
పట్టిసీమను ఏవిధంగా జాతికి అంకిత ఇస్తారు?
ఏలూరు(ప.గో): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అభద్రతా భావం నెలకొందని.. దాంతోనే ఆయన పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అసలు పట్టిసీమ పనులు పూర్తికాకుండా పట్టిసీమను ఏ విధంగా జాతికి అంకితమిస్తారని వైఎస్సార్ సీపీ నేతలు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఘంటా మురళిలు ప్రశ్నించారు. పూర్తికాని ప్రాజెక్టును ప్రారంభించడమంటే పంద్రాగస్టునాడు ప్రజలను మోసగించడమేనన్నారు.
దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు తుగ్లక్ పాలన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు విదేశీ యాత్రల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న కారణంగానే ప్రత్యేక హోదా రావట్లేదన్నారు. తాడిపూడి డైవర్షన్ తో పశ్చిమ రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.