అధికారమదంతోనే వైసీపీ నేతలపై దాడులు | TDP Leaders Attacks YSRCP Activists in narasapuram | Sakshi
Sakshi News home page

అధికారమదంతోనే వైసీపీ నేతలపై దాడులు

Published Fri, Aug 1 2014 1:18 AM | Last Updated on Wed, Oct 17 2018 6:34 PM

అధికారమదంతోనే వైసీపీ నేతలపై దాడులు - Sakshi

అధికారమదంతోనే వైసీపీ నేతలపై దాడులు

టి.నరసాపురం : టీడీపీ నాయకులు అధికారమదంతోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులు చేస్తున్నారని పోలవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. పార్టీ టి.నరసాపురం మండల కన్వీనర్ దేవరపల్లి ముత్తయ్య నివాసంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు అధికారం ఉందని విర్రవీగడం సరికాదన్నారు. అల్లంచర్లరాజుపాలెం, కొత్తగూడెం గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ ఇరువర్గాలు ఒకే విధమైన చర్యలకు పాల్పడితే కేవలం ఒక్క వైఎస్సార్‌సీపీ నాయకులపైనే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్యాయమన్నారు.
 
 వైఎస్సార్‌సీపీ నాయకుల ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినా ఇప్పటివరకు చర్య తీసుకోలేదన్నారు. తప్పుచేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి తప్ప, తప్పు చేయ ని వారిని సైతం కేసుల్లో ఇరికించడం సబబు కాదన్నారు. కొత్తగూడెంలో కోర్టు వివాదంలో ఉన్న భూములు నిజంగా ప్రభుత్వానివని తేలితే తామే ముందుం డి పేద ప్రజలకు పంపిణీ చేస్తామన్నారు. ఆ భూములపై విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అల్లంచర్ల కొత్తగూడెం గ్రామాల్లో ఘటనలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామన్నారు.
 
 కొత్తగూడెంలో అరటితోట ధ్వంసం, ఆభూమిలో బోర్లు ధ్వంసంచేసి వైఎస్సార్‌సీపీ నాయకుడు ఇంటిపై దాడిచేసినా అధికారులు సరైన చర్య తీసుకోలేదన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని, పెద్దెత్తున ఆందోళనలు, ముట్టడి కార్యక్రమాలు చేస్తామన్నారు. అమాయకులపై బనాయించిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌చేశారు. మండల కన్వీనర్ ముత్తయ్య, నాయకులు బందంచర్ల వాసిరెడ్డి దత్తుడు, ఉమ్మడి సూరిబాబు, బోళ్ల రంగారావు, మామిళ్ల సత్తిబాబు, కనిపెడ నాగేశు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement