్తావించిన మాటను కూడా లేఖ ద్వారా హరిరామజోగయ్య ప్రస్తావించారు. అధికారం చేపట్టి.. బలహీనవర్గాలను శాసించే స్థితికి మీరు(పవన్) తెస్తారని జనసైనికులు కలలు కంటున్నారని, ఆ కలలు ఏం కావాలని కోరుకుంటున్నారో పవన్ చెప్పాల్సిన అవసరం ఉందని లేఖ ద్వారా నిలదీశారాయాన. -
జనసేన కేడర్‌కు, పవన్‌కు వార్
పాలకొల్లు సెంట్రల్: ప్రస్తుతం జనసేన కేడర్‌కు, పవన్‌కళ్యాణ్‌కు మధ్య వార్ జరుగుతోందని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘పవన్ ఓట్లు కావాలంటారు.. జనసేన నాయకులు అధికారం కావాలంటారు. ఏది ముందు ఏది వెనుక అని విశ్లేషిస్తే జేజేలు, చప్పట్లు కాదు కావాల్సింది ఓట్లు అని పవన్‌కళ్యాణ్ అంటున్నారు.. ఓట్లు సరే అధికారం సంగతేంటి అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఓట్లు వేసి జనసేనను గెలిపిస్తే అధికారం అదే వస్తుందని పవన్ అంటుంటే.. అధికారం వస్తుందని నమ్మిస్తే ఓట్లు అవే వస్తాయని జనసేన నేతలు అంటున్నారు. తాను కోరుకుంటున్నది అధికారం కాదని, రాష్ట్ర శ్రేయస్సు, ప్రజాశ్రేయస్సు అని పవన్ అంటుంటే.. అధికారం చేజిక్కకుండా ప్రజాశ్రేయస్సు ఎలా సాధిస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు..’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన కేడర్, పవన్‌కు మధ్య జరుగుతున్న వార్ ఇదని తెలిపారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టడంలో ఆఖరి వరుసలో ఉందని సర్వేలు చెబుతున్నా తన సత్తా చూపించాలనే ఆతృతతో బీజేపీతో కలిసి పవన్ ఎన్నికల రంగంలోకి దిగడం సాహసోపేతమని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికారం చేపట్టలేదని తెలిసీ ఓటర్లు తమ ఓట్లను జనసేన–బీజేపీ కూటమికి వేసి ఎందుకు చేతులు కాల్చుకుంటారని ప్రశ్నించారు. ఏపీలో పరిస్థితి మాత్రం వేరని తెలిపారు. పవన్ 60 శాసనసభ సీట్లకు తక్కువ కాకుండా పోటీచేయవచ్చని పేర్కొన్నారు. అధికారం దక్కించుకోవడం పవన్ వంతు అయితే.. జనసేన–టీడీపీ కూటమికి ఓట్లు వేసి నెగ్గించుకోవడం తమ వంతు అని జనసేన కేడర్ దృఢ సంకల్పంతో ఉందని తెలిపారు. జనసేన టీడీపీని కలుపుకొని వైఎస్సార్సీపీని ఓడించి రాజ్యాధికారం దక్కించుకోవడానికి, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గరలో ఉందని తెలిపారు. టీడీపీ వెనుక జనసేన అని కాకుండా.. జనసేన వెంట టీడీపీ ఉందని చెప్పి మూడునెలల్లో అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలను నమ్మించగలగాలని ఆయన పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్మెయిల్? -
వెఎస్సార్‌సీపీని ఢీకొట్టడం మీ వల్ల కాదు!: హరిరామ జోగయ్య
పాలకొల్లు సెంట్రల్: జనసేన–తెలుగుదేశం ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంత జనరంజకంగా, ఆకర్షణీయంగా లేదని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక ప్రకటన చేస్తూ ‘ప్రధాన మేనిఫెస్టో అయినా కనీసం 4 కోట్ల జనాభా సంతృప్తి పడేలా ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానిపక్షంలో ఢీకొట్టడం మీ వల్ల కాదు. వైఎస్సార్సీపీ అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఢీకొట్టాలంటే ఉమ్మడి మేనిఫెస్టోలో మార్పులు చేయాలి. ఇరుపార్టీల అధినేతలకు శ్రేయోభిలాషిగా సలహా ఇస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో కొన్ని వర్గాలకు మాత్రమే అనుకూలంగా ఉన్నట్టుందని అభిప్రాయపడ్డారు. చదవండి: టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్ స్కామ్ నిధులు -
హరిరామజోగయ్యకు మంత్రి అమర్నాథ్ బహిరంగ లేఖ
విశాఖపట్నం: సీనియర్ నేత హరిరామజోగయ్యకు మంత్రి గుడివాడ అమర్నాథ్ బహిరంగ లేఖ రాశారు. ఇలా బహిరంగ లేఖ రాస్తున్నందుకు బాధగానే ఉన్నా ఇలా మీ స్థాయిని దిగజార్చుకున్న క్రమంలో సమాధానం చెప్పక తప్పటం లేదని మంత్రి అమర్నాథ్ లేఖలో పేర్కొన్నారు. ‘మా నాన్న గారితో మీకున్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ గుర్నాథరావు గారి కొడుకుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు ఇలాంటి ఉత్తరం రాస్తున్నందుకు బాధగానే ఉన్నా, మీరు ఎంత స్థాయికి దిగజారిపోయారో, మీరే సమాజంలో నిరూపించుకున్న తర్వాత, ఇక నాబోటి వారికి మీకు సమాధానం చెప్పక తప్పటం లేదు. ఏ మనిషికైనా వయసు పెరిగేకొద్దీ సంస్కారం పెరుగుతుందని అంటారు. మీకు మాత్రం పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోంది. కాబట్టే, ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలి మీరు కూడా స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీపడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. జోగయ్య గారూ.. సెన్సేషన్ కావటం కోసం అడ్డమైన వాగుడు వాగి, టీవీలకు, పత్రికలకు, సోషల్ మీడియాకు అందులో కూడా ప్రత్యేకించి ఎల్లో మీడియాకు మీరు మేత అందించాలనుకుంటున్నారు. మీ దిగజారుడుతనం పగవాడికి కూడా వద్దు. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి..?. పవన్ పుట్టిందే బాబు కోసం. పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలో. పవన్ కు నిర్మాతలంతా బాబు మనుషులే. మరి మీరు కూడా మరో ప్యాకేజి స్టార్ కావడానికి వీలుగా బాబుని, బాబు మీడియాని, బాబు వర్గాన్ని సంతోషపరచడానికి ఈ చీప్ టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారని భావించాలా..?, ఎంతో గొప్ప రాజకీయ జీవితాన్ని అనుభవించిన మీ పట్ల వ్యక్తిగతంగా మాకు ఏ రకమైన శతృత్వంగానీ, వ్యతిరేకతగానీ లేదు. కానీ, మీ రాతలు, మీ భావాలు, మీ దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయని, మీ పద్ధతి బాగుందో, లేదో, కనీసం మీ పిల్లల్ని, మీ శ్రేయోభిలాషులను కనుక్కుని మీరు విచక్షణతో, విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు. -
'జోగయ్య ఇదే మాట గతంలో చెప్పారు'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్య విషయంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఇప్పుడు ఏం చెప్పారో.. గతంలో కాకినాడ సమావేశంలోనూ అదే విషయం చెప్పారని ముద్రగడ అన్నారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రంగా హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉందంటూ హరిరామ జోగయ్య తన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని ముద్రగడ విమర్శించారు. ఎన్టీఆర్ మానసికంగా చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. -
‘నర్సాపురం, అమలాపురాలను కలిపి జిల్లా చేయండి’
సాక్షి, హైదరాబాద్: నర్సాపురం జిల్లా కేంద్రంగా నర్సాపురం, అమలాపురం రెవెన్యూ డివిజన్లను కలిపి సెంట్రల్ గోదావరి కొత్త జిల్లా ప్రకటించాలని మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య సీఎం చంద్రబాబును కోరారు. నర్సాపురంలో మేజర్ పోర్టు నిర్మాణం, అంతర్వేది, పాలకొల్లు ప్రాంతాల్లో దేవాలయాలకు సౌండ్, లైట్‌సిస్టమ్ కల్పించడంతో టెంపుల్ టూరిజంగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు. ఈ రెండు ప్రాంతాలను కలిపి జిల్లా చేయడం అవసరమన్నారు.