ఏలూరు : ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్ఆర్ సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మండిపడ్డారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ మాట్లాడుతూ... 15 నెలలు పాలనలో ప్రత్యేక హోదా ఎందుకు గుర్తుకు రాలేదంటూ చంద్రబాబును వారు ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం న్యూఢిల్లీలో ధర్నా చేపట్టారని... ఆ తర్వాత కూడా చంద్రబాబు మేల్కొలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. సీఎం హోదాలో చంద్రబాబు లింగ వివక్ష వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. మహిళలకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళీ డిమాండ్ చేశారు.