Kothapalli Subbarayudu
-
వైఎస్సార్సీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్
సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడమైనదని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. చదవండి: ‘మహానాడులో చంద్రబాబుకు ఆ ఏడుపు మరీ ఎక్కువైంది’ -
'ఊడగొట్టిన మంచం కోడులా ఎక్కడో ఉంటూ..'
సాక్షి, నరసాపురం(పశ్చిమ గోదావరి) : టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందంటూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు పేర్కొన్నారు. మంగళవారం నరసాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఊడగొట్టిన మంచం కోడులా ఎక్కడో తెలంగాణలో ఉంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు 48 గంటల సమయం ఇస్తాను అనడం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు పూర్తిగా మతిభ్రమించింది. అందుకే ఈ విధంగా మాట్లాడుతున్నారు. రాష్ట్రం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదు. సీఎం జగన్ భారత రాజ్యాంగానికి లోబడే ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప స్వార్ధంతో కాదని ముందుగా గమనించాలి. మూడు రాజధానుల విషయంలో వైఎస్ జగన్ ఎవరిని మభ్య పెట్టలేదు.. బహిరంగంగానే అసెంబ్లీలో చెప్పడం జరిగింది. వెన్నుపోటు పొడిచారు.. మోసం చేశారు.. అనే అర్హత చంద్రబాబుకు లేదు. ఎందుకంటే మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే వెన్నుపోటు దారుడుకు అర్హత గల వ్యక్తి చంద్రబాబు మాత్రమే. వెన్నుపోటు పొడిచే విషయంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటారు. రాజీనామాలు చేయండని మాకు చెప్పడం కాదు.. దమ్ముంటే మీరు రాజీనామా చేసి.. మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మళ్లీ గెలిచి అప్పుడు చెప్పండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. మూడు రాజధానులు విషయంలో ప్రజలంతా స్వాగతిస్తున్నారు. కేవలం చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసమే ఈ విధంగా మాట్లాడుతున్నారు. మూడు రాజధానులు వల్ల రాష్ట్రం నలుమూలలా అభివృద్ధి చెందుతుంది' అంటూ సుబ్బారాయుడు పేర్కొన్నారు. (దమ్ముంటే రాజీనామా చేయాలి) -
సుబ్బారాయుడికి పుత్రవియోగం
సాక్షి, నరసాపురం (పశ్చిమ గోదావరి): మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన చిన్న కుమారుడు నారాయణరాయుడు (35) మృతి చెందారు. చంటిబాబుగా ముద్దుగా పిలుచుకునే నారాయణనాయుడు చిన్నప్పటి నుంచి మానసికంగా ఎదుగుదల లేకపోవడంతో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో వీల్‌చైర్‌లోనే కుప్పకూలిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో చంటిబాబు భౌతికకాయాన్ని రుస్తుంబాదలోని కొత్తపల్లి నివాసానికి తరలించారు. కుమారుడి భౌతికకాయం వద్ద సుబ్బారాయుడు దంపతులు బోరున విలపించడం అందరినీ కలిచివేసింది. కుమారుడు చంటిబాబుపై సుబ్బారాయుడుకు అమితమైన ప్రేమ అని చెప్పుకుంటారు. సుబ్బారాయుడు సతీమణి 35 ఏళ్లుగా చంటిబాబు సంరక్షణ కోసం పూర్తి సమయాన్ని కేటాయించి శ్రమించారు. ఈ నేపథ్యంలో చంటిబాబు మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విషయం తెలియడంతో కొత్తపల్లిని ఓదార్చడానికి నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున జనం రుస్తుంబాద చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్ ఎండీ షరీఫ్, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, కొత్తపల్లి జానకిరామ్, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడీ రాజు తదితర ప్రముఖలు చంటిబాబు భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
టీడీపీ రెబల్‌గా చెరుకూరి
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ నందమూరి యువసేన జిల్లా అధ్యక్షులు చెరుకూరి రామకృష్ణ చౌదరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీ రెబల్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పట్టణ కార్యదర్శి పడమటి సోమేశ్వరరావు, సాంబ్రాని నాగబాబుతో పాటు కూడా చెరుకూరి రామకృష్ణ చౌదరికి మద్దతుగా నిలిచారు. సుబ్బారాయుడు కూడా.. నరసాపురం టిక్కెట్‌పై ఆశలు పెట్టకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా టీడీపీ రెబల్‌గా పోటీ చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబు టిక్కెట్ నిరాకరించడంతో కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇప్పటికే రాజీనామా చేశారు. జనసేనలో చేరి ఎంపీగా పోటీ చేయాలని భావించినా కుదరకపోవడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాజారావుకు సుజాత ఝలక్ చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు పీతల సుజాత వర్గం ఝలక్ ఇచ్చింది. రాజారావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పీతల సుజాత హాజరుకాలేదు. పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. పీతల సుజాత వర్గీయులు రాకపోవడంతో కార్యక్రమం వెలవెలబోయింది. హడావుడి లేకపోవడంతో ఒక కారులో వచ్చి నామినేషన్ వేసి వెళ్లిపోయారు రాజారావు. -
చంద్రబాబు మోసం చేశారంటూ కొత్తపల్లి అసంతృప్తి
-
పాపం.. అధికార పక్షం
అసెంబ్లీలో జగన్మోహన్రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్ సీపీ నేత ‘కొత్తపల్లి’ ఎద్దేవా జంగారెడ్డిగూడెం రూరల్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్హనరెడ్డి అడిగే ప్రశ్నలకు అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పలేక ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితిలో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు చమత్కరించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు సుంకర నాగదేవి ఇంటి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుబ్బారాయుడు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రజా సమస్యలను లేవనెత్తి అధికార పార్టీ సభ్యులను నిలదీస్తున్నారన్నారు. అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు. సభా ప్రాంగణంలో ప్రజా సమస్యలపై జగన్ అధికార పార్టీని ప్రశ్నిస్తున్న తీరు చూసిన ప్రజలు మెచ్చుకుంటున్నారని సుబ్బారాయుడు అన్నారు. ఎంతో గౌరవప్రదంగా జరగాల్సిన అసెంబ్లీలో అధికార పార్టీ మంత్రుల దుర్భాషలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదని చేతనైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పామాయిల్, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హామీలన్నీ నీటి మూటలే అయ్యాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పట్టణ అధ్యక్షుడు తాతకుంట్ల రవికుమార్, వార్డు కౌన్సిలర్లు ముప్పిడి అంజి, తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి, పార్టీ నాయకులు చనమాల శ్రీనివాస్, సాధనాల కరుణ్, కొత్తపల్లి జానకిరామ్, చెన్నా రమేష్, యడ్లపల్లి బాబులు, ఏవీఆర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పోలవరం’పై రాజీ పడం
నరసాపురం అర్బన్: పోలవరం ప్రాజెక్ట్ విషయంలో రాజీలేని పోరాటం చేస్తానని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. మంగళవారం కొత్తపల్లి హైదరాబాద్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశమయ్యారు. ఈ భేటీలో జిల్లాలో రైతుల పరిస్థితి, సాగునీటి సమస్య, ఇసుక కొరత, వేసవిలో జిల్లాలో తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై చర్చించినట్టు కొత్తపల్లి విలేకరులకు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్ట్‌కు న్యాయం చేయకపోవడం, ముఖ్యమంత్రి కేంద్రంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకపోవడం వంటి అంశాలను కూలంకషంగా చర్చించినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ కోసం నిర్మాణాత్మక పోరాటం చేద్దామని, ప్రభుత్వాల మెడలు వంచి ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే విధంగా పోరాడదామని అధినేత సూచించినట్టు చెప్పారు. వైఎస్ జగన్‌కు కలిసిన ముదునూరి ఆచంట : పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అరకొర నిధుల కేటాయింపుపై జిల్లా ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ముదునూరి ప్రసాదరాజు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం వైఎస్ జగన్‌ను కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అరకొర నిధులు కేటాయించడంపై అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తామని జగన్ చెప్పారన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించినట్టు ప్రసాదరాజు తెలిపారు. అధినేత దృష్టికి మెట్ట సమస్యలు దేవరపల్లి: జిల్లాలో మెట్ట రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వివరించినట్టు వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గం కన్వీనర్ తలారి వెంకట్రావు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌ను కలిసినట్టు ఆయన చెప్పారు. పొగాకు, ఆయిల్‌పామ్ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పతనమవుతున్న ఆయిల్‌పామ్ గెలల ధర, భీమోలులో రైతులకు పరిహారం ఇవ్వకుండా రైతుల భూముల్లో దౌర్జన్యంగా జరుపుతున్న చింతలపూడి కాలువ పనులు, దూబచర్ల పరిసర గ్రామాల్లో దళితుల భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటున్న తీరును వైఎస్. జగన్మోహన్రెడ్డికి వివరించినట్టు తలారి చెప్పారు. -
నరసాపురంలో కబడ్డీ పోటీలు ప్రారంభం
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు గురువారం ప్రారంభమైనాయి. ఈ పోటీలను మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రారంభించారు. ఈ పోటీల్లో 18 రాష్ట్రాల నుంచి 20 టీమ్‌లు పాల్గొంటున్నాయి. అయిదురోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్ పాల్గొన్నారు. -
పర్యటనలతో రుణం తీరిపోతుందా?
కార్యాచరణ చూపించు బాబూ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు :సరిగ్గా రెండు వారాల వ్యధిలో మూడుసార్లు పశ్చిమ పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఇప్పటికి వర కు జిల్లాకు ఏ మేలు చేశారో ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా పశ్చిమ రుణం తీర్చుకోలేనిదంటూ వల్లె వేసే చంద్రబాబు ఇంతవరకు జిల్లా ప్రగతికి సంబంధించి కార్యాచరణే ప్రకటించలేదని ఆయన పేర్కొన్నారు. గురువారం కొత్తపల్లి తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. చీటికీమాటికీ చంద్రబాబు జిల్లాలో పర్యటించడం వల్ల రూ.కోట్ల మొత్తంలో సర్కారు సొమ్ము వృథా కావడం, అధికారులకు ఒత్తిళ్లు తప్ప ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. గోదావరి డెల్టా చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రైతు ప్రస్తుత రబీ సీజన్లో తీవ్రమైన సాగునీటి సంక్షోభం ఎదుర్కొంటున్నాడని కొత్తపల్లి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఖరీఫ్ మిగిల్చిన నష్టంతో చేతిలో చిల్లిగవ్వ లేక రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నాడని పేర్కొన్నారు. అయితే బెజవాడ కాల్‌మనీ మకిలిని సాధారణ వడ్డీ వ్యాపారులకు కూడా అంటించడంతో రైతులకు ఎవ్వరూ రుణాలు ఇవ్వడం లేదని, సర్కారు రుణమాఫీ గారడీ దెబ్బకు బ్యాంకులూ రుణాలిచ్చేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లోనైనా చంద్రబాబు కనీస ధర్మంగా స్పందించాలని కొత్తపల్లి కోరారు. గత ఖరీఫ్ సీజన్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది ఖరీఫ్ అంచనా నష్టం రూ.87కోట్లతో పాటు గత మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాల దెబ్బకు నష్టపోయిన రైతాంగానికి రావాల్సిన రూ.137 కోట్ల పరిహారాన్ని కూడా వెంటనే రైతులకు అందజేయాలని కోరారు. అదనపు జలాల కోసం ఒడిశాను త్వరగా ఒప్పించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. లేదంటే రబీ పంటను ఎండగట్టిన పాపం పాలకులదేనన్నారు. -
దాళ్వాకు నీరిస్తే సరి.. లేదంటే పోరే మరి
పాలకొల్లు :మూడో పంటకు సైతం పుష్కలంగా సాగునీరు అందిస్తామన్న ప్రభుత్వం దాళ్వా నారుమడుల దశలోనే చేతులెత్తేసి రైతులను నట్టేట ముంచుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. ముందు గా ప్రకటించిన ప్రకారం దాళ్వాకు పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయాలని.. లేదంటే రైతులతో కలసి పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. డెల్టాకు పూర్తి స్థాయిలో నీరివ్వాలనే డిమాండ్‌తో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పాలకొల్లు టాక్సీ స్టాండ్ సెంటర్లో బుధవారం ఏర్పాటు చేసిన రైతు సదస్సుకు అన్నదాతలు పోటెత్తి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపల్లి మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో జిల్లాను ఎడారిగా మార్చడం అన్యాయమన్నారు. రైతులకు నిత్యం అండగా ఉండాలని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ నాయకులను ఆదేశించారని చెప్పా రు. ఆ నేపథ్యంలోనే పాలకొల్లు నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద రైతులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ మేకా శేషుబాబుపైన, పార్టీ నాయకులపైన కేసులు పెట్ట డం దారుణమన్నారు. డెల్టా ప్రాంతంలో ఎన్నడూలేని విధంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల రైతులకు నష్టమే తప్ప ఏమాత్రం ప్రయోజనం లేదని వైఎస్సార్ కాంగ్రెస్, కమ్యూనిస్ట్, లోక్‌సత్తా పార్టీలతోపాటు రైతు సంఘాల నాయకులు మొరపెట్టుకున్నా చంద్రబాబు పెడచెవిన పెట్టారన్నారు. రైతుల ప్రయోజనాలను గాలికొదిలి ముడుపుల కోసం పట్టిసీమ పథకం నిర్మించారని విమర్శించారు. ఎత్తిపోతలు నిర్మిం చకపోతే నీటికోసం ఒడిశా రాష్ట్రాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం వచ్చేది కాదన్నారు. రైతుల్ని గాలికొదిలేస్తారా : శేషుబాబు ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ దాళ్వాకు పుష్కలంగా నీరందిస్తామన్న ప్రభుత్వం రైతుల్ని గాలికొదిలేసిందని దుయ్యబ ట్టారు. భారీ వర్షాల కారణంగా సార్వా పంట నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీపై విత్తనాలు అందిస్తామన్న ప్రభుత్వం మొహం చాటేసిందన్నారు. పూర్తిగా నీరిస్తామని ప్రగల్భా లు పలికిన ప్రజాప్రతినిధులు నారుమడులు ఎండిపోతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల ఇబ్బందులపై అసెంబ్లీలో చర్చించలేదని, సమస్యలను గాలికొదిలి అన్నివర్గాల వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీతోపాటు అన్ని కుంభకోణాల్లోనూ టీడీపీ నాయకులు పీకల్లోతు కూరుకుపోయారని, అధికారులపై దౌర్జన్యాలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. రుణమాఫీ పేరుతో అప్పుల ఊబిలోకి నెట్టారు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ హామీ నెరవేర్చకపోగా.. కొత్త రుణాలు కూడా ఇవ్వకుండా దగా చేశారన్నారు. దీనివల్ల రైతులు ప్రైవేటు అప్పుల ఊబిలో కూరుకుపో అష్టకష్టాలు పడుతున్నారన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్లే డెల్టాలో సాగునీటి ఎద్దడి తలెత్తిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి జపం చేయడం తప్ప ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రైతులందరికీ పూర్తిస్థాయిలో సాగునీరందించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ నాయకులు ధనార్జనకు పరిమితమై ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. ముం దుగా ప్రకటించిన ప్రకారం దాళ్వాకు పూర్తిస్థాయిలో నీరందించాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ దాళ్వాకు పూర్తిగా నీరిస్తామని ప్రకటించిన ప్రభుత్వం నాట్ల సమయంలోనే రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. పైరు పెరిగిన తరువాత పరిస్థితి మరెంత దుర్భరంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులు కొయ్యే మోషేన్‌రాజు, చెల్లెం ఆనందప్రకాష్, నడపన సత్యనారాయణ, పాతపాటి సర్రాజు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, వందనపు సాయిబాలపద్మ, తలారి వెంకట్రావు, గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, గుణ్ణం సర్వారావు, బీసీడీఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మేకా పార్వతి, జిల్లా అధ్యక్షురాలు కటిక శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేకా శ్రీనివాస్, దాసరి అంజిబాబు, చినిమిల్లి గణపతిరావు పాల్గొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు నివాళి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడిన డెల్టా రైతులు చేగొండి నాగబాబు, చినిమిల్లి చంద్రరావుకు వైఎస్సార్ సీపీ నాయకులు నివాళులు అర్పించారు. సభా వేదికపై వారి చిత్రపటాలను ఉంచి ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. -
'గోదావరి డెల్టా ఎండిపోవడానికి చంద్రబాబే కారణం'
ఏలూరు : గోదావరి డెల్టా ఎండిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గ్రామాల్లోని పొలాలను వారిద్దరు పరిశీలించారు. అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు, మేకా శేషుబాబు మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలు ఎండిపోతాయన్న తాము ఆనాడు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం కారణంగానే గోదావరి జిల్లాల్లో సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రేపు పాలకొల్లులో రైతు గర్జన నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. -
బాబు పాలన ప్రజా కంటకం
♦ వైఎస్సార్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ♦ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరు ఉధృతం చేస్తాం ♦ త్వరలో పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పర్యటన సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన ప్రజా కంటకంగా తయారైందని, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పార్టీ పనితీరుపై జగన్ సమీక్షలు చేపట్టారని, అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా సమావేశం జరిగిందని చెప్పారు. అనతి కాలంలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న చంద్రబాబుపై ఇంకా పోరాటం ఎలా చేయాలి, పార్టీ కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా ఎలా నిర్వహించాలన్న దానిపైనే చర్చించామన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ ఎన్నికల అనంతరం పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తిస్తున్నారని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో డీజిల్ ధరలు తగ్గుతూ ఉంటే ఆర్టీసీ చార్జీలు పెంచడమనేది చరిత్రలో ఎన్నడూ జరగలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ వైపు ధనికులు సంచరించే విమానాలకు వేల కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడంతోపాటు భారీగా ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తున్నారని, మరో వైపు పేదలు ప్రయాణించే ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పశ్చిమ గోదావరికి జగన్... చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు గిట్టుబాటు ధరలు లేకుండా పోయాయని, తమ జిల్లాలో పామాయిల్ క్వింటాలు ధర రూ.మూడు వేలకు పడిపోయిందని కొత్తపల్లి తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని జగన్‌ను కోరామన్నారు. కష్టాల్లో ఉన్న పామాయిల్ రైతులకు ధైర్యం చెప్పేందుకు తమ జిల్లా పర్యటనకు రావాల్సిందిగా కోరామని, త్వరలో జగన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తేదీ ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. -
'ప్రత్యేక హోదాతోనే ఏపీకి పూర్వవైభవం'
నరసాపురం: ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్రప్రదేశ్‌కు పూర్వవైభవం వస్తుందని, హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష ఆగదని ఆ పార్టీ నేత కొత్త సుబ్బరాయుడు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో నరసాపురంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మేలని భావించినపుడు బీజేపీ, టీడీపీలు ఎన్నికల ముందు ఈ మాట ఎందుకు చెప్పలేదని సుబ్బారాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించకపోతే ప్రజల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. -
హోదా వచ్చే వరకు జగన్ దీక్ష కొనసాగుతుంది
ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ దీక్ష కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొత్తపల్లి సుబ్బారాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ... బ్రిటిష్ వారి పాలన కంటే చంద్రబాబు పాలన దారుణంగా ఉందని ఆరోపించారు. తెలుగు ప్రజల ఆవేదన రూపమే వైఎస్ జగన్ దీక్ష అని పేర్కొన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నాం కనుకే ప్రత్యేక హోదా టీడీపీతోనే సాధ్యమని ఎన్నికల సమయంలో చెప్పారని వారు గుర్తు చేశారు. ఇప్పుడు ఎందుకు మాటమారుస్తున్నారని టీడీపీ నేతలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్యాకేజీలు కాదు, ప్రత్యేక హోదా మాత్రమే కావాలన్ని వారు డిమాండ్ చేశారు. టీడీపీ విధానాలనే బీజేపీ అమలు చేస్తుందా అనే అనుమానం కలుగుతోందని వారు చెప్పారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని కొత్తపల్లి సుబ్బారాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. -
మహిళలకు సీఎం క్షమాపణలు చెప్పాలి
ఏలూరు : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మండిపడ్డారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మాట్లాడుతూ... 15 నెలలు పాలనలో ప్రత్యేక హోదా ఎందుకు గుర్తుకు రాలేదంటూ చంద్రబాబును వారు ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం న్యూఢిల్లీలో ధర్నా చేపట్టారని... ఆ తర్వాత కూడా చంద్రబాబు మేల్కొలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు లింగ వివక్ష వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మహిళలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ డిమాండ్ చేశారు. -
పట్టిసీమను ఏవిధంగా జాతికి అంకిత ఇస్తారు?
ఏలూరు(ప.గో): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అభద్రతా భావం నెలకొందని.. దాంతోనే ఆయన పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అసలు పట్టిసీమ పనులు పూర్తికాకుండా పట్టిసీమను ఏ విధంగా జాతికి అంకితమిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళిలు ప్రశ్నించారు. పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించడమంటే పంద్రాగస్టునాడు ప్రజలను మోసగించడమేనన్నారు. దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ యాత్రల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కారణంగానే ప్రత్యేక హోదా రావట్లేదన్నారు. తాడిపూడి డైవర్షన్ తో పశ్చిమ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. -
ప్రత్యేక హోదాపై పచ్చి మోసం
{పత్యేక హోదా ఇవ్వకుంటే ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి ఏలూరు(ఆర్ఆర్ పేట) : రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రాకు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, దానికి మద్దతు పలికిన టీడీపీ ప్రజలను మోసం చేశాయని వైఎస్సార్ సీపీ జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల ప్రత్యేక హోదా చాలదని, తాము అధికారంలోకి వస్తే కనీసం పదేళ్లపాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని బీజేపీ నేత ఎం.వెంకయ్యనాయుడు ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మరచిపోలేదని పేర్కొన్నారు. అదే వెంకయ్యనాయుడు మంత్రిగా ఉన్న ప్రభుత్వమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ప్రకటించడం సిగ్గు చేటన్నారు. గతంలో రామ మందిర నిర్మాణం విషయంలో బీజేపీ దేశ ప్రజలను మోసగించిందని, ఆ మోసాన్ని గ్రహించిన ఓటర్లు తరువాత ఎన్నికల్లో ఆ పార్టీని అధికారం నుంచి దించేశారని గుర్తు చేశారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన ఆ పార్టీ మరోసారి అధికారం నుంచి దిగిపోవాల్సి వస్తుందన్నారు. బీజేపీతో అంటకాగుతున్న టీడీపీ ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోవడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని సుబ్బారాయుడు హెచ్చరించారు. విశ్వాసాన్ని కోల్పోతున్న ప్రభుత్వాలు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మోసగించగా, ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఆ హామీ నుంచి పలాయనం చిత్తగిస్తోందన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడంలో చూపిన ఉత్సాహాన్ని ప్రత్యేక హోదా అమలు చేయడంలో చూపకపోవడం దారుణమన్నారు. -
అవినీతిని ఎండగట్టండి
తాడేపల్లిగూడెం : టీడీపీ ప్రజాప్రతినిధుల అవినీతిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక ధన రెసిడెన్సీలో సోమవారం జరిగిన నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్త తోట గోపి అధ్యక్షత వహించిన సమావేశంలో కొత్తపల్లి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గడిచిన 14 నెలలుగా ప్రజల సమస్యలపై పోరాడుతున్నారన్నారు. ఉద్యోగ వర్గాలకు ఫిట్మెంట్, పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంపు జగన్మోహన్రెడ్డి అల్టిమేటం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అన్నివర్గాల గురించి తపనపడే వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఈ విషయూన్ని రాష్ట్రంలోని ప్రజలు గుర్తించారని తెలిపారు. పార్టీ అధినేతకు మద్దతుగా కార్యకర్తలు మరింత ఉత్సాహంతో పనిచేయూలని కొత్తపల్లి సూచించారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి వంక రవీంద్ర మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో అవినీతిని పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వైఎస్ హయాంలో యూనిట్ రూ.500కే లభ్యమైన ఇసుక నేడు రూ.2 వేలకు ఎందుకు చేరిందో వివరించాలన్నారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీపై కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. నియోజకవర్గ పరిశీలకుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిడిగంటి మోహనరావు మాట్లాడుతూ అన్ని సామాజికవర్గాలకు ప్రాధాన్యతనిచ్చి కమిటీలను ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. తోట గోపి మాట్లాడుతూ అధికారంలో లేమని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు.ఈతకోట తాతాజీ మాట్లాడుతూ రానున్న రోజులన్నీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవేనన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు లంకా మోహనబాబు, పట్టణ మహిళా కమిటీ అధ్యక్షురాలు దింటకుర్తి లీలావతి, పార్టీ పట్టణ కమిటీ అధ్యక్షుడు బొడ్డు సాయిబాబా తదితరులు మాట్లాడారు. సమావేశంలోపి.గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ కొండేటి చిట్టిబాబు, పెంటపాడు, తాడేపల్లిగూడెం మండలాల అధ్యక్షులు బాలం కృష్ణ, వల్లూరి బ్రహ్మానందం, పాల్గొన్నారు. నూతన కమిటీల ప్రమాణ స్వీకారం పట్టణ కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన బొడ్డు సాయిబాబా, గూడెం మండల కమిటీ అధ్యక్షుడిగా బాలం కృష్ణ, పెంటపాడు మండల అధ్యక్షుడిగా వల్లూరి బ్రహ్మానందం, ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జాలాది సురేష్, బీసీ సెల్ అధ్యక్షుడిగా సంగాడి బాలాజీలు ప్రమాణం చేశారు. -
రాజమండ్రి ఘటన ప్రభుత్వ తప్పిదమే
పోలవరం : రాజమండ్రి ఫుష్కర ఘాట్‌లో తొక్కిసలాట జరిగి 27 మంది ప్రాణాలు కోల్పోరుున ఘటన ప్రభుత్వ తప్పిదం వ ల్లే జరిగిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు, కొత్తపల్లి నాని, వన్నెంరెడ్డి శ్రీనివాస్‌తో కలిసి గూటాలలో పుష్కర స్నానం చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించటానికే గాని, సృష్టించడానికి కాదన్నారు. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో ఉదయం 6.20 భక్తులను స్నానాలకు వదిలి ఉంటే భక్తుల ప్రాణాలు పోయేవి కాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్‌లో కాకుండా పుష్కరఘాట్‌లో స్నానమాచరించి గంటల తరబడి అక్కడ ఉండడంతో భక్తుల సంఖ్య పెరిగిపోరుుందని, దీంతోనే ఘటన జరిగిందని కొత్తపల్లి చెప్పారు. అధికారులకు బాధ్యతలు అప్పగించకుండా ప్రభుత్వం ప్రచారం కోసం అనవసరమైన హడావిడి చేసిందన్నారు. ఈనెల 21న కేబినెట్ సమావేశం రాజమండ్రిలో పెడతానని సీఎం చెప్పారని, దీనివల్ల పుష్కరాలకు వచ్చే భక్తులు, స్థానికులకు ఇబ్బందులు తప్ప ఒరిగేదేమీ ఉండదని చెప్పారు. పుష్కరాల తర్వాత రాజమండ్రిలో కేబినెట్ సమావేశం పెట్టుకోవాలని సుబ్బారాయుడు సూచించారు. రాజమండ్రిలో ఇప్పటికే వసతులు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో కేబినెట్ సమావేశం తగదన్నారు. పట్టిసీమలో దైవదర్శనం కోసం వెళ్లే భక్తులు ఇసుక తిన్నెలపై ఎండలో ఇబ్బందులు పడుతున్నారని, చలువ పందిళ్లు వేయించాలని సూచించారు. మండల కన్వీనర్ సుంకర వె ంకటరెడ్డి, పార్టీ నాయకులు బుగ్గా మురళీకృష్ణ, వలవల సత్యనారాయణ, షేక్ ఫాతిమున్నీసా తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
సీఎం చంద్రబాబును అరెస్ట్ చేయాలి
సాక్షి, కొవ్వూరు : రాజమండ్రి పుష్కర ఘాట్‌లో విషాద ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యుడని, ఆయనను అరెస్ట్ చేయూలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. బుధవారం కొవ్వూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కర ఘాట్ ఘటనకు ఆయన నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఆదేశాలతోనే అధికారులు వీఐపీ ఘాట్లను ఏర్పాటు చేశారని, వీవీఐపీ హోదాలో ఉన్న వ్యక్తి సాధారణ ఘాట్‌లో పుష్కర స్నానం ఆచరించటంవల్ల ఈ ఘోరం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను కూడా చంద్రబాబు రాజకీయం చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. న్యాయవిచారణ పేరుతో దీనిని తప్పుదోవ పట్టించి సంబంధం లేని అధికారిని బలిచేయటానికి చంద్రబాబు పకడ్బందీగా కసరత్తు చేస్తున్నారని ఆరోపించారు. న్యాయవిచారణ పేరుతో రెవెన్యూ, పోలీస్ అధికారులను బలిచేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఘటనకు సంబంధించి అన్ని వాస్తవాలు వీడియో ఆధారాలతో పాటు లక్షల మంది ప్రజలు చూశారని, ఇంకా చంద్రబాబు నాయుడు న్యాయవిచారణ అని మాట్లాడటం ఎంతరకు సమంజసం అని ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పుష్కర యాత్రికులకు ఎక్కడా అసౌకర్యం కలిగించకుండా పుణ్యస్నానాలు ఆచరించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. -
నేడు వైఎస్ జగన్ రాక
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కొవ్వూరు రానున్నారు. రాజ మండ్రి నుంచి బయలుదేరి ఉదయం 8 గంటలకు కొవ్వూరు చేరుకుంటారు. ఇక్కడి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానమాచరిస్తారు. అనంతరం రాజమండ్రికి తిరిగి వెళ్తారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. -
ప్రమాదం కాదు.. ప్రభుత్వ హత్యలే
పుష్కర్‌ఘాట్ (కొవ్వూరు): గోదావరి పుష్కరాల ప్రారంభం సందర్భంగా రాజమండ్రి పుష్కర్‌ఘాట్‌లో 32 మంది మృత్యువాత పడిన ఘటన ప్రమాదం కాదని, ఆర్భాటపు ప్రభుత్వం చేసిన హత్యలే అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. కొవ్వూరు వీఐపీ ఘాట్‌లో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పుష్కర స్నానానికి వచ్చిన భక్తులు మృత్యువాత పడిన ఘటనపై చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలన్నారు. తాను నాలుగేళ్ల వయసు నుంచి పుష్కరాలు చూస్తున్నానని, ఇలాంటి ప్రమాదం ఎప్పుడూ చోటు చేసుకోలేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా సరైన ఏర్పాట్లు చేయలేదన్నారు. ఇది ఘోర తప్పిదమని, ప్రభుత్వ అసమర్థ వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హంగు, ఆర్భాటాలేకానీ ఏర్పాట్లపై సరిగా దృష్టి సారించలేదన్నారు. ఆయన ప్రత్యేక విమానంలో రావడం, తూతూ మంత్రంగా అధికారులతో మాట్లాడి వెళ్లిపోవడం తప్ప ప్రత్యక్షంగా ఘాట్లు పరిశీలించిన దాఖలాలు లేవన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుష్కర స్నానం చేసి వెళ్లేలా ఏర్పాట్లు చేశామంటూ చెప్పిన ప్రచారమంతా అవాస్తవమన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని కొత్తపల్లి ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే అమాయక ప్రజల ప్రాణాలు పోయాయని, వారి కుటుంబాలకు సరైన న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ తరుఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలి : కారుమూరి పుష్కర్‌ఘాట్ దుర్ఘటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కారుమూరి వెంకటనాగేశ్వరరావు విమర్శించారు. తాను మూడు పుష్కరాలకు వచ్చి గోదావరిలో పుణ్యస్నానమాచరించానని, ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ చూడలేదన్నారు. మంత్రులు బాధ్యత వహించాలి : వనిత జిల్లాకు చెందిన మంత్రులతో పాటు పలువురు మంత్రులు పుష్కరఘాట్లు సందర్శించి ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేశామని ప్రచారం చేసుకోవడం తప్ప వాస్తవ పరిస్థితులపై దృష్టిసారించలేదని వైఎస్సార్సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. దీనికి పూర్తి బాధ్యత ఆ మంత్రులే వహించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యం : శ్రీలక్ష్మి పుష్కరఘాట్ దుర్ఘటనకు ప్రభుత్వం వైఫల్యమే కారణమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ప్రధానకార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆమె విచారం వ్యక్తంచేశారు. చంద్రబాబు నిర్లక్ష్యమే కారణం భీమవరం: రాజమండ్రి పుష్కరఘాట్‌లో తొక్కిసలాట ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబుదే బాధ్యతని వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లను స్వయంగా చూస్తున్నానని పేర్కొన్న చంద్రబాబు ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాలన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రచారానికే పరిమితమయ్యారేగానీ ఏర్పాట్లను సమీక్షించలేదన్నారు. వందల కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ ప్రభుత్వం యాత్రికులకు మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదన్నారు. గోదావరి పుష్కరాలను ప్రచార అస్త్రంగా మార్చుకున్న చంద్రబాబు సౌకర్యాలు కల్పించటంలో వైఫల్యం చెందటమే ఈ ఘోర సంఘటనకు కారణమన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మిగిలిన 11 రోజులు ఘాట్లలో అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కొవ్వొత్తులతో ప్రదర్శన పాలకొల్లు సెంట్రల్: పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ప్రచార ఆర్భాటాలకన్నామౌలిక వసతులు కల్పిస్తే ఇటువంటి ప్రమాదం జరిగేది కాదని ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నా రు. మంగళవారం రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాటలో మృతి చెందిన పుష్కర యాత్రికుల ఆత్మకు శాంతి చేకూరాలని స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ నుంచి కొవ్వొత్తులతో ఆయన ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. శేషుబాబు మాట్లాడుతూ వీఐపీ ఘాట్ ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు సరస్వతి ఘాట్‌లో సుమారు 3 గంటలు పూజలు నిర్వహించటంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ప్రచారం చేసుకున్నారుకానీ వసతులు కల్పించలేకపోయారన్నారు. మా ట్లాడితే చాలు నాకు చాలా అనుభవం ఉందని ఊదరగొట్టే అనుభవం ఇదేనా అని ప్రశ్నించారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ చేయడానికి శిబిరాలు లేవని, 108, 104ల సౌకర్యాలు కల్పించలేకపోయారని చెప్పారు. దీనికి చంద్రబాబు నైతిక బాద్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలన్నారు. నాయ కులు యడ్ల తాతాజి, చెల్లెం ఆనందప్రకాష్, గుణ్ణం సర్వారావు, డి.దుర్గమ్మ, ఎం.మైఖేల్‌రాజు పాల్గొన్నారు. -
సర్కారు వైఫల్యాలపై రణభేరి
ఏలూరు (టూ టౌన్) : రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ గురువారం ఉదయం 10 గంటలకు ఏలూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపడుతున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జిల్లా నలుమూలల నుంచి రైతులు, అన్నివర్గాల ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ మొదలైనా రైతులకు బాసటగా నిలిచేందుకు కార్యాచరణ అమలు చేయకపోవడం, వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకపోవడం, రైతులకు రుణాలు అందించే ఏర్పాటు చేయకపోవడం వంటి వైఫల్యాలను నిరసిస్తూ పార్టీ నాయకులు ధర్నాకు పిలుపునిచ్చారు. జిల్లాలో సుమారు 3లక్షల మంది రైతులు 2లక్షల 40వేల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. వీరికి ఇప్పటివరకూ సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాలు అందజేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు రెండు లక్షల టన్నుల ఎరువులు అవసరం కాగా, సరపడా ఎరువులను సిద్ధం చేయలేదు. ఏ మండలానికీ పూర్తిస్థాయిలో విత్తనాలు చేరలేదు. మెట్ట ప్రాంతంలో విద్యుత్ అంతరాయంతో బోర్లు ఉన్న రైతులు సైతం దుక్కులు ప్రారంభించలేదు. ఈ సమస్యలపై ప్రభుత్వం కనీస దృష్టి సారించకపోవడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతల అవస్థలను సర్కారు దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ ధర్నా చేపట్టింది. తరలిరండి : కొత్తపల్లి ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, అన్నివర్గాల ప్రజలు తరలి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆంధ్రా అన్నపూర్ణగా పేరున్న మన జిల్లాలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై పోరాడటానికి అంతా కలసి రావాల న్నారు. సర్కారు తీరుకు వ్యతిరేకంగా పోరాటాలు జరిపి రైతులకు న్యాయం జరిగేవిధంగా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మహిళలూ.. తరలిరండి రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం నిర్వహించే ధర్నాకు మహిళలు తరలిరావాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. రైతుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. -
'వైఎస్ జగన్ అంటే భయమెందుకు?'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే టీడీపీ నేతలకు భయమెందుకని ఆ పార్టీ సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బరాయుడు ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో టీడీపీ నేతలు తెలంగాణ ఏసీబీకి పట్టుపడ్డారని, ఈ కేసులో వైఎస్ జగన్‌కు సంబంధమేంటని నిలదీశారు. గురువారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యాలయంలో కొత్తపల్లి సుబ్బరాయుడు, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డితో కలసి మీడియాతో్ మాట్లాడారు. టీడీపీ తెలంగాణ ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోవాలని, తప్పు చేయకుంటే చేయలేదని నిరూపించుకోవాలని కొత్తపల్లి సుబ్బరాయుడు సూచించారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి, తెలుగు ప్రజల పరువు తీసిన టీడీపీ నాయకుల వైఖరిని తప్పుపట్టినందుకు వైఎస్ జగన్ దిష్టిబొమ్మలను టీడీపీ నేతలు దగ్ధం చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. మీ తప్పులను కప్పిపుంచుకోవడానికి ఇది సరైన విధానం కాదని మండిపడ్డారు. ఏపీ సర్కార్ మొత్తం ఓటుకు కోట్లు కేసు చుట్టూ తిరుగుతోందని, రైతు, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. చంద్రబాబు ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సీపీ నేత, మాజ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. రాయలసీమ, కృష్ణా డెల్టా రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు విస్మరిస్తున్నారని ఆరోపించారు. తన కేసు కోసం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు పాలమూరు ప్రాజెక్టుపై మాత్రం తన వైఖరి చెప్పడం లేదని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. -
'వైఎస్ జగన్ అంటే భయమెందుకు?'
-
ఏడాది పాలనలో ఏం చేశారు!
రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశారు వైఎస్సార్ సీపీ నాయకులపై కేసులు పెట్టాలనే స్థాయికి దిగజారారు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో తట్ట మట్టి కూడా తీయలేదు కలెక్టరేట్ వద్ద ధర్నాలో కొత్తపల్లి, నాయకుల ఆగ్రహం ఏలూరు (ఆర్ఆర్ పేట) : ‘ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశారు. రుణమాఫీ పేరుతో రైతులను, డ్వాక్రా మహిళలను దగా చేశార’ని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. ఏడాది పాలనలో టీడీపీ వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా నిర్వహించారు. సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేయాలని మహిళలే పట్టుపట్టడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని, ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో దీనినిబట్టే అర్థమవుతోందని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్న పెద్దమనిషి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు ఊడకొడుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్న వారిపై కేసులు పెట్టండని పత్రికల్లో ప్రకటించే స్థాయికి టీడీపీ నాయకులు దిగజారారని ఎద్దేవా చేశారు. జిల్లాలో మొత్తం సీట్లను కట్టబెట్టినప్రజల నోట్లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మట్టి కొడతామంటున్నారని ధ్వజమెత్తారు. ఏడాది కాలంగా పోలవరం ప్రాజెక్టులో ఒక్క తట్ట మట్టి కూడా తీయలేదని గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరు వస్తుందనే భయంతోనే పనులను నీరుగార్చుతున్నారన్నారు.నిప్పులు చెరిగిన నాయకులు పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాల రాజు మాట్లాడుతూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున ఐదు సంతకాలు పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. ఇసుక మాఫియా, వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు, హత్యాకాండలతోనే టీడీపీ ఏడాది పాలన గడిచిందని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పన్ను మినహాయింపులు, రాయితీలు వచ్చేవన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదని నిలదీశారు. గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు మహిళల ఆత్మగౌరవాన్ని బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి మాట్లాడుతూ నీరు- చెట్టు పథకం ద్వారా తెలుగు తమ్ముళ్లు రియల్ఎస్టేట్ వ్యాపారులకు మట్టిని అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఆచంట కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ టీడీపీకి అధికారం ఎంతో కాలం ఉండదని గ్రహించి ఆ పార్టీ నాయకులు ఇప్పటినుంచీ అన్నీ చక్కబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దెందులూరు కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలని చంద్రబాబు ప్రకటించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు. బాబు కన్నా ఫ్యాక్షనిస్టు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. అనంతరం కలెక్టరేట్‌కు వెళ్లి జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావుకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురామ్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎం.కాశిరెడ్డి, నియోజకవర్గ కన్వీనర్లు పార్టీ నాయకులు తానేటి వనిత, పుప్పాల వాసుబాబు, నాయకులు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, కారుమంచి రమేష్, చలమోలు అశోక్‌గౌడ్, వి.విజయనరసింహరాజు, ముప్పిడి సంపత్‌కుమార్, చెల్లెం ఆనందప్రకాష్, లంకా మోహన్‌బాబు, పోల్నాటి బాబ్జి, పెన్మెత్స సుబ్బరాజు పాల్గొన్నారు. -
సిగ్గుచేటు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఏలూరు(ఆర్‌ఆర్‌పేట) :ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద ట్రాన్స్ట్రాయ్ అతిథిగృహంలో బసచేసి పట్టిసీమ ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహించడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీకి 15కు 15 ఎమ్మెల్యే సీట్లూ కట్టబెట్టిన జిల్లా ప్రజలకు, రైతులకు వెన్నుపోటు పొడుస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను తరలించుకుపోవడానికి చంద్రబాబుకు చేతులెలా వచ్చాయని ప్రశ్నించారు. రెండు రోజుల పాటు సమీక్షలు నిర్వహించిన బాబు పోలవరంపై ప్రకటన కూడా చేయకుండా వెళ్లిపోవడం దురదృష్టకరమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.4,500 కోట్లతో ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం ద్వారా ఆ మేరకు ప్రజాధనాన్ని నిరుపయోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు నెలల్లో మూడుసార్లు పోలవరం, పట్టిసీమ ప్రాంతాలను సందర్శించిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై స్పష్టమైన ప్రకటన చేయకుండా పలాయన మంత్రం పఠించారని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి కేంద్రంలోని తమ మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం నుంచి నిధులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వైఎస్‌కు పేరు వస్తుందనే భయంతో అటకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పూరై్తనా సూర్యచంద్రులున్నంతకాలం వైఎస్ పేరు నిలిచిపోతుందన్నారు. పట్టిసీమ నిర్వాసిత రైతులకు రూ.లక్షల నష్టపరిహారం అందచేస్తూ పోలవరం రైతులను విస్మరించడం తగదన్నారు. మంత్రి దేవినేని ఉమ, సీఎం చంద్రబాబు దఫదఫాలుగా పోలవరం ప్రాజెక్టును పరిశీలించారని, ప్రాజెక్టుకు ఎన్ని నిధులు విడుదల చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పట్టిసీమకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి, జిల్లా కోశాధికారి డాక్టర్ దిరిశాల వరప్రసాద్, నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
'కమీషన్ల కోసమే బాబు జిల్లాకు వస్తున్నారు'
ఏలూరు: పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విఫలమయ్యారని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. గురువారం ఏలూరులో కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ... పనులు జరగని పోలవరం ప్రాజెక్ట్‌పై ఎన్నిసార్లు సమీక్షలు నిర్వహిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కమిషన్లు దండుకోవడానికే చంద్రబాబు పదేపదే జిల్లాకు వస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఈ ఏడాది కాలంలో ఈ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని చంద్రబాబును ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.చంద్రబాబు నాయుడు నేడు, రేపు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించనున్నారు. అలాగే రేపు పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటనపై కొత్తపల్లి సుబ్బారాయుడు నిప్పులు చెరిగారు. -
'పోలవరం ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయండి'
ఏలూరు: రైతాంగానికి నష్టం కలిగించే పట్టిసీమ ప్రాజెక్ట్‌ను వెంటనే నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పశ్చిమగోదావరి జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నర్సాపురం, మొగల్తూరులో దున్నపోతులతో నిరసన చేపట్టాయి. పోలవరం ప్రాజెక్టు పనులను వెంటనే పూర్తి చేయాలని సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్ట్ విరమించే వరకూ గోదావరి జిల్లాలకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. -
జగన్ యాత్రలో రాజకీయ దురుద్దేశం లేదు
ప్రధాన ప్రతిపక్షంగా స్పందించాల్సింది మేమే రైతుల కోసం భవిష్యత్‌లో కూడా పోరాటాలు చర్చకు సిద్ధమని తొలి సవాల్ మేమే విసిరాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో బుధవారం నుంచి చేపట్టిన ప్రాజెక్టుల సందర్శన బస్సుయాత్ర రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నది కాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు స్పష్టం చేశారు. గురువారం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీలు మాత్రమే ఉన్నాయని, ఆ రెండు మిత్రపక్షాలు కావడంతో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ.. ప్రజలకు ఎదురయ్యే ఏ చిన్న సమస్యపైనైనా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ప్రజల పక్షాన తమ పార్టీ శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తోందని గుర్తుచేశారు. తమ నాయకుడు జగన్ రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగుల కోసం ప్రశ్నలు సంధిస్తూ పోరాటాలు చేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలకు పోవడం లేదని, ప్రతిపక్షాలు తమ నేతపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నా ఆయన హుందాగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రైతుల కోసం భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆ పనులు చేపట్టాలన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే ఉభయగోదావరి జిల్లాలకు నష్టాన్ని చేకూర్చే ఈ ప్రాజెక్టు లిఫ్టు పైపులను 16 మీటర్ల ఎత్తున నిర్మించుకుంటే తమ పార్టీ స్వాగతిస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జీవోలో పరిశ్రమల కోసమేనని చెప్పగా ప్రజల నుంచి వ్యక్తమైన ఆందోళనలతో ఈ నీటిని రాయలసీమకు తరలించడం కోసమని మాట మార్చారని ఎద్దేవా చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే జిల్లా ఎడారిగా మారిపోతుందని ఇంజినీర్లు స్పష్టం చేసినా తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ఆంతర్యాన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ల్యాండ్‌మైన్ అంత ప్రమాదకరమైన ప్రాజెక్టు అయినందునే పట్టిసీమను తమ పార్టీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారని ఒక విలేకరి కొత్తపల్లి దృష్టికి తీసుకురాగా ఈ సవాల్‌ను తొలిసారిగా విసిరింది మేమేనని ఆయన స్పష్టం చేశారు. జగన్ నిర్వహించిన బస్సుయాత్ర, రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జిల్లా రైతాంగానికి, ప్రజల్లో జగన్ యాత్రపై చైతన్యం కలిగించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియచేశారు. పార్టీ మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, జిల్లా క్రమశిక్షణ సంఘం సభ్యులు పటగర్ల రామ్మోహనరావు, జిల్లా కోశాధికారి దిరిశాల వరప్రసాదరావు, నగర కన్వీనర్ గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నగర కన్వీనర్ మున్నుల జాన్‌గురునాధ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ బస్సు యాత్రను దిగ్విజయం చేయండి
తాడేపల్లిగూడెం: రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15వ తేదీన తలపెట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల సందర్శన యాత్రను విజయవంతం చేయాలని ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్చార్జ్ కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తాడేపల్లిగూడెంలో పార్టీ సమన్వయకర్త తోట గోపి నివాసంలో నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ... ఉభయగోదావరి జిల్లాల రైతులకు పట్టిసీమ వల్ల కలిగే నష్టం, పోలవరంతో కలిగే లాభాల గురించి తెలియజెప్పి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీ భుజస్కందాలపై ఉందన్నారు. ఆ దిశగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ అధినేత ఈ నెల 15న బస్సు యాత్ర ద్వారా తలపెట్టిన ప్రాజెక్టు ప్రాంతాల సందర్శనను దిగ్విజయం చేయడంతో పాటు రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కానుమూరి నాగేశ్వరరావు, కొయ్యం మోసేన్‌రాజు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్ల బాలరాజు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు. -
ఇక రణమే
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలి పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేస్తే సహించం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పోలవరం :ఉభయ గోదావరి జిల్లాల రైతుల, ప్రజల నోట్లో మట్టికొట్టే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టిసీమ శివక్షేత్రం రేవులోని సత్రంలో నిర్వహించిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసే వరకూ రైతులతో కలసి వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని చెప్పారు. ఈ నెల 26న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసన సభ్యులతో కలిసి బస్సులో పోలవరం ప్రాజెక్ట్‌ను, పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తారన్నారు. ప్రధానంగా ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలనే డిమాండ్‌తో జగన్మోహన్రెడ్డి ఈ పర్యటన చేస్తున్నారన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాల మాఫీ, అంగన్వాడీల సమస్యలపై అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడితే ప్రభుత్వం విపక్షం గొంతునొక్కిందన్నారు. వైఎస్సార్ సీపీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించలేదన్నారు. పైగా సభ్యులను సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు. రైతుల నుంచి భూమి తీసుకునేప్పుడు అధికారులు ఒక రకంగా, భూమి తీసుకున్నాక మరో రకంగా మాట్లాడతారన్నారు. పట్టిసీమలో భూములు కోల్పోయే వారంతా చిన్న, సన్నకారు రైతులని, వారందరికీ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు. జగన్మోహన్రెడ్డి పర్యటనకు పెద్దఎత్తున రైతులు తరలివచ్చి సమస్యలు చెప్పుకోవాలన్నారు. జగన్మోహన్రెడ్డి పర్యటన ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. పట్టిసీమ వద్ద వైఎస్ జగన్మోహన్రెడ్డితో రైతుల ముఖాముఖి ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు జగన్ వెళతామన్నారు. పోలవరం పనులు జరుగుతుండగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మించడం పొరపాటు అని ఈ పొరపాటును ప్రభుత్వం సరిదిద్దుకుని రైతులకు న్యాయం చేయాలన్నారు. కృష్ణా జిల్లాకు నీరు తీసుకువెళ్లవద్దనటం లేదని, పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే కృష్ణాతోపాటు గుంటూరు, రాయలసీమ జిల్లాలకూ నీరందించే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసేందుకే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తూ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు విమర్శించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నిర్మాణాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో పట్టిసీమ పథకాన్ని నిర్మిస్తామనడం తగదన్నారు. పట్టిసీమ నిర్మాణంలో అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాడుతుంటే అధికార ఎమ్మెల్యేలు ఆయనపై వ్యక్తిగత దూషణకు అధికార పార్టీ పాల్పడటం దుర్మార్గమన్నారు. ప్రజల వద్దకు వచ్చి రైతుల కోసం పోరాటం చేసేందుకు జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రైతులు ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వొద్దన్నారు. రైతులు ఎప్పుడు పిలిచినా తాము వస్తామన్నారు. అధిక సంఖ్యలో రైతులు తరలివచ్చి జగన్మోహన్రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలన్నారు. పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ రైతులకు భరోసా ఇచ్చేందుకే జగన్మోహన్రెడ్డి పట్టిసీమకు వస్తున్నారన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఇప్పటికీ పూర్తి చేయలేదని, ఈ పరిస్థితుల్లో పట్టిసీమ పథకం చేపట్టడం శుద్ధ దండగ అని అన్నారు. సమావేశంలో పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, పార్టీ ప్రధాన కార్యదర్శి కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, పోల్నాటి బాబ్జి, ఆరేటి సత్యనారాయణ, తాడికొండ మురళీకృష్ణ, ముప్పిడి సంపత్‌కుమార్, ఇళ్ల భాస్కరరావు, తలారి వెంకట్రావు, సీహెచ్ వీరయ్య, కారుమంచి రమేష్, పి.శ్రీలక్ష్మి, వందనపు సాయిబాలపద్మ, ఎస్ఎస్ రెడ్డి, సయ్యద్ బాజీ, గద్దే వీరకృష్ణ, సుంకర వెంకటరెడ్డి, బుగ్గా మురళీకృష్ణ, వలవల సత్యనారాయణమూర్తి, పాతాళ సుబ్బారావు, దాకే మంగాయమ్మ, షేక్ పాతిమున్నీషా పాల్గొన్నారు. అనంతరం పోలవరంప్రాజెక్టు పనులను కొత్తపల్లి, పార్టీ నాయకులు పరిశీలించారు. -
వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడిగా ఆళ్ల నాని
పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుగా కొత్తపల్లి సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఆళ్ల నానిని నియమించారు. నాని ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. నానికి పార్టీ అత్యున్నత విభాగమైన పీఏసీలో స్థానం కల్పించినందున పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష పదవిలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును జగన్ నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
'8 నెలల్లోనే చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలు'
నరసాపురం(ప.గో):ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి తణుకులో నిర్వహించిన రైతు దీక్షను విజయవంతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిది నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం బట్టబయలైందని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. బాబు పాలనపై ప్రజలు విసుగు చెంది రైతు దీక్షకు అధిక సంఖ్యలో తరలివచ్చారని కొత్తపల్లి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వైఎస్సార్ సీపీ సమరభేరీ మోగిస్తూనే ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిత్యం ఆందోళనలతో కళ్లు మూసుకున్న చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని కొత్తపల్లి తెలిపారు. -
‘ధర్నా’పై దాడులు
ప్రజావ్యతిరేక పాలనపై నేడు వైఎస్సార్సీపీ మహాధర్నా ధర్నాలను అడ్డుకునేందుకు దాడులకు తెగబడిన టీడీపీ నేతలను అరెస్టు చేసి నిర్బంధిస్తున్న పోలీసులు కృష్ణాలో పార్థసారథిపై రాళ్లు, ఆయన్నే అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పశ్చిమలో కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్టు విశాఖలో జగన్ ధర్నాను అడ్డుకునేందుకు భారీగా పోలీసుల మోహరింపు.. అన్ని జిల్లాల్లోనూ వాహనాలను అడ్డుకోవాలని పోలీసులకు మౌఖిక ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం ప్రభుత్వంపై నిరసన గళం విప్పిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టనుంది. ప్రధానంగా అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న హామీని నిలబెట్టుకోకపోవడం, బాబు వస్తే జాబు వస్తుందని, లేదంటేనిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న హామీ నిలబెట్టుకోకపోవడంపై ఆ పార్టీ సమరశంఖం పూరించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విశాఖపట్టణం కేంద్రంగా నిర్వహించే మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటుండగా, అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలకు పార్టీ శ్రేణులు సంసిద్ధమయ్యాయి. ఈ మహాధర్నా ఆందోళన కార్యక్రమాలను అడ్డుకునేందుకు టీడీపీ ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. కలెక్టరేట్లకు వచ్చే వాహనాలను అడ్డుకుని జనాన్ని దించేయాలని పోలీసులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మరోవైపు అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలు రుణమాఫీ నెరవేరిందంటూ సంబరాలు చేసుకుని కవ్వింపులకు దిగారు. కొన్నిచోట్ల బరితెగించి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు దిగారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు అధికారపార్టీకే వంతపాడుతూ వైఎస్సార్సీపీ నాయకులను అరెస్టులు చేస్తుండడంతో పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణా జిల్లా పోరంకిలో వైఎస్సార్సీపీ ధర్నాకు సంబంధించిన బ్యానర్‌ను టీడీపీ నాయకులు పీకేసి దగ్ధం చేశారు. ఆ బ్యానర్ స్థానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వచ్ఛ భారత్ బ్యానర్‌ను కట్టారు. దీన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు, మాజీ మంత్రి కే పార్థసారథి, ఇతర నాయకులు ఆందోళనకు దిగగా... టీడీపీ నాయకులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో కారు అద్దాలు ధ్వంసం కాగా ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సమయంలోనే టీడీపీకి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అక్కడికి వచ్చి వైఎస్సార్సీపీ నేతలను దూషించారు. దీన్ని వైఎస్సార్సీపీ నాయకులు కూడా ప్రతిఘటించడంతో తోపులాట జరిగింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి వైసీపీ నాయకులను మీడియాతో మాట్లాడనీయకుండా అదుపులోకి తీసుకుని వ్యానుల్లోకి ఎక్కించి కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ధర్నాకు కార్యకర్తలను తీసుకెళ్లేందుకు బస్సులు ఇస్తామని చెప్పిన ఆర్టీసీ చివరి నిమిషంలో ఇవ్వకుండా అడ్డం తిరగడంతో ఆయన డిపో ఎదుట ధర్నా చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. విశాఖలో భారీగా పోలీసుల మోహరింపు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్న నేపథ్యంలో ప్రజలనుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. ధర్నాలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం 8గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఈ ధర్నా కోసం ఇప్పటికే జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోనూ పార్టీ నిర్వహించిన సన్నాహక సమావేశాలకు కార్యకర్తలతోపాటు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తున్నారు. రుణమాఫీ అమలు, హుద్‌హుద్ తుపాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యంపై మండిపడుతున్నారు. తమ కోసం వై.ఎస్.జగన్ గురువారం విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాకు భారీగా తరలివస్తామని స్పష్టం చేస్తున్నారు. విశాఖపట్నం నగరంతోపాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా భారీగా ప్రజలు తరలిరానున్నారని నిఘావర్గాలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. వై.ఎస్.జగన్ పాల్గొననున్న ఈ ధర్నా విజయవంతమైతే తమకు ఇబ్బందులు తప్పవని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం అడ్డుకునేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తోంది. విశాఖతోపాటు ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో ధర్నాకు వచ్చేవారిని అడ్డుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలందినట్లు తెలిసింది. ‘నేవీ డే’ ఉత్సవాల్లో పాల్గొనేందుకు బుధవారం విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్వయంగా ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిసింది. దీంతో ఉన్నట్టుండి రెండు వేలమంది పోలీసులను నగరమంతా మోహరించారు. మరోవైపు విశాఖపట్నంలో ముందస్తు అనుమతులు లేకుండా ధర్నాలు, ర్యాలీలు, ఇతరత్రా కార్యక్రమాలను నిషేధిస్తూ యాక్ట్ 30ను విధించింది. ఈమేరకు డిసెంబర్ 1వ తేదీతో విడుదల చేసినట్లుగా గురువారం రాత్రి (డిసెంబర్ 4న) ఓ ప్రకటన జారీ చేసింది. డిసెంబర్ 1 నుంచి 31వరకు ఈ నిషేధాజ్ఞలు అమలో ఉంటాయని పేర్కొంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశాలున్నందున కలెక్టరేట్, జిల్లా పరిషత్తు, ఆంధ్రా విశ్వవిద్యాలయం, జీవీఎంసీ, బీచ్‌రోడ్ తదితర ప్రాంతాల్లో ఈ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని చెప్పింది. ఇంత హడావుడిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించే ధర్నాకు ఒక రోజు ముందే హడావుడిగా ఈ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రభుత్వ కుట్రను తిప్పికొడతాం ధర్నాను అడ్డుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వ కుట్రను అడ్డుకుంటామని తేల్చిచెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ రాష్ట్ర పోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం స్పష్టం చేశారు. పోలీసు బలం, అధికార జులుంతో ప్రజాబలాన్ని అణచివేయలేరని చెప్పారు. పార్టీ నేతుల, కార్యకర్తలు, ప్రజలు విరివిగా తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు. -
కొత్తపల్లి అరెస్ట్‌తో ఉద్రిక్తత
నరసాపురం అర్బన్ :ఆర్టీసీ అధికారుల ద్వంద్వ వైఖరిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును గురువారం పోలీసులు అరెస్టు చేయడంతో నరసాపురంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రుణమాఫీ విషయంలో జరుగుతున్న జాప్యానికి నిరసనగా శుక్రవారం అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు మహాధర్నాలను నిర్వహించాలని నిర్ణరుుంచిన విషయం విదితమే. ఏలూరులో జరుగనున్న రైతు మహాధర్నా కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం పన్నాగాలు పన్నింది. ఈ విషయం గురువారం నరసాపురంలో చోటు చేసుకున్న ఘటనతో రుజువైంది. మొదట మహాధర్నాకు, రైతులకు బస్సులు అద్దెకిస్తామని అంగీకరించిన స్థానిక ఆర్టీసీ అధికారులు చివరి నిమిషంలో అడ్డం తిరిగారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలిచింది. ఇదేమి అన్యాయమని ఆర్టీసీ అధికారులను నిలదీసింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిగే రైతు మహాధర్నాకు బస్సులు కేటాయించాలని, ఆర్టీసీ నిబంధనల మేరకు ఒక్కో బస్సుకు ఎంత చార్జీ అవుతుందో, అంత మొత్తాన్ని వెంటనే చెల్లిస్తామని స్థానిక రైతు సంఘాల ప్రతినిధులు వారం రోజుల క్రితమే నరసాపురం ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్కుమార్కు విజ్ఞప్తి చేశారు. ఆయన మొదట అంగీకరించారు. గురువారం బస్సుల అద్దె నిమిత్తం సొమ్ము చెల్లించేందుకు రైతు సంఘాల ప్రతినిధులు వెళ్లగా తమకు ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించలేదని బస్సులు ఇవ్వలేమని పేర్కొన్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు గంటలపాటు కొత్తపల్లి ఆందోళన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆర్టీసీ డిపోకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి చేరుకున్నారు. రైతు మహాధర్నాకు బస్సులు అద్దెకిస్తామని తనకు కూడా చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బస్సులు అద్దెకిచ్చేవరకు కదిలేది లేదని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బస్టాండ్‌లో ఆందోళన చేపట్టారు. డిపో మేనేజర్ క్యాంపులో ఉండడంతో అసిస్టెంట్ డిపో మేనేజర్ ప్రసాద్‌బాబు కొత్తపల్లి, ఇతర నాయకులతో మాట్లాడారు. అయితే బస్సులు ఇచ్చే వరకు కదిలేది లేదని వైఎస్సార్ సీపీ నాయకులు తెగేసి చెప్పారు. తమ సొంతానికి బస్సులు అడగడంలేదని అలాగని అధికార పార్టీ మాదిరిగా ఏ చార్జీ చెల్లించకుండా బస్సులు తీసుకెళతామని చెప్పడం లేదని కొత్తపల్లి అన్నారు. నిబంధనల మేరకు తగిన మొత్తాన్ని చెల్లిస్తే ఎవరికైనా బస్సులు అద్దెకిచ్చే సంప్రదాయం ఆర్టీసీలో ఉందని కేవలం వైఎస్సార్ సీపీ మహాధర్నా విషయంలో మాత్రమే ఇలా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో కొత్తపల్లి ఆందోళన మొదలైంది. బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నరసాపురం, పాలకొల్లు సీఐలు సిబ్బందితో కలిసి బస్టాండ్‌కు చేరుకున్నారు. కొత్తపల్లిని ఆందోళన విరమించమని పలుమార్లు విజ్ఞప్తి చేశారు. చట్ట ప్రకారం తాము బస్సులు అద్దెకడుగుతున్నామని తమ విజ్ఞప్తిని అంగీకరిస్తేనే ఆందోళన విరమిస్తామని పోలీసులతో వైఎస్సార్ సీపీ నాయకులు పేర్కొన్నారు. భారీగా రైతులు, కార్యకర్తలు రాక కొత్తపల్లి సుబ్బారాయుడు బస్టాండ్‌లో ఆందోళన చేస్తున్న విషయం నియోజకవర్గం నలుమూలలా వ్యాపించడంతో నరసాపురం, మొగల్తూరు మండలాల నుంచి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా రైతులు కూడా పట్టణానికి చేరుకున్నారు. కొత్తపల్లికి బాసటగా నిలిచి ఆందోళన కొనసాగించారు. చివరికి ఆర్టీసీ అధికారులు.. తమ సంస్థ ఎండీ నుంచి బస్సులు కేటాయించవద్దని ఆదేశాలు అందాయని తామేమీ చేయలేమని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఇన్చార్జి డీఎం సాయిచరణ్‌తేజ్ వెల్లడించారు. అయితే అదే విషయాన్ని తమకు లిఖితపూర్వకంగా తెలియజేయాలని కొత్తపల్లి పట్టుపట్టారు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కార్యక్రమాలకు బస్సులు అద్దెకి వెళ్లాయని, మొన్న జరిగిన చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆర్టీసీ బస్సులు తరలించారు కదా అని ప్రశ్నించారు. చివరకు బస్సులు కేటాయించలేమని వైఎస్సార్ సీపీ నాయకులు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆర్టీసీ అధికారులు తిరస్కరిస్తూ సంతకం పెట్టి ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆందోళన విరమించారు. పోలీసులు హైడ్రామా, బస్టాండ్ వద్ద ఉద్రిక్తత కొత్తపల్లి ఆందోళన విరమించి బయటకు వస్తుండడంతో ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని.. సహకరించాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, ఇతర నాయకులతో చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఆందోళన విరమించే సమయంలో అరెస్ట్ అంటూ డ్రామాలాడతారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొత్తపల్లిని అరెస్ట్ చేస్తే వేలాది మందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చివరకు సహకరించాలని పోలీసులు చేసిన విజ్ఞప్తిని అంగీకరించి కొత్తపల్లి బస్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్‌కు నడచుకుంటూ వెళ్లారు. కొత్తపల్లి అరెస్ట్ అయి వెళుతుండడంతో దారి పొడవునా స్థానిక వ్యాపారులు, ప్రజలు ఆయనకు సంఘీభావం తెలిపి వెంట నడిచారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద భారీ జనసందోహం కనిపించింది. చివరకు స్టేషన్ బెయిల్‌పై కొత్తపల్లిని విడుదల చేశారు. కొత్తపల్లి సుబ్బారాయుడితో పాటు పార్టీ నాయకులు పాలంకిప్రసాద్, మునిసిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్ షేక్ బులిమస్తాన్, మావూరి సత్యనారాయణ, జిలా ్లలీగల్ సెల్ కన్వీనర్ కామన బుజ్జి, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు నల్లిమిల్లి జోసఫ్, దొంగ గోపి, మొగల్తూరు మండల కన్వీనర్ కర్రి ఏసు, కౌన్సిలర్లు వన్నెంరెడ్డి శ్రీనివాస్, గోరు సత్యనారాయణ, నల్ల కృష్ణంరాజు, పప్పులరామారావు, చెన్నా రమేష్, గుగ్గిలపు మురళి తదితరులు 21 మందిపై కేసు నమోదు చేసినట్టు నరసాపురం సీఐ భాస్కరరావు చెప్పారు. బ్రిటిష్ పాలనే నయం : కొత్తపల్లి చంద్రబాబు పాలన బ్రిటిష్ పాలనకంటే దారుణంగా తయారైందని కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. అరెస్ట్ అయి విడుదలైన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో కష్టాలను ఎదుర్కొంటున్న రైతులు స్వచ్ఛందంగా మహాధర్నాకు తరలిరావాలని చూస్తున్నారన్నారు. ధర్నా విజయవంతం అయితే పరువు పోతుందని భావించిన ప్రభుత్వం ఇలాంటి చిల్లర వ్యవహారాలను చేస్తోందన్నారు. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తనకు చాలా అనుభవం ఉందన్నారు. చట్టప్రకారం డబ్బులు చెల్లిస్తామంటే బస్సులు ఇవ్వబోమని ఆర్టీసీ నిరాకరించడం ఎప్పుడూ చూడలేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ శాఖల పనితీరు అధ్వానంగా తయారైందన్నారు. ముందుగా మేమడిగినప్పుడే బస్సులు ఇవ్వలేమని చెపితే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునే వారమని అన్నారు. -
వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్ట్
-
వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు అరెస్ట్
నరసాపురం : వైఎస్ఆర్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడును పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆర్టీసీ డిపో ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం ధర్నాకు దిగారు. వైఎస్ఆర్ సీపీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మహాధర్నాకు బస్సులను కేటాయించటం లేదంటూ పార్టీ నేతలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొత్తపల్లి మాట్లాడుతూ వైఎస్ఆర్ సీపీపై వివక్షతోనే బస్సులను కేటాయించటం లేదని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బస్సులను కేటాయించిన ఆర్టీసీ...ప్రస్తుతం మహాధర్నాకు బస్సులు ఇవ్వకపోవటం శోచనీయమన్నారు. మహాధర్నాకు బస్సులను కేటాయిస్తామన్న ఆర్టీసీ... చివరి నిమిషంలో మాటమార్చిందని కొత్తపల్లి మండిపడ్డారు. ధర్నాను విజయవంతం కానీవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన అన్నారు. ధర్నాకు దిగిన కొత్తపల్లిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఆర్టీసీ డిపో ఎదుట కొత్తపల్లి సుబ్బారాయుడు ధర్నా
ప.గో: వైఎస్సార్ సీపీ పార్టీపై అధికార పార్టీ టీడీపీ వివక్ష చూపిస్తోందని వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన మహాధర్నాకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం లేదంటూ ఆయన విమర్శించారు. వైఎస్సార్ సీపీపై వివక్షతతోనే బస్సులు కేటాయించడం లేదని ఆయన అన్నారు. ఆర్టీసీ వైఖరికి నిరసనగా ఆయన డిపో ఎదుట ధర్నాకు దిగారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ధర్నాలు చేపట్టనుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై నిరసనగా అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు మహా ధర్నాకు దిగుతున్నాయి. -
కుంటిసాకులు చెప్పొద్దు: కొత్తపల్లి
నర్సాపురం(పశ్చిమగోదావరి జిల్లా): వ్యవసాయ రుణాలు మాఫీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుంటిసాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గుర్తుకు రాకపోతే ఎన్నికల మేనిఫెస్టో చదువుకోవాలని సూచించారు. రుణమాఫీపై గట్టిగా నిలదీస్తుంటే చంద్రబాబు సింగపూర్ షికారు, జపాన్ జంప్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తొలి సంతకం అమలు తీరు ఆపరేషన్ సక్సెస్.. షేపెంట్ డెడ్ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. -
'ప్రజల సొమ్ముతో జల్సాలు చేయడం సిగ్గుచేటు'
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ప్రజల సొమ్ముతో సీఎం చంద్రబాబు జల్సాలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నాయకులు ఆళ్ల నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఎవరి సొమ్మనుకుని చంద్రబాబు విదేశాల్లో పర్యటన చేస్తున్నారని ప్రశ్నించారు. విదేశీ పర్యటనలు కాదు... ముందు రైతులకు రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ప్రజల తరపున తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ రోజురోజుకు బలపడుతోందని అన్నారు. -
ప్రభుత్వం గాఢ నిద్ర వదలాలి
నరసాపురం అర్బన్ : ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలులో తెలుగుదేశం ప్రభుత్వం క్షమించరాని విధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వం గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చి హామీల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గురువారం రుస్తుంబాదలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తపల్లి మాట్లాడారు. పూర్తిస్థాయిలో రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం వంటి హామీలను నమ్మి ప్రజలు టీడీపీని గద్దెనెక్కించారని గుర్తు చేశారు. కానీ ఇప్పటివరకూ రైతు, డ్వాక్రా రుణాలమాఫీ అమలులో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. ప్రభుత్వం తీరు కారణంగా బీమా కంపెనీల నుంచి కూడా రైతులకు సాయం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతులు ఏరోజూ లేరన్నారు. అలాగే ఎంతో ఆశగా రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న డ్వాక్రా మహిళలు నిరాశలో ఉన్నారన్నారు. ప్రభుత్వం గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నా ప్రధానమైన రుణమాఫీ అమలుకు కనీసం కనీస చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చి ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలే ఊడిపోయే పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ ద్వంద్వ విధానాల వల్ల ఇసుక కొరత ఏర్పడి భవన నిర్మాణ కార్మికులు రోడ్డునపడ్డారని అన్నారు. ఇసుక కొరత సమస్యను కేబినెట్ సమావేశంతో పరిష్కరించే అవకాశం ఉండగా, పక్కదేశాలతో చర్చలు, పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు చేస్తుండటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా జపాన్, సింగపూర్, మలేషియా జపం మాని ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. పార్టీ నేతలు కొత్తపల్లి నాని, పప్పుల రామారావు, తిరుమాని బాబ్జి, గోగులమండ సుగుణరావు, ఏఎంసీ చైర్మన్ తిరుమాని రామకృష్ణరాజు, నల్ల కృష్ణంరాజు, రామాని కృష్ణ, మైల ధర్మరాజు, మల్లాడి గంటయ్య పాల్గొన్నారు. ప్రజాపోరాటాలకు సిద్ధం కండి నరసాపురం అర్బన్ : ప్రజా సంక్షేమాన్ని తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ప్రజలు పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్‌లో పోరాటాలు చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గరువారం రాత్రి స్థానిక ఎలక్ట్రికల్ గెస్ట్‌హౌస్ వద్ద నరసాపురం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో కొత్తపల్లి మాట్లాడారు. రాజధాని నిర్మాణం కూడా సవ్యంగా జరుగుతుందనే ఆశ ప్రజల్లో లేదన్నారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో పార్టీ నిర్మాణాత్మక, ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందన్నారు. వచ్చే నెల 5న ఏలూరు కలెక్టరేట్ వద్ద జరిపే ఆందోళనను జయప్రదం చేయాలని, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. ఈనెల 24న స్థానిక తెలగా కల్యాణమండపంలో నరసాపురం నియోజకవర్గ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయీ సమావేశం ఏర్పాటు చేసినట్టు కొత్తపల్లి తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని హజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు, స్థానిక సమస్యల పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలు, అవలంబించాల్సిన ప్రణాళికలను సమావేశంలో చర్చిస్తామన్నారు. పార్టీ నాయకులు కొత్తపల్లి నాని, పాలంకి ప్రసాద్, షేక్ బులిమస్తాన్, పప్పుల రామారావు, చెన్నా రమేష్, పార్టీ పట్టణ, మండల కన్వీనర్లు నల్లిమిల్లి జోసఫ్, దొంగ గోపీ, కావలి నాని, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ సాయినాథ్ ప్రసాద్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు బళ్ల వెంకటేశ్వరరావు, కామన బుజ్జి, వన్నెంరెడ్డి శ్రీనివాస్, గోరు సత్యనారాయణ, సందక సురేష్, కత్తుల శ్యామ్, ముసూడి రత్నం, పతివాడ మార్కెండేయులు, బుడితి దిలీప్, సర్పంచ్‌లు జోషీ, కురుమా సుందరమ్మ, చామకూరి మోహన్‌రావు, అయ్యప్పనాయుడు, కవురు రాంబాబు, సంగాని లక్ష్మణరావు, ఎంపీటీసీలు బొక్క రాధాకృష్ణ, గ్రంధి వనజ, ఈదా జోన్సీ, పులగండం సత్యనారాయణ, మైల వసంతరావు, నేతల నాగేశ్వరరావు, ఇతర నాయకులు దొండపాటి స్వాములు, గుగ్గిలపు మురళి, అడ్డాల శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ , వై.బాబులు, కావలి నాగరాజు, వంగలపూడి ఏషియా, మల్లాడి బుజ్జి, ఇంజేటి రవీంద్ర, అద్దంకి వెంకటేశ్వరరావు(ఏవీఆర్), బొడ్డు ఆశీష్‌కుమార్, బాషాఖాన్ పాల్గొన్నారు. -
కొత్తపల్లి సుబ్బారాయుడుకు తీవ్ర అస్వస్థత
హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని కిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చారు. కొత్తపల్లి సుబ్బారాయుడుకు గుండె, శ్వాసకోస సంబంధమైన సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గత ఏడాది ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. కాగా ఆయనకు మరింత విశ్రాంతి అవసరం ఉందని వైద్యులు చెప్పారు. మరోవైపు కొత్తపల్లి సుబ్బారాయుడు తరపున ఆయన తనయుడు నాని, సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జానకీరామ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. -
కొత్తపల్లి సుబ్బరాయుడికి తీవ్ర అస్వస్ధత
-
మాటకోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్:కొత్తపల్లి
నరసాపురం(ప.గో):మాటకోసం నిలబడే వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు స్ఫష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం సభకు విచ్చేసిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం మాట్లాడిన సుబ్బారాయుడు.. మాటకోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే..అది ఒక్క జగన్ మోహన్ రెడ్డేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు పోరాడిన ఏకైక నేత, మాట కోసం ప్రాణాలను సైతం కూడా లెక్కచేయని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ముందుగా అక్కడికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన సప్తాశ్వ రథం(ఏడు గుర్రాల బండి)పై బస్టాండ్ సెంటర్ నుంచి ఊరేగిస్తూ రాజన్న తనయుడికి స్వాగతం పలికారు. గుర్రపు బండిలో ఎక్కిన యువనేత ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.దారిపొడవునా జననేతపై అభిమానులు పూల వర్షం కురిపించారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. యువనేత రాకతో పులకించిపోయిన నరసాపురం వాసులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో నరసాపురం కిక్కిరిసింది. -
వైసీపీలోకి కొత్తపల్లి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు
-
వైసీపీలోకి భారీ చేరికలు.. కొత్తపల్లి సహా ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బరాయుడు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కారంపూడిలో గురువారం వారు సమావేశమయ్యారు. వైసీపీలో చేరాలన్న తమ అభిమతాన్ని జగన్‌కు తెలియజేయగా, ఆయన సుముఖత వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం మాచర్లలో జరగనున్న వైఎస్ఆర్ జనభేరిలో జగన్ సమక్షంలో సురేష్ పార్టీలో చేరనున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఇదివరకే రాజీనామా చేశారు. సుబ్బరాయుడు నరసాపురం ఎమ్మెల్యే, ఎంపీగా పలుమార్లు ఎంపికయ్యారు. ఇక కారుమూరి గతంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. ఇప్పటికే ఈ జిల్లాల్లో బలోపేతంగా ఉన్న వైసీపీ తాజా చేరికలతో మరింత బలం చేకూరినట్టయ్యింది. క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
వైసీపీలో చేరదాం
నరసాపురం ‘సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే తొలినుంచీ నిజారుుతీగా పాలుపంచుకున్నారు. ప్రజలకు ఇచ్చిన మాటపై నిలబడ్డారు. ఢిల్లీ పెద్దల్ని ఎదిరించారు. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు అన్ని రాజకీయ పక్షాల నాయకుల్ని కలిశారు. తెలుగుజాతి పౌరుషాన్ని నిలబెట్టారు. ఇటు కాంగ్రెస్ పార్టీ.. అటు తెలుగుదేశం పార్టీ రోజుకో మాట చెప్పారుు. ద్వంద్వ విధానాలతో పనిచేశారుు. చివరకు రాష్ట్ర విభజనకు సహకారం అందించారుు. ఈ పరిస్థితుల్లో మనం కాంగ్రెస్ పార్టీలో ఉండటం అనవసరం. టీడీపీలో చేరడం దండగ. సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే చేరదాం’ అని నరసాపురం నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో చెప్పారు. మూకుమ్మడిగా వైఎస్సార్ సీపీలో చేరేందుకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడిపై ఒత్తిడి తెచ్చారు. నరసాపురంలోని విద్యు త్ శాఖ అతిథి గృహంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గస్థారుు కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడిన నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కొత్తపల్లి రాజీనామా చేసిన విషయం విదితమే. అనంతరం ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొత్తపల్లి ఆదివారం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థారుు సమావేశం ఏర్పాటు చేశారు. కార్యకర్తలతోపాటు సర్పంచ్‌లు మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, మండల పరిషత్ అధ్యక్షులతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కులసంఘ నాయకులు పెద్దసంఖ్యలో సమావేశానికి హాజరయ్యారు. ఏ పార్టీలో చేరితే బాగుంటుందన్న విషయమై కొత్తపల్లి కార్యకర్తల అభిప్రాయూలు అడిగారు. దీనికి స్పందిస్తూ రాష్ర్ట విభజన విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో పనిచేసిందని కార్యకర్తలు ఘంటాపథంగా చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఢిల్లీ పెద్దలను ఎదిరించి తెలుగుజాతి పౌరుషాన్ని చాటిచెప్పిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలిస్తే బాగుంటుందని స్పష్టం చేశారు. సీమాంధ్రకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ, రెండు నాలుకల ధోరణితో పనిచేసిన టీడీపీ, విభజనకు మద్దతు పలికిన బీజేపీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకే నిర్ణయం కార్యకర్తల అభీష్టం మేరకు వైఎస్సార్ సీపీలో చేరడానికి కొత్తపల్లి సుముఖత వ్యక్తం చేశారు. దీంతో సమావేశం ‘జై జగన్’ నినాదాలతో మారుమోగింది. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య అనుచరుల సూచనలు, సలహాలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానన్నారు. రాష్ర్టం కలిసే ఉండాలన్న లక్ష్యంతో పోరాడిన పార్టీలోకి వెళ్లాలనే యోచనలో తాను ఉన్నట్టు తెలిపారు. అతిగా ఆలోచన చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని, లక్ష్య సాధన కోసం దూసుకుపోయే వ్యక్తికి అండగా నిలబడటం మంచిదని పరోక్షంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల రాష్ర్టం రెండుగా చీలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రా6ష్ట విభజన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయన్నారు. విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే సీమాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో బాలుడి నుంచి వృద్ధుల వరకూ భాగస్వాములయ్యారని, ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ సంఘాలు చారిత్రక పోరాటం చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. -
నర్సాపురం MLA కొత్తపల్లి సుబ్బారాయుడు జంప్?
-
ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడికి అస్వస్థత
హైదరాబాద్ : మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యుడు కొత్తపల్లి సుబ్బారాయుడు గురువారం అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు నిమ్స్‌కు తరలించారు. కొత్తపల్లికు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన ఆరోగ్యంపై వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలిపారు.