ఆ నలుగురే ఇండస్ట్రీని ఏలుతున్నారు | these Four members are ruling the film Industry | Sakshi
Sakshi News home page

ఆ నలుగురే ఇండస్ట్రీని ఏలుతున్నారు

Published Thu, Dec 11 2014 4:34 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

ఆ నలుగురే ఇండస్ట్రీని ఏలుతున్నారు - Sakshi

ఆ నలుగురే ఇండస్ట్రీని ఏలుతున్నారు

నరసాపురం టౌన్:  తెలుగు సినిమా రంగాన్ని కేవలం నలుగురు వ్యక్తులే ఏలుతున్నారని, హీరోలు నలుగురు, నిర్మాతలు నలుగురు, దర్శకులూ.. నలుగురేనని చిత్ర రచయిత, నిర్మాత, దర్శకుడు ధవళ సత్యం అన్నారు. నరసాపురం వైఎన్ కళాశాలలో బుధవారం నిర్వహించిన తెలుగు-వెలుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా నాట్యమండలి కళాకారులు తెరమరుగవడంతో తెలుగు చిత్రసీమ దారి తప్పిందన్నారు. సమాజంలో మానవీయ విలువలు కనుమరుగయ్యాయని.. డబ్బుంటే సినిమాలు తీయవచ్చనే ధోరణి పెరిగిపోయిందని చెప్పారు. ఆయనతో ఇంటర్వ్యూ ఇలా సాగింది.
 
  మీ మొదటి, చివరి సినిమాలు.. మొత్తం ఎన్ని సినిమాలు తీశారు
 మొదటి సినిమా జాతర (1978) హీరో చిరంజీవి. చివరి సినిమా లవకుశ (హిందీ, యానిమేషన్) రూ.23 కోట్లతో తీశాను. 23 సినిమాలకు దర్శకత్వం వహించాను. వాటిలో ఒకటి కన్నడ చిత్రం.
 
  మీ సినీ రంగ గురువు
 దాసరి నారాయణరావు.
 
  విద్యార్థి దశలో మీ సహచరులు
 నేను పుట్టింది, పెరిగింది నరసాపురంలోనే. చదివింది వైఎన్ కళాశాల. అన్నయ్య దాసరి నారాయణరావు, గోటేటి రామచంద్రరరావు, జస్టిస్ గ్రంధి భవాని ప్రసాద్, జస్టిస్ వర్మ నా మిత్రులు. నాకు రెబల్‌స్టార్ కృష్ణంరాజు సీనియర్, చిరంజీవి జూనియర్.  
 
  మీరు తీసిన సినిమాల్లో
 మీకు బాగా నచ్చింది జాతర.
 
 మీ సినిమాల విజయానికి కారణం
 సమాజంలోని సజీవ, వాస్తవ పాత్రలు కథలు కావడం.
 
 ప్రస్తుత సినిమా పరిశ్రమ పరిస్థితి ఎలా ఉంది
 రెండో అశోకుడి మూణ్నాల పాలనలా ఉంది.
 
  భారీ వ్యయంతో, పెద్ద హీరోలతో తీస్తున్న సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి
 తీసేవాడి కన్నుపై, చూసేవాడి కన్నుపై సినిమాలు ఆధారపడి ఉండటం వల్ల.
 
  భవిష్యత్‌లో సినిమాలకు
 దర్శకత్వం వహిస్తారా కాంట్రవర్షియల్ ఆధ్యాత్మిక చిత్రం తీయాల నే ఆలోచన ఉంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement