సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: నరసాపురంలో ఒకేసారి ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎన్నడూ జరగలేదని, దేవుడి దయతో నర్సాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రూ.3,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని సీఎం అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ, ఒకేరోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయడం నర్సాపురం చరిత్రలో ఇదే మొదటిసారి అని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా యూనివర్శిటీకి శంకుస్థాపన చేశాం. నరసాపురం ఆక్వా రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందని సీఎం అన్నారు.
‘‘నర్సాపురం రూపురేఖలు మార్చేందుకు మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఫిషరీస్ యూనివర్శిటీతో నర్సాపురం రూపురేఖలు మారతాయి. ఆక్వారంగం నర్సాపురానికి ఎంత ప్రధానమైందో తెలుసు. ఫిషరీస్ వర్శిటీలు తమిళనాడు, కేరళలో మాత్రమే ఉన్నాయి. ఆక్వా కల్చర్ సుస్థిర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేశంలో 3వ ఫిషరీష్ యూనివర్శిటీ ఏపీలో రాబోతుంది. రూ.332 కోట్ల వ్యయంతో ఫిషరీష్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నాం’’ అని సీఎం జగన్ అన్నారు.
‘‘ముమ్మిడివరంలో వేట కోల్పోయినవారికి అండగా నిలుస్తున్నాం. వేట కోల్పోయిన వారికి రెండో దఫా పరిహారం అందిస్తున్నాం. ఈ ప్రభుత్వం మీది.. మీకు అండగా ఉంటుంది. జగనన్న ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం అనుకునేలా పాలన చేస్తున్నాం. ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను నెరవేరుస్తున్నాం. నేను విన్నాను.. నేను.. ఉన్నాను.. అని చెప్పి హామీని నెరవేరుస్తున్నాం. నర్సాపురంలో దశాబ్దాల కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నాం’’ అని సీఎం అన్నారు.
ఇంటింటికీ అభివృద్ధి, మనిషి మనిషికీ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీల్లోని పేదలకు సంక్షేమ పథకాల్లో భాగంగా రూ.1, 76, 516 కోట్లు అవినీతి లేకుండా నేరుగా జమ చేశామని సీఎం జగన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నామని, మ్యానిఫెస్టోలో లేని హామీలను కూడా నెరవేరుస్తున్నామన్నారు. గత పాలకుల ఊహకు అందని విధంగా సంక్షేమ పాలన అందిస్తున్నామన్నారు సీఎం జగన్.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: చంద్రబాబుకు భయం మొదలైంది: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment