ప.గో: బాపు స్మృతి చిహ్నం ప్రపంచంలోనే మొదటిగా నరసాపురంలో గోదావరి చెంతన రూపుదిద్దుకుంది. తెలుగువాళ్ల గీతను మార్చిన నిశబ్ద గీతాకారుడి కీర్తిని భవిష్యత్ తరాలు స్మరించుకునేలా బాపు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు పల్లె రఘునాథ రెడ్డి, పీతల సుజాత, మాణిక్యాలరావు బాపు విగ్రహాన్ని ఆవిష్కరించిన వారిలో ఉన్నారు.
చిత్రకారుడిగా, రసరమ్య దృశ్య కావ్యాలను వెండి తెరపై తనదైన శైలిని ఆవిష్కరించిన దర్శకుడిగా, హాస్యర్షిగా ప్రపంచ గుర్తింపు పొందిన బాపు జ్ఞాపకం ఆయన పురిటిగడ్డలో ఇక పదిలమనే చెప్పవచ్చు.