తణుకులో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు, తణుకు అసెంబ్లీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. జగన్‌మోహనరెడ్డిని ఎదుర్కోవడం కోసం అన్ని పార్టీలు చీకట్లో ఒప్పందం కుదుర్చుకున్నాయని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.