నరసాపురంలో పెరిగిన భక్తుల రద్దీ | narasapuram is fullfilled with huge piligrims | Sakshi
Sakshi News home page

నరసాపురంలో పెరిగిన భక్తుల రద్దీ

Published Wed, Jul 15 2015 3:27 PM | Last Updated on Wed, Aug 1 2018 5:04 PM

narasapuram is fullfilled with huge piligrims

నరసాపురం (పశ్చిమగోదావరి): తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కోటగుమ్మం తొక్కిసలాట ఘటన ప్రభావం నరసాపురంపై పడింది. నిన్నటి ఘటనతో పెద్ద సంఖ్యలో భక్తులు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తరలి వచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు సుమారు రెండు లక్షల మంది ఇక్కడ పుష్కర స్నానాలు చేశారని అధికారుల అంచనా వేశారు. కాగా, కాశీ నుంచి వచ్చిన దిగంబర సాధువులు, సంతులు బుధవారం గోదావరి మాతకు హారతులు సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement