
'8 నెలల్లోనే చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలు'
నరసాపురం(ప.గో):ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో నిర్వహించిన రైతు దీక్షను విజయవంతం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ముందుగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎనిమిది నెలల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజ స్వరూపం బట్టబయలైందని ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు.
బాబు పాలనపై ప్రజలు విసుగు చెంది రైతు దీక్షకు అధిక సంఖ్యలో తరలివచ్చారని కొత్తపల్లి పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వైఎస్సార్ సీపీ సమరభేరీ మోగిస్తూనే ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిత్యం ఆందోళనలతో కళ్లు మూసుకున్న చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని కొత్తపల్లి తెలిపారు.