'గోదావరి డెల్టా ఎండిపోవడానికి చంద్రబాబే కారణం' | YSR Congress party leaders takes on Chandrababu | Sakshi
Sakshi News home page

'గోదావరి డెల్టా ఎండిపోవడానికి చంద్రబాబే కారణం'

Published Tue, Dec 29 2015 7:28 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

YSR Congress party leaders takes on Chandrababu

ఏలూరు : గోదావరి డెల్టా ఎండిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆరోపించారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లోని గ్రామాల్లోని పొలాలను వారిద్దరు పరిశీలించారు.

అనంతరం కొత్తపల్లి సుబ్బారాయుడు, మేకా శేషుబాబు మాట్లాడుతూ... పట్టిసీమ ప్రాజెక్టు వల్ల గోదావరి జిల్లాలు ఎండిపోతాయన్న తాము ఆనాడు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వ వైఫల్యం కారణంగానే గోదావరి జిల్లాల్లో సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా రేపు పాలకొల్లులో రైతు గర్జన నిర్వహించనున్నట్లు వారు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement