వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడిగా ఆళ్ల నాని
- పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడుగా కొత్తపల్లి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సభ్యునిగా ఆళ్ల నానిని నియమించారు. నాని ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. నానికి పార్టీ అత్యున్నత విభాగమైన పీఏసీలో స్థానం కల్పించినందున పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష పదవిలో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడును జగన్ నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.