వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్ట్ | ysrcp leader Kothapalli Subbarayudu arrest in narasapuram | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్ట్

Published Thu, Dec 4 2014 3:06 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్ట్ - Sakshi

వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్ట్

నరసాపురం : వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాకు బస్సులను కేటాయించటం లేదంటూ పార్టీ నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీపై వివక్షతోనే బస్సులను కేటాయించటం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బస్సులను కేటాయించిన ఆర్టీసీ...ప్రస్తుతం మహాధర్నాకు బస్సులు ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. మహాధర్నాకు బస్సులను కేటాయిస్తామన్న ఆర్టీసీ... చివరి నిమిషంలో మాటమార్చిందని కొత్తపల్లి మండిపడ్డారు. ధర్నాను విజయవంతం కానీవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన అన్నారు. ధర్నాకు దిగిన కొత్తపల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement