వెఎస్సార్‌సీపీని ఢీకొట్టడం మీ వల్ల కాదు!: హరిరామ జోగయ్య | Chegondi Harirama Jogaiah Comments On Janasena Tdp Manifesto | Sakshi
Sakshi News home page

వెఎస్సార్‌సీపీని ఢీకొట్టడం మీ వల్ల కాదు!: హరిరామ జోగయ్య

Published Wed, Nov 15 2023 7:44 AM | Last Updated on Wed, Nov 15 2023 7:44 AM

Chegondi Harirama Jogaiah Comments On Janasena Tdp Manifesto - Sakshi

పాలకొల్లు సెంట్రల్‌: జనసేన–తెలుగుదేశం ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంత జనరంజకంగా, ఆకర్షణీయంగా లేదని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు.

మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఒక ప్రకటన చేస్తూ ‘ప్రధాన మేనిఫెస్టో అయినా కనీసం 4 కోట్ల జనాభా సంతృప్తి పడేలా ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానిపక్షంలో ఢీకొట్టడం మీ వల్ల కాదు. వైఎస్సార్‌సీపీ అందిస్తున్న సంక్షేమ ఫలాలను ఢీకొట్టాలంటే ఉమ్మడి మేనిఫెస్టోలో మార్పులు చేయాలి. ఇరుపార్టీల అధినేతలకు శ్రేయోభి­లాషిగా సలహా ఇస్తున్నా’ అని పేర్కొన్నారు. ఈ మేనిఫెస్టో కొన్ని వర్గాలకు మాత్రమే అను­కూలంగా ఉన్నట్టుందని అభిప్రాయప­డ్డారు.
చదవండి: టీడీపీ ఖాతాలోకి రూ.27 కోట్ల స్కిల్‌ స్కామ్‌ నిధులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement