అసెంబ్లీలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నలకు
సమాధానం చెప్పలేకపోతున్నారు
టీడీపీ సభ్యుల తీరుపై వైఎస్సార్ సీపీ నేత ‘కొత్తపల్లి’ ఎద్దేవా
జంగారెడ్డిగూడెం రూరల్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌హనరెడ్డి అడిగే ప్రశ్నలకు అధికార పార్టీ సభ్యులు సమాధానం చెప్పలేక ఏమి మాట్లాడుతున్నారో వారికే అర్థంకాని పరిస్థితిలో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు చమత్కరించారు. జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్ సీపీ మహిళా పట్టణ అధ్యక్షురాలు సుంకర నాగదేవి ఇంటి వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుబ్బారాయుడు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ప్రజా సమస్యలను లేవనెత్తి అధికార పార్టీ సభ్యులను నిలదీస్తున్నారన్నారు. అడిగిన ప్రశ్నలకు అధికార పార్టీ ముఖ్యమంత్రి, మంత్రులు సమాధానం చెప్పలేక దాటవేసే ధోరణిలో వ్యవహరిస్తున్నారన్నారు.
సభా ప్రాంగణంలో ప్రజా సమస్యలపై జగన్ అధికార పార్టీని ప్రశ్నిస్తున్న తీరు చూసిన ప్రజలు మెచ్చుకుంటున్నారని సుబ్బారాయుడు అన్నారు. ఎంతో గౌరవప్రదంగా జరగాల్సిన అసెంబ్లీలో అధికార పార్టీ మంత్రుల దుర్భాషలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడటం సరైంది కాదని చేతనైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేరవేర్చే ధోరణిలో ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పామాయిల్, పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. హామీలన్నీ నీటి మూటలే అయ్యాయన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కష్టాలు తీర్చాలని కోరారు. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పట్టణ అధ్యక్షుడు తాతకుంట్ల రవికుమార్, వార్డు కౌన్సిలర్లు ముప్పిడి అంజి, తాతకుంట్ల వెంకట నాగలక్ష్మి, పార్టీ నాయకులు చనమాల శ్రీనివాస్, సాధనాల కరుణ్, కొత్తపల్లి జానకిరామ్, చెన్నా రమేష్, యడ్లపల్లి బాబులు, ఏవీఆర్ తదితరులు పాల్గొన్నారు.
పాపం.. అధికార పక్షం
Published Wed, Mar 16 2016 12:42 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement