ఆర్టీసీ డిపో ఎదుట కొత్తపల్లి సుబ్బారాయుడు ధర్నా | kothapalli subbarayudu protest against rtc | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ డిపో ఎదుట కొత్తపల్లి సుబ్బారాయుడు ధర్నా

Published Thu, Dec 4 2014 12:10 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

kothapalli subbarayudu protest against rtc

ప.గో: వైఎస్సార్ సీపీ పార్టీపై అధికార పార్టీ టీడీపీ వివక్ష చూపిస్తోందని వైఎస్సార్ సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆరోపించారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన మహాధర్నాకు ఆర్టీసీ బస్సులు కేటాయించడం లేదంటూ ఆయన విమర్శించారు.  వైఎస్సార్ సీపీపై వివక్షతతోనే బస్సులు కేటాయించడం లేదని ఆయన అన్నారు. ఆర్టీసీ వైఖరికి నిరసనగా ఆయన డిపో ఎదుట ధర్నాకు దిగారు.

 

రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ధర్నాలు చేపట్టనుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై నిరసనగా అన్ని కలెక్టరేట్ల వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణులు మహా ధర్నాకు దిగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement