
మహిళల ఆర్థికాభివృద్ధే ధ్యేయం
నరసాపురం రూరల్ : దేశంలోని అన్ని గ్రామాల్లో మహిళలకు ఆర్థిక పరిపుష్టి కల్పించాలన్నదే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) నిర్మలా సీతారామన్ అన్నారు. ఆమె దత్తత చేసుకున్న పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాలకు ఆదివారం రూ.కోటీ 2 లక్షల ఎనభైవేల చెక్కులను ఆదివారం మహిళలకు అందజేశారు. పెదమైనవాని లంకలో 9 స్వయం సహాయక గ్రూపులకు సంబంధించి రూ 25.25 లక్షలు, తూర్పుతాళ్లులోని 22 స్వయం సహాయక గ్రూపులకు సంబంధించి రూ.77.55 లక్షల రివాల్వింగ్ ఫండ్‌ను ఆయా సభల్లో మహిళలకు అందించారు.
సముద్ర కోత నుంచి కాపాడతా
సముద్రకోత నుంచి పెదమైనవానిలంక గ్రామాన్ని కాపాడేందుకు కృషి చేస్తానని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆదివారం పెదమైనవానిలంక గ్రామాన్ని సందర్శించిన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు. గ్రామం తరచూ సముద్రకోతకు గురవుతున్న విషయాన్ని కలెక్టర్ కె.భాస్కర్, సర్పంచ్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సముద్ర కోత నివారణపై అధ్యయనం చేసి చర్యలు చేపడతామన్నారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు. సముద్ర తీర ప్రాంతాన్ని అనుకుని ఉన్న చినమైనవానిలంక, బియ్యపుతిప్ప గ్రామాలను దత్తత తీసుకోవాలని స్థానిక బీజేపీ నాయకులు కేంద్రమంత్రికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, ఎంపీ గంగరాజు, ఎమ్మేల్యే బండారు మాధవనాయుడు ఆమె వెంట ఉన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
నరసాపురం (రాయపేట) : ఓఎన్‌జీసీ ఫీల్డ్ ఆపరేటర్స్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌యూనియన్ నాయకులకు హామీ ఇచ్చారు. మొగల్తూరు రోడ్డులోని ఓఎన్‌జీసీ కార్యాలయం ఎదురుగా ఉన్న జెండా స్థూపం వద్ద జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓఎన్‌జీసీలో జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలను తన దృష్టికి తీసుకురావాలని సూచిం చారు. సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని చెపాపరు. కార్మికుల ఉద్యోగ భద్రతకు తనవంతు ప్రయత్నం చేస్తానని హమీ ఇచ్చారు. ఈ సందర్భంగా యునియన్ నాయకులు పరకాల దంపతులను ఘనంగా సత్కరించారు. ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, యూనియన్ గౌరవ అధ్యక్షుడు కట్టా వేణుగోపాల్, అధ్యక్షుడు ఎంఎస్‌ఆర్ మూర్తి, ప్రధాన కార్యదర్శి పాలంకి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు కె.మాధవరావు తదితరులు పాల్గొన్నారు.