Minister Gudivada Amarnath Wrote A Letter To Hari Rama Jogaiah - Sakshi
Sakshi News home page

‘పవన్ కల్యాణ్ సాంగత్యంతో మీకు అశ్లీలత పెరుగుతోంది’

Published Tue, Jul 4 2023 7:20 PM | Last Updated on Tue, Jul 4 2023 7:57 PM

Minister Gudivada Amarnath Wrote A Letter To Hari Rama Jogaiah - Sakshi

విశాఖపట్నం: సీనియర్‌ నేత హరిరామజోగయ్యకు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ బహిరంగ లేఖ రాశారు. ఇలా బహిరంగ లేఖ  రాస్తున్నందుకు బాధగానే ఉన్నా ఇలా  మీ స్థాయిని దిగజార్చుకున్న క్రమంలో సమాధానం చెప్పక తప్పటం లేదని మంత్రి అమర్నాథ్‌ లేఖలో పేర్కొన్నారు.

‘మా నాన్న గారితో మీకున్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ గుర్నాథరావు గారి కొడుకుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు ఇలాంటి ఉత్తరం రాస్తున్నందుకు బాధగానే ఉన్నా, మీరు ఎంత స్థాయికి దిగజారిపోయారో, మీరే సమాజంలో నిరూపించుకున్న తర్వాత, ఇక నాబోటి వారికి మీకు సమాధానం చెప్పక తప్పటం లేదు. ఏ మనిషికైనా వయసు పెరిగేకొద్దీ సంస్కారం పెరుగుతుందని అంటారు. మీకు మాత్రం పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోంది. కాబట్టే, ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలి మీరు కూడా స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీపడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. 

జోగయ్య గారూ.. సెన్సేషన్ కావటం కోసం అడ్డమైన వాగుడు వాగి, టీవీలకు, పత్రికలకు, సోషల్ మీడియాకు అందులో కూడా ప్రత్యేకించి ఎల్లో మీడియాకు మీరు మేత అందించాలనుకుంటున్నారు. మీ దిగజారుడుతనం పగవాడికి కూడా వద్దు. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కల్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి..?. పవన్ పుట్టిందే బాబు కోసం. పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలో. పవన్ కు నిర్మాతలంతా బాబు మనుషులే. మరి మీరు కూడా మరో ప్యాకేజి స్టార్ కావడానికి వీలుగా బాబుని, బాబు మీడియాని, బాబు వర్గాన్ని సంతోషపరచడానికి ఈ చీప్ టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారని భావించాలా..?, ఎంతో గొప్ప రాజకీయ జీవితాన్ని అనుభవించిన మీ పట్ల వ్యక్తిగతంగా మాకు ఏ రకమైన శతృత్వంగానీ, వ్యతిరేకతగానీ లేదు. కానీ, మీ రాతలు, మీ భావాలు, మీ దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయని, మీ పద్ధతి బాగుందో, లేదో, కనీసం మీ పిల్లల్ని, మీ శ్రేయోభిలాషులను కనుక్కుని మీరు విచక్షణతో, విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement