ఆళ్ల నాని(ఫైల్)
ఏలూరు(పశ్చిమగోదావరి జిల్లా): ప్రజల సొమ్ముతో సీఎం చంద్రబాబు జల్సాలు చేయడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ నాయకులు ఆళ్ల నాని, కొత్తపల్లి సుబ్బారాయుడు విమర్శించారు. ఎవరి సొమ్మనుకుని చంద్రబాబు విదేశాల్లో పర్యటన చేస్తున్నారని ప్రశ్నించారు.
విదేశీ పర్యటనలు కాదు... ముందు రైతులకు రుణమాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుంటే ప్రజల తరపున తమ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ రోజురోజుకు బలపడుతోందని అన్నారు.