మాటకోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్:కొత్తపల్లి | kothapalli subbarayudu joins in ysrcp | Sakshi
Sakshi News home page

మాటకోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్:కొత్తపల్లి

Published Fri, Mar 14 2014 7:05 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

kothapalli subbarayudu joins in ysrcp

నరసాపురం(ప.గో):మాటకోసం నిలబడే వ్యక్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు స్ఫష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నరసాపురం సభకు విచ్చేసిన జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం మాట్లాడిన సుబ్బారాయుడు.. మాటకోసం నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే..అది ఒక్క జగన్ మోహన్ రెడ్డేనని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యం ఉంచేందుకు పోరాడిన ఏకైక నేత, మాట కోసం ప్రాణాలను సైతం కూడా లెక్కచేయని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

 

ముందుగా అక్కడికి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన సప్తాశ్వ రథం(ఏడు గుర్రాల బండి)పై బస్టాండ్ సెంటర్ నుంచి ఊరేగిస్తూ రాజన్న తనయుడికి స్వాగతం పలికారు. గుర్రపు బండిలో ఎక్కిన యువనేత ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.దారిపొడవునా జననేతపై అభిమానులు పూల వర్షం కురిపించారు. జై  జగన్ నినాదాలతో హోరెత్తించారు. యువనేత రాకతో పులకించిపోయిన నరసాపురం వాసులు బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారీగా తరలివచ్చిన జనంతో నరసాపురం కిక్కిరిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement