కరెంట్‌ కాటుకు ఒకరి బలి | one dies of vidyut shock | Sakshi
Sakshi News home page

కరెంట్‌ కాటుకు ఒకరి బలి

Published Sat, May 13 2017 11:21 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM

one dies of vidyut shock

బెళుగుప్ప (ఉరవకొండ) : బెళుగుప్ప మండలం నరసాపురంలో కరెంట్‌ కాటుకు హనుమంతరాయుడు(45) అనే వ్యక్తి బలయ్యారు. ఏఎస్‌ఐ విజయనాయక్‌ కథనం మేరకు.. కొత్తగా కడుతున్న ఇంటికి మోటార్‌ సాయంతో నీరు పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై, స్పృహతప్పి పడిపోయినట్లు వివరించారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమాస్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement