పశ్చిమ గోదావరి, సాక్షి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీతో పొత్తు ప్రకటించి.. సీట్ల పంపకంలో మాత్రం ఘోరంగా తడబడుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గత ఎన్నికల్లో 130కి పైగా స్థానాల్లో పోటీ చేసి.. టీడీపీతో పొత్తు సంగతి ఏమోగానీ ఈసారి పట్టుమని ముప్ఫై స్థానాలు కూడా సాధించుకోలేని స్థితికి చేరుకున్నారనే విశ్లేషణ నడుస్తోంది.
అయితే సీట్ల విషయంలో రాజీపడొద్దంటూ పవన్‌పై ఒత్తిడి పెంచుతూ వస్తున్నారు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ హరి రామజోగయ్య. ఈ క్రమంలో వరుసగా లేఖల ద్వారా చురకలూ అంటిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన మరో లేఖను పవన్‌కు రాశారు. రాష్ట్రంలో పావు వంతు జనాభాగా ఉండి.. ఆర్థికంగా బలంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, తూర్పు కాపు కులస్తులకు జనసేన కేటాయించాల్సిన అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు.. అక్కడ పోటీ చేయాల్సిన అభ్యర్థుల వివరాలను సమర్పించారాయన.
ఆ సీట్లను ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాల్సిందిగా కోరారాయన. ఈ క్రమంలో పవన్‌ను భీమవరంతో పాటు నర్సాపురం స్థానాల నుంచి పోటీ చేయాలని సూచించారు.అలాగే.. తిరుపతి నుంచి పవన్ సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబును పోటీ చేయించాలని సూచించారు. మొత్తంగా.. ఆరు పార్లమెంట్ స్థానాలతో పాటు 41 అసెంబ్లీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని హరి రామజోగయ్య లేఖ ద్వారా పవన్‌ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment