గ్రామస్తులపై చేయిచేసుకున్న నరసాపురం ఎమ్మెల్యే | Narasapuram MLA Manhandled Saraipali Villagers | Sakshi
Sakshi News home page

గ్రామస్తులపై చేయిచేసుకున్న నరసాపురం ఎమ్మెల్యే

Published Sun, Feb 10 2019 1:02 PM | Last Updated on Sun, Feb 10 2019 4:59 PM

Narasapuram MLA Manhandled Saraipali Villagers - Sakshi

సాక్షి, నరసాపురం : టీడీపీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు రౌడీలా ప్రవర్తించారు. గ్రామ పంచాయతీ భవనాన్ని తరలించొద్దంటూ వేడుకున్నా వినకుండా వారిపై చేయిచేసుకున్నారు. ఈ సంఘటన నరసాపురం మండలంలోని సరిపల్లి​గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. సరిపల్లి గ్రామంలోని పంచాయతీ భవన వివాదం కోర్టు పరిధిలో ఉంది. దానిని ప్రారంభించేందుకు ఎమ్మెల్యే బండారు అక్కడకు చేరుకున్నారు. అయితే, వివాదంలో ఉన్న భవనాన్ని ప్రారంభించేందుకు వీలులేదని స్థానికులు అడ్డుచెప్పారు. దీంతో కోపంతో ఊగిపోయిన మాధవనాయుడు గ్రామస్తులపై చేయిచేసుకున్నారు. మెడలు పట్టుకుని వారిని అక్కడ నుంచి గెంటేసి పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే తీరుతో సరిపల్లిలో ఉద్రికత్తత తీవ్ర స్థాయికి చేరింది. మాధవనాయుడు రౌడీల ప్రవర్తించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement