CM YS Jagan Full Speech Highlights At Narasapuram Election Campaign Public Meeting | Sakshi
Sakshi News home page

ఇది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌: సీఎం జగన్‌

Published Fri, May 3 2024 12:48 PM | Last Updated on Fri, May 3 2024 1:44 PM

CM YS Jagan Full Speech At Narasapuram Election Campaign

సాక్షి, నరసాపురం:  చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి. అలాగే, చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పథకమైనా గుర్తుకు వస్తుందా?. రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌ అని అన్నారు. 

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్‌ నరసాపురంలో రోడ్‌ షో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 

సీఎం జగన్‌ కామెంట్స్‌..

  • పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. 
    చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపే. 
    చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని తలుపు తట్టి లేపడమే. 
    14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఒక్క మంచి పని అయినా చేశారా?. 
    టీడీపీ పాలనలో ఏనాడైనా ఇలాంటి పథకాలు అమలు చేశాడా?. 
    చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని చెప్పుకుంటారు. 
    చంద్రబాబును నమ్మడమంటే కొండ చిలువ నోట్లు తలపెట్టినట్టే.

 

  • మరో పది రోజల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. 
    ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటి భవిష్యత్‌ పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. 
    మీ బిడ్డ పాలనలో అవ్వాతాతలకు ఇంటికే రూ.3వేల పెన్షన్‌. 
    బాబు పాలనలో ఇంటికే పెన్షన్‌ వచ్చే పరిస్థితి ఏనాడైనా కనబడిందా?.

 

  • ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం, బైజూస్‌ కంటెంట్‌. 
    ఇంగ్లీష్‌ మీడియంతో అడుగులు సీబీఎస్‌సీ నుంచి ఐబీ వరకు కనపడుతుంది. 
    ఆరో తరగతి నుంచే క్లాస్‌రూమ్‌లో డిజిటల్‌ బోధన అందుతోంది. 
    ప్రభుత్వ స్కూల్స్‌ విద్యార్ధులకు బైలింగువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌. 
    రాష్ట్రంలో ఉన్న 93 శాతం పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌. 
    జగనన్న విద్యాదీనెన, వసతి దీవెన మీ బిడ్డ పాలనలోనే వచ్చింది. 
    ప్రభుత్వ కాలేజీల్లో అంతర్జాతీయ విద్యా కోర్సులు తెచ్చాం.

 

  • మీ బిడ్డ జగన్‌.. అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలబడ్డాడు. 
    అక్కాచెల్లెమ్మలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాం. 
    ఆసరా, సున్నావడ్డీ, చేయూతతో అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం. 
    అక్కాచెల్లెమ్మల కోసం కాపు నేస్తం, ఈబీసీ నేస్తం తీసుకొచ్చాం. 
    31లక్షల ఇళ్లపట్టాలు అక్కాచెల్లెమ్మలకు ఇచ్చాం. 
     

  • రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. 
    సకాలంలో ఇన్‌పుట్‌ సబ్సిబీ అందిస్తున్నాం. 
    విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా నిలిచాం. 
    ప్రతీ రంగంలోనూ విప్లవం తీసుకువచ్చాం.

     

  • పేదవాడి వైద్యం కోసం రూ.25లక్షల వరకు ఆరోగ్యశ్రీని విస్తరించాం. 
    పేషంట్‌ విశ్రాంతి సమయంలోనూ ఆర్థిక సాయం అందించాం. 
    ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌, విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా పేదవాడిని ఆదుకున్నాం. 
    నాడు-నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చాం. 
     

  • జగనన్న తోడు, జగనన్న చేదోడు ద్వారా చిరు వ్యాపారులకు సాయం అందించాం. 
    గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యం తెచ్చాం. 
    రూ.2లక్షల 70వేల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో వేశాం. 
    రెండు లక్షల 31వేల ఉద్యోగాలిచ్చాం. 
     

  • చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా?. 
    రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?. 
    రూ.87వేల కోట్ల రుణాలు మాఫీ అన్నాడు.. చేశాడా?.
    డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?. 
    రాష్ట్రంలో జరుగుతున్నది కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్‌ వార్‌. 
    మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తోంది. 
    ఇంటింటికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తారంట.. నమ్ముతారా?. 
     

  • వాలంటీర్ల సేవలు కొనసాగాలంటే రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుకే నొక్కాలి. 
    పేదవాడి భవిష్యత్‌ కోసం రెండు బటన్లు ఫ్యాన్‌ గుర్తుకే నొక్కాలి. 
    175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే.  
    మంచి చేసిన ఫ్యాన్‌ ఇంట్లోనే ఉండాలి. 
    చెడు చేసిన సైకిల్‌ ఇంటి బయటే ఉండాలి. 
    తాగేసిన టీ గ్లాస్‌ సింక్‌లోనే ఉండాలి అని కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement